| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నున్న రాక్షససేన నొప్పారఁజూచి సన్నుతశస్త్రాస్త్రసంపన్నుఁడైన సౌమిత్రితో విభీషణుఁడిట్టులనియె: “నీ మహాసైన్యంబు నిషుపరంపరల[వా.రా. సర్గ 86] నెడల నేసినఁగాని యింద్రారి మనకుఁ బొడగానరాఁడు; నీ భూరిబాణములఁ దూలింపు మీసేనఁ దొలితొలి;1712పిదప హాలాహలాభీలమైన శరాగ్ని దొరకొన్నహోమంబు దుదిముట్టకుండ దురితాత్ముఁడగువానిఁద్రుంపుము వేగ.” మనవుడు సౌమిత్రి యత్యుదగ్రతను గనుఁగొనలందగ్ని కణములు దొరుగఁ బలుతెఱంగుల బాణపంక్తులు వఱపె. నలఘుబలోదగ్రులై పెల్లు రేఁగి తరుచరాధిపులును దరులును గిరులుఁ బొరిఁబొరి వైచి రప్పుడు 1713సొంపుమిగిలి. యసురులు నత్యుగ్రులై వనచరుల వెసఁబరిఘంబులు విసరివైచియును గదలచే మోఁదియుఁగరవాలములను విదళించియును విసరివైచియును గదలచే మోఁదియుఁగరవాలములను విదళించియును బహువిధములఁజెలఁగి మఱియును బెక్కైన మహితశస్త్రముల నుఱక నొప్పించిరి1714యుగ్రత నిట్లు మార్ప1715డు నసురుల మర్కటేశ్వరుల యార్పుల నా లంక యట్టిట్టువడఁగ. నంతఁబోవక రాక్షసావలిఁదఱిమి యెంతయుఁగడిమి ననేక1716మార్గములఁ గపుల నొప్పింపంగఁ గపులును గవిసి కుపితులై రాక్షసకోటి నొప్పింప విఱిగి రాక్షసులెల్ల వెస నింద్రజిత్తు మఱుఁగున కరిగిరి1717మదమెల్లఁదక్కి. యా లోన నొక్కొక్క యాహుతిఁబట్టి యాలోలకీలమహావహ్ని నసుర పరగంగ నిన్నూటపదియాహుతులకు దొరకొని యొక నూటతొమ్మిది వేల్చి1718 యురుతరసత్త్వులై యుగ్రతఁబేర్చి ధరణి గంపింప నత్తరుచరవరులు బలువిడి నేతెంచి పై నార్చుటయును గలుషతఁజిత్తంబు గలఁగినఁజేతి యాహుతి యటు వైచి యా యింద్రజిత్తు డాహవోన్ముఖుఁడై మహారోషమెసగఁ గన్నుల నిప్పులు గ్రమ్మంగ భీష ణోన్నతి రథమెక్కి యుగ్రకార్ముకము ధరియించి మించి యుద్ధతి నేఁగుదెంచి తరుచరసేనలఁ1719దఱిమి నొప్పింప దనుజేశుతమ్ముఁడత్తఱి రాముతమ్ముఁ గొనిపోయి వన మతిక్రూరుఁడై చొచ్చి[వా.రా. సర్గ 87] సమధికంబగు నీలజలదంబువోలెఁ గొమరారుచున్న న్యగ్రోధంబుక్రిందఁ దొడరి యా యింద్రజిత్తుఁడు సేయఁజేయఁ గడమచిక్కినహోమకర్మంబుఁజూపి “సౌమిత్రి! చూచితే సమరంబుకొఱకు హోమ మిక్కడ దైత్యుఁడుగ్రతఁజేసి బలి భూతములకిచ్చి పావకువలనఁ గలశక్తి నహితులఁ1720గడఁగి జయించుఁ. దొల్లియు నిటుచేసి 1721దుర్మదవృత్తి బల్లిదుఁడై యనిఁబర్జన్యు గెలిచె. నిప్పుడు నిటు చూడు, మీ హోమవహ్ని నొప్పార వెడలుచు నున్నది యరద మరుణనేత్రంబుల నరుణకేశముల నరుణవస్త్రంబుల నరుణమాల్యముల జడిగొన్ననల్లనిసారథితోడఁ గడు నెఱ్ఱనగు తురంగంబులతోడ. వాఁడు గ్రమ్మఱ వచ్చి వరహోమశక్తి వేఁడిమి నెంతయు వెడలించి మించి యీ రథంబెక్కిన నింద్రాదులైన నా రావణాత్మజు నని గెల్వ1722లేరు. కాన, యింతటిలోనఁగడఁగి సౌమిత్రి! వాని నీ పటుశరవ్రాతంబుచేతఁ బొలియింపు.”మనుడు ,నుప్పొంగి లక్ష్మణుఁడు తలఁకక కార్ముకధ్వని చెలంగింపఁ గరవాలహస్తుఁడై కవచంబుఁదొడిగి యరుదార శిఖివర్ణమగు రథంబెక్కి తన రూపు సూపిన దశకంఠసుతునిఁ గనుఁగొని సౌమిత్రి కడు1723నల్కఁబలికె: |