ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
ఇంద్రజిత్తు నికుంభిలయాగ మొనర్చుట
“ఈ మహాబలుఁడేఁగె; నిటమీఁదఁదనకు
హోమవిఘ్నము సేయ నోప రెవ్వరును.”
నని నికుంభిల కేఁగి 1689యా నిశాచరుఁడు
ననలుని రుధిరమాంసాదులఁదనిపి
హోమంబు సేయుచునుండె. నిచ్చటను
రాముఁడా పడుమటి రభసమంతయును[వా.రా. సర్గ 83]
విని జాంబవంతుని వేగంబె పిలిచి:
“విన వచ్చెఁబడుమట విపులఘోషంబు
హనుమంతునికి నెట్టిహాని యైనదియొ?
ఘనమైన యట్టి యా కలకలంబరయఁ
జనుము రయంబున సైన్యంబుతోడ.”
ననిన ఋక్షేశుండు నతిశీఘ్రవృత్తి
బలువడి భల్లూకపతు లుగ్రబలులు
కొలిచి యప్పుడు నూఱుకోటులు రాఁగ
వడిగొని పశ్చిమద్వారంబు దెసకు
నడచుచోఁ గనియె నన్నడుమ వాయుజుని.
వాయుజుండును జాంబవంతుని1690ఁజూచి
యా యింద్రజిత్తు కార్యంబెఱిగించి
“యీ వార్త రామున కెఱిఁగించివత్తు;
నే వచ్చునందాఁక నే నున్న యెడను
గాచి యా వాకిటఁగదలకయుండు
మేచినపగవాని నేమఱవలవ.”
దని పంచి వచ్చుచో ననతిదూరమున
హనుమంతుఁబొడగని యా రాఘవుండు
“నితని ముఖస్థితి యేమొకో! కార్య
గతి దోచుచున్నది గనుఁగొన నిప్పు!
డిది యే1691మొకో!”యని యిచ్చఁజింతింపఁ
గదిసి వాయుజుఁడు రాఘవునకు మ్రొక్కి:
“దేవ! యేమెల్లను దెంపుమై దాన
వావలి తోడఁగయ్యంబొనరింప
మాముందఱనె తెచ్చి మది శంకలేక
భూమిజతలఁద్రుంచెఁ బొరి నింద్రజిత్తు.
డా వాకిటికిని ఋక్షాధీశుఁబెట్టి
యీ వార్త సెప్ప నే నేఁగుదెంచితిని.”
ననువార్త సెవులలో నడరకమున్నె
ఘనవాతనిహతవృక్షంబును బోలె
నతులితశోకాగ్ని యడరి దహింప
ధృతి దూలి రఘుకులాధిపుఁడు మూర్ఛిల్లి
యవనిపైఁబడియున్న నతిభీతిఁబొంది
ప్లవగవల్లభులెల్లఁ బలవించుచుండఁ
గైకొని యపుడు లక్ష్మణుఁడన్నఁదొడల
పైకి రాఁదిగిచి సంభ్రమచిత్తుఁడగుచు:

  1. ↑యచట నిశాటు,ఁడ
  2. ↑తోడ - నా
  3. ↑మియో య
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )