| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నని పెక్కు భంగుల నసురకామినులు 1884పనవుచుండఁగ విని పంక్తికంధరుఁడు చింతాసమాకులచిత్తుఁడై యపుడు వంత నొందుచుఁగొంతవడి యూరకుండి[వా.రా. సర్గ 96] చండకాలవ్యాళ సమలీల దోప నిండుకోపంబున నిట్టూర్పు వుచ్చి యవుడులు దీటుచు నందంద కన్నుఁ గవల నిప్పులు రాలఁగా నుగ్రుఁడగుచు నురువడి నల్గి యుద్ధోన్మత్తు మత్తు సొరిది విరూపాక్షుఁజూచి:“మీ రెలమి దందడి సింహనాదములుఁదూర్యములు నందంద మ్రోయఁగా ననికి నే తేరుఁ” డని పల్కి భయమున నా నిశాచరులు విని యూరకున్న నా విధము వీక్షించి: ‘యాలంబునకు వేగ యత్నంబు సేయుఁ డేల యుత్సాహంబు లిటు1885దక్కియుండ?” ననిన వారరిగి పుణ్యాహకర్మంబు లొనరించి సన్నాహ మొప్ప నేతెంచి యా రాక్షసేంద్రున1886కవనతులైన యా రాక్షసులఁజూచి యతఁ1887డిట్లు పలికె: “నానాఁటి కిబ్భంగి నా బలంబెల్ల హీన1888మయ్యెను1889భృత్యులెల్లఁజచ్చుటయు నమరేంద్రవిక్రముఁడైన యా ఖరుఁడు నమితబలోదగ్రుఁడగు నింద్రజిత్తు నా కుంభకర్ణుండు నా ప్రహస్తుండు నా కుంభుఁడును శూరుఁడగు నికుంభుండు భీమవిక్రమవిజృంభితుఁడతికాయుఁ డా మహాకాయుండు నమ్మహోదరుఁడు నా సురాంతకుఁడును నా నరాంతకుఁడు భాసురయశుఁడకంపనుఁడుఁగంపనుఁడు నాకాధిపతినైన నని నోర్చువారు నాకునై పొలిసిరి; నా గర్వ మడఁగె. నటుగాన శత్రుల నందఱఁదునిమి పటుపరాక్రమమునఁబగ నీఁగువాఁడ. మీఱి నా శరములు మిన్ను1890లు ముట్ట నేఱులు జలధులు నెఱుఁగరాకుండ నఖిలంబుఁగప్పుచు నచ్చెరువార నిఖిలవానరులను నేఁడు నిర్జింతు. నేపున నల్క నే నేయుబాణమ్ము లా పుంఖముగఁగాఁడి యగచరాస్యములు నాళముల్ 1891గలిగిన నవపంకజములఁ బోలంగ నేఁ డాజిభూమిఁగైసేతు. “మగలుఁదనూజులు 1892మఱిసహోదరులుఁ దెగి రింక నెవ్వరు దిక్కు?మా’కనుచు లంకాపురస్త్రీలు లలిఁదూలి1893సోలి యింక1894 నీ శోకాబ్ధి 1895నెట్లు మున్గెదరు? మార్తురఁబొలియించి మఱి పురజనుల యార్తిఁబాపుదు; శోక మడఁచెదఁగడఁగి; నేఁడాజిఁబ్రతిపక్షనికరసైన్యముల వాఁడిబాణంబుల వడిఁద్రుంచివైచి కరమొప్ప ఫేరవకంకగృధ్రములుఁ బొరిఁబిశాచప్రేతభూతజాలములుఁ 1896దనివోవ మాంసరక్తంబులఁదృప్తి యొనరింతు.”ననుచు యుద్ధోన్మత్తు మత్తు నక్షీణబల విరూపాక్షు నీక్షించి: “యీ క్షణంబున మీరు నెల్లరాక్షసులు ననికి నేతెండు; నా కరదంబుఁదేరఁ బనుపుఁడు; నేఁడు నా పటుసాయకము1897లు ఘనులైన రామలక్ష్మణులప్రాణములు గొని వారి రుధిరముల్ గ్రోలఁ1898గోరెడిని. శతసంఖ్య లొక్కొక్కసాయకంబునను మృతినొందఁగపికోటిమీఁద నేసెదను. ననికి బలాధ్యక్షులగువారిఁజూచి కొనిరండు సేనలఁగూర్చుక వేగ.” నన వారు పిలిపింప నఖిలరాక్షసులు వినువీథి యద్రువంగ వీఁక నార్చుచును గరవాల చక్ర భీకర భిండిపాల పరశు శూల ప్రాసపట్టి1899స గదలు ముసలంబులును గాఢముద్గరంబులును నెసగెడు శక్తులనేక విచిత్ర వివిధాయుధంబులు వెలుఁగ నేతెంచి రవిరళోత్సాహంబు లడరంగ నంత. దనుజులు నానాస్త్రతతులతోఁగూడ దినకరప్రభగల తేరుఁదెచ్చుటయు రమణీయరత్నాంశురాజి విరాజి తములైన కర్ణావతంసంబు లమరఁ, బదికంఠముల రత్నపదకముల్ గ్రాలఁ, బదిముఖంబుల వింతపంతముల్1900దనర, మహనీయకేయూరమణికంకణాది బహుభూషణాంకిత బాహుదండముల శర శరాసన ఖడ్గ చక్రాసి పరశు పరిఘాది సాధనప్రకరముల్ మెఱయ, ‘దివిజారి చెఱఁబెట్టె దినకరు నొకని; దివినొక్క దినమణి దిరుగుచున్నాఁడు; తలఁపఁదక్కిన భానుదశకమో!’యనఁగఁ దలకొని కోటీరదశకంబు వెలుఁగ నంత నా దశకంఠుఁ డా రథంబెక్కి దంతి రథాశ్వపదాతులు నడవఁ బటుతర నిస్సాణభాంకార వీర భటసింహనాదాది బహునినాదముల విలయకాలా భీలవేళ ఘూర్ణిల్లు జలరాశితో లంక సరిపోలుచుండె. నవిరళ1901వందిజనావళివినుత రవ1902ముతోడుత నుత్తరద్వార1903మునను బలు1904వడి వెలువడి పౌలస్త్యముఖ్యుఁ డలుక యుద్ధోన్మత్తు నా విరూపాక్షు మత్తుని వీక్షించి మహి వ్రయ్యవార నొత్తిలి యార్చుచు నోలి నా లంక వెడలంగ రవిదీప్తి వెలవెలఁబాఱె; నడరి దిక్కులు నిండె నంధకారంబు; ధరణి గంపించె; రథంబులు విఱిగెఁ; దురగంబు లొఱగె; నెత్తురువాన గురిసెఁ. గడుఁగీడు శకునముల్ గానంగఁబడిన గడిమి డింపక దశకంధరుం డడరె. లంకేశు నానాబలంబులఁజూచి పంకజగర్భాండభాండముల్ వగుల నిగుడు నార్పులతోడ నిఖిలవానరులు నొగి వీఁకతోఁదాఁకి రుగ్రదానవులఁ; గలుషించి యాలోనఁ గపిసేనఁ1905గిట్టి బలములు నెఱయంగఁబంతముల్ మెఱయఁ గఱకురాక్షసులు 1906నుగ్రముగ నేయుదురు నెఱకులు1907దూరంగ నిశితబాణముల; ముసల తోమర శక్తి ముద్గర చక్ర విసరముల్ వైతురు వీఁకఁబెల్లేచి; యంకుశ కుంత శూలాదులఁబొడుతు; రంకించి వ్రేయుదు రాభీలగదల; నడిదముల్ జళిపించి యలుక నంగములు కడికండలుగఁజేసి కడిమిఁజూపుదురు. కపులును గుపితులై కడిమి వాటించి విపులశైలంబుల వృక్షజాలములఁ బద దంత నఖ వాల పాశహస్తముల నదయులై యా రాక్షసావలినెల్ల శిరములు నరములుఁ జేతులు మూతు లురములు బాహువు లోష్ఠకంఠములుఁ ద్రెంచియు నొంచియుఁదీవ్రవైఖరులఁ జించియు వంచియుఁజిదిమియు నదిమి తరమిడి యిబ్భంగి దనుజులనొం1908పఁ దరుచరావళిఁజూచి దనుజేశుఁడపుడు దారుణాకృతి వత్సదంతాశ్వకర్ణ నారాచభల్లాదినానాస్త్ర సమితి నగచర రుధిరంబు లవనిపైఁదొరుగ నిగుడించి యొక్కొక్క నిశితబాణమునఁ గపిపంచకంబును గపిసప్తకంబుఁ గపినవకంబును గదనరంగమున గుదిగ్రుచ్చినట్లుండఁగూల నేసియును, వదలక తరుచరుల్ వైచు శైలములు ఘనతరుల్ శకలముల్‌గాఁజేసి మఱియుఁ గనలి యే నమ్ముల గంధమాదనుని, బదునెన్మిదింటను బనసుని, మఱియుఁ బదియింట నీలు, నేఁబదియింట నలుని ద్వివిదు నాఱింటను, వినతు నేడింటఁ, బవననందనుని డెబ్బదిట, గవాక్షు నైదునైదుల; మైందు నైదిటఁ, గుముదు నైదింట, గోముఖు నైదింట, ఋషభు నేడింట, గజునిఁబదేడింట, శరభు నేడింట, గవయుని నేడింట, రంభుఁ దరిమి యొక్కుమ్మడిఁదారునిఁగ్రధనుఁ జెరిమూఁట, సాయకాశీతి నంగదునిఁ, దక్కిన వనచరతతి నేలఁగూలఁ బెక్కుబాణంబులఁబేర్చి యుగ్రతను వెసనేసి 1909మగఁటిమి వీఁకతో మెఱయ: నసురేశు మునుమున నందంద కపులు[వా.రా. సర్గ 97] నడుములు నిశితబాణంబుల విఱిగి పడువారు, 1910నేలను బడి తూలువారు, నురములు వ్రయ్యలై యొగిఁగూలువారు జరణముల్ దునియలై సరి మ్రగ్గువారుఁ జేతులు దెగువారు, శిరములు వగిలి భూతలంబునఁబడి పొరలెడువారు, గళము లూరులును జంఘలుఁద్రెవ్వనొచ్చి బలువిడి మూల్గుచుఁబడి పొరల్‌వారు, నంగంబు లివి యవి యని యెంచరాక సంగరాంగణమునఁజదిసినవారు, బాణముల్ దాఁకినఁబఱచుచు నడుమఁ బ్రాణముల్ వోయి యుర్వరఁబడువారు, నయ్యుండి. రప్పుడయ్యసురేశుఁజూచి చయ్యన రణమున సైరింపలేక వానరుల్ వాఱిరి వసుధ గంపింప. దానవేంద్రుండును దగిలి వెన్వెంట బలువడి నేతేరఁ:”బాఱ నేమిటికి? నిలునిలుఁ.”డని పల్కి నిలువక పాఱు సేనలఁగావ సుషేణునిఁ1911బంచి భానుసూనుఁడు వృక్షపాణియై 1912నడచెఁ. దరు1913శైలహస్తులై తరుచరపతులు నిరుగెలంకుల వెన్క 1914నేపు దీపించి నడవ నాతఁడు సింహనాదంబు సేసి తొడరి కాలాగ్ని రుద్రునివిధంబునను వృక్షతాడనముల వెసఁజంపి చంపి వృక్షశిలాఘోరవృష్టి నందంద రాక్షససేనపై రయమునఁ1915గురియ రాక్షసవరులు శిరంబులు వగిలి కులిశోగ్రహతి భగ్నకూటంబు లైన కులశైలములభంగిఁగూలిరి. మఱియు |