ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
లక్ష్మణుఁడు యుద్ధమునకు వెడలుట
అని పల్కి రఘురాముఁడపు డనుజన్ముఁ
గనుఁగొని:“యనఘాత్మ! ఘనుఁడింద్రజిత్తు
ఘనతిరోహితతిగ్మకరుభంగి నింగి
ఘనమాయఁ దనగతి గానరాకుండఁ
జరియించు నవ్వీరు శక్రాదిసురలు
దురమునఁగడిమిమైఁదొడరంగఁజాల.
రిమ్మంత్రివరులతో నివ్విభీషణుఁడు
నెమ్మి నయ్యాగంబు నీకుఁజూపెడిని.
హోమమధ్యంబున నుగ్రరాక్షసుని
సౌమిత్రి! నీఁవేగి సమయింపు వేగఁ.
బటుతరభల్లూకబలములఁగూడి
చటులవిక్రముఁడైన జాంబవంతుండు
ఘనతరవిజయవిక్రమధురంధరుఁడు
హనుమంతుఁడును దోడ నరుగుదెంచెదరు.”
అని పల్కి రఘురాముఁడనుజన్మునకును
వనధి యిచ్చినయట్టి వజ్రకవచము
ఘనతరఖడ్గంబుఁగవదొనల్‌ విల్లుఁ
బెనుపొందగా నిచ్చి ప్రీతితో మఱియు
వరభూషణంబులు వలనొప్ప నిచ్చి
యరుదైన పేర్మి నిట్లనుచు దీవించె:
“ననిశంబు జయము శ్రీహరి యొనఁగూర్చు;
ఘనతరశుభము శంకరుఁడిచ్చు;నజుఁడు
నీ కాయు1709వు ఘటించు; నిఖిల దేవతలుఁ
గైకొని దిశలందుఁగాతురు నిన్ను;
ననలుండు ననిలుండు నభిరక్షణంబుఁ
దనరఁజేయుదురు ముందఱ వెన్క నీకు.’
ననవుడు లక్ష్మణుండప్పు డుప్పొంగి
ధనువందుకొని తనుత్రాణంబుఁదొడిగి
కవదొనల్‌ ధరియించి ఖడ్గంబుఁదాల్చి
వివిధభూషణముల విలసితుండగుచు
నా రాముఁగనుఁగొని యతిభక్తి మ్రొక్కి
ధీరవాక్యంబులఁదెఱఁగొప్పఁబలికె:
“నలినాకరములో1710న నలి మరాళములు
గలగొనఁబడునట్టిగతి గానఁబడఁగ
నా తెల్లగఱులబాణము లింద్రజిత్తు
వే తూరి చని నేఁడు వెస లంకఁబడును;
విపులతూలస్తోమవిధమున వాని
నృపవీర! విశిఖాగ్ని నీఱుసేసెదను.”
అని యథోచితముగా నా రామచంద్రు
మనమార వీడ్కొని మహిత1711తేజమున
గరుడని నెక్కిన కమలాక్షుపగిదిఁ
గరువలిసుతు నెక్కి కర మొప్పుమిగిలి
పంబి గోలాంగూలబలములు గొల్వ
జాంబవదాదులు సనుదేరఁగదలి
బలువిడి యటకు ముప్పది యోజనములు
గల నికుంభిల కేఁగి ఘనతరంబుగను
నురుమదేభంబులు నుత్తమాశ్వములు
నరిది రథంబులు నలరు కాల్బలము
స్తోమమై సవనంబుచుట్టును గాచి
భీమమై యెందు నభేద్యమై తనరి
బలములన్నియు నలబలమెల్ల నుడిగి
యలలులేనట్టి యా యంబుధికరణి

  1. ↑వొసగును
  2. ↑నినవ
  3. ↑వేగమున
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )