| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
“నక్కటా! రామ! నీయట్టి యుత్తమున కిక్కళంకము వుట్టెనే యిట్టిచోట! తలపోయఁగ ‘జయంబు ధర్మంబునందు గల.’దనుమాట నిక్కము గాకపోయె! నదియె నిక్కంబైన నకటా! నీయట్టి సదయచిత్తున కేల సంతాపమొదవు! నీచేత రావణునికిఁజావు లేక యీ చందమున నుండ1692నేమిగారణము? జానకి కేల యీ చావు సిద్ధించుఁ? గాన ధర్మంబుకంటె ఘన మధర్మంబు. త్యాజ్యంబు గాదని తలపోయ కట్టి రాజ్యంబు విడిచి యరణ్యంబులందుఁ దిరుగవచ్చితి; మిందుఁదిరిగెడిమనకుఁ బురుషార్థములు సిద్ధిఁబొందునే1693యధిప! యవనీశ! నిర్ధను లగువారు సేయు వివిధయత్నంబులు వెస నిదాఘమున నడరెడు సెలయేఱు లడఁగెడుభంగిఁ జెడిపోవు నని బుధుల్ సెప్పఁగా వినమె? ధనము లార్జించిన ధర్మకామాదు లనుపమస్థితితోడ నధిప, సిద్ధించు. నెసగంగ నర్థంబు లెవ్వానికొదవు వసుధ వానికి నెల్ల వారుఁజుట్టమ్ము. లర్థంబు గలవాఁడె యరయంగఁబురుషుఁ డర్థంబె విద్యయు; నర్థంబె నేర్పు; నర్థంబె కీర్తియు; నర్థంబె పెంపు; నర్థంబె కులమును; నర్థంబె గుణము; నర్థంబె శీలంబు; నర్థంబె బలము; నర్థంబె పుణ్యంబు; నర్థంబె భూమి; యర్థంబె ప్రాణంబు; నర్థంబె రూపు; నర్థంబె ఖ్యాతియు; నర్థంబె నీతి; యర్థంబె భూతియు; నర్థంబె మతియు; నర్థంబె యెఱుకయు; నర్థంబె సుఖము; నర్థంబె శుచియును; నఖిలకా1694మ్యములు నర్థసంపన్నున కఱచేతి వరయ. నధికులు వేద1695వేదాంగ 1696పారగులు బుధులు 1697దూర్వంబులఁబూతాక్షతముల నర్థంబు గలవాని నమరఁబూజింతు. రర్థి మోక్షార్థులై యడవుల నుండు మునిపుంగవులు కందమూలంబు లిచ్చి ధనవంతుఁడగువాని దర్శింతు రెలమిఁ. బాయక మంగళపాఠకా1698నేక గాయకకులములుఁగలవానిఁ బొగడు. నున్నతకుచములు నురునితంబములు నన్నువనడుములు నలసయానములు బింబోష్ఠములుఁజంద్రబింబాననములు నంబుజలలితంబులగు లోచనములు రోలంబకులనీలరుచిరధమ్మిల్ల లీలాలకంబులు లేఁతసిగ్గులును నొయ్యారి1699వగలును నోరచూపులును దియ్యమాటలుఁగామదీమంబు లనఁగ నెలయించు నేర్పులు నెలజవ్వనములుఁ గలకాంత లర్థంబు గలవృద్ధునైన మనమార1700వలతురు మహితభోగేచ్ఛ; ధనహీను నొల్లరు1701తరుణునినైన. లేమియే నరకంబు; లేమియే రుద్ర భూమియు; లేమియే భూరిశోకంబు; లేమియే రోగంబు; లేమియే మృతియు; లేమియే పాపంబు; లేమియే జరయు; లేమియే కష్టంబు; లేమియే కఱవు; లేమియే దైన్యంబు; లేమియే వగపు; లేమియే సకలమాలిన్యంబుఁదలఁప; లేమియే సర్వంబు లేమి. కావునను, నచ్చెరువుగ రాజ్యమంతయు విడిచి వచ్చినప్పుడెకాదె వచ్చె నాపదలు. జానకిమరణంబు సైరింపఁజాల; మానవలోకేశ! మార్గణావళుల విసువ1702క రాక్షసాన్వితముగా లంక మసలక 1703యింక భస్మంబు సేసెదను.” |