| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
సంగరక్రమకళాసంగుఁడభంగుఁ డంగదుం2184డంగద నంచితాంగదుఁడు నంతఃపురంబున కరిగి యాదైత్యు కాంతానివాసంబుఁ గరమర్థిఁ జొచ్చి పరికించి రోహిణిఁబాసిన చంద్రుఁ దరుణపల్లవశయ్యఁదగఁ జేర్చుకరణిఁ గందిన ముఖచంద్రుఁ గరపల్లవమునఁ బొందించి వగలచేఁ బొగిలెడుదాని, “ఘోరాహవంబునఁగుంభకర్ణాది వీరులు సుతులును విషమవిక్రములు నుక్కిరందఱు; విభుండొక్కఁడే చిక్కె నెక్క2185;టి రఘురాము నితఁడేమిగెలుచు?” ననియని రావణు నపజయంబునకుఁ దన బంధువులుఁదానుఁదలఁకెడుదానిఁ, జిత్తంబులో నింద్రజిత్తుచావునకు నొత్తిలి యేడ్చుచు నున్నట్టిదాని, రమణీయ2186మణిమందిరమునఁగొల్వున్న రమణి మందోదరి రాజాస్యఁ గదిసి యొలసినగతి రాహు వొడిసిపట్టుటకుఁ జలదిందుమండలచంద్రికవోలెఁ దిగిచినఁబెడమఱఁ దిరుగువేగమున మృగనేత్ర మొగమున మెఱుఁగులు సెదర, నెఱుఁగమితోఁగూడ హృదయంబుగలఁగు తెఱఁగున నలివేణిఁదిగిచి పట్టుటయుఁ గమ్మసౌరభములు గలుగుసంఫుల్ల ధమ్మిల్లమల్లికాదామముల్ 2187నలఁగఁ, గెడఁగూడి రావణుకీర్తిపుష్పములు కడివోయి భువి రాలుకైవడి దోపఁ, సేసముత్తియములు సెలువంబు వాసి గాసిల్లి వసుధపైఁ గనుకనిరాల వలనేది చెడిన రావణురాజ్య2188లక్ష్మి చెలువున నెఱి దప్పి సీమంతవీథిఁ గృతకంపు దైత్యలక్ష్మీముఖాంభోజ శ్రితచంచరీకముల్ సెదరుచందమున నాలోలలోల ముఖాంభోజ 2189నీల నీలాలకంబులు నెఱి దప్పి చెదర, నురుమంగళంబులై యొప్పెడు నాత్మ వరభూషణములు రావణులక్ష్మి చెవుల నుండనికైవడి నొండొండ కర్ణ 2190కుండలంబులు విడి కుంభిని బడఁగ, దనుజేశు నపకీర్తిధారలో యనఁగఁ గనుఁగవఁగాటుకకన్నీరు దొరుగ, నొగి దైత్యపతికి మహోల్కలు డుల్లు పగిది భూషణమణిప్రకరముల్ 2191డుల్ల, వరధర్మనిర్మలావరణంబు2192దొరుగ నిరవేది రావణు నిహపరోన్నతులు చలియించుతెఱఁగునఁ జనుకట్టు దొలఁగి చలియింప నున్నత స్తనకలశములు, కొమరేది సురవైరిగుణవల్లి నులియు క్రమమున నెంతయుఁగౌఁదీగ నులియ, నిర్మలుఁడగు రామనృపతిచే2193ఁదెగిన కర్మబంధములు రాక్షసలోకపతికి వదలు నీ క్రియ ననువడువున నీవి వదలుచు మేఖలా2194వలి2195వీడుచుండఁ, 2196బ్రమదరాక్షసరాజ్యపద2197సంధి రోసి విమలవర్ణావలి వీడుచందమున నుదితరావంబులై యొండొంటిఁగడవఁ బదనూపురము2198లూడిపడి మ్రోయుచుండ, వెఱచి రాక్షసవధూవితతి శోకింపఁ, జెఱ నున్న నిర్జరస్త్రీ లుత్సహింప, నీరసంబునఁబట్టి యీడిచి తెచ్చె వారక రాక్షసేశ్వరుని ముందఱికి. నంత మందోదరి2199యసురేశుఁజూచి యంతరంగమున శోకాగ్నులు నిగుడ “నింద్రునిగెల్చిన సత్త్వమెక్కడవోయెఁ? జంద్రహాసమువాఁడి సమసెనే నేఁడు? ఫాలలోచనుతోడఁబ్రమథులతోడఁ గైలాస మెత్తిన గర్వమెందడఁగె? మూఁడులోకంబులు మునుమిడి గెలిచి నేఁడేల తూలెదు నీ పేర్మి విడిచి? యింద్రజిత్తుండు నన్నిట పాఱవైచి యింద్రలోకంబున కేఁగక యున్న నన్నిట్లు చూచునే? నా2200కొడుకున్న నిన్నీచదుర్దశ యేను బొందుదునె? సిగ్గు లజ్జయు లేని చెనఁటివో? నన్నుఁ బగ్గించుచున్నారు పగతు లిబ్భంగి నీ హోమ మేటికి? నిష్ఠ యేమిటికి? నాహుతుల్ నిన్నుఁబూర్ణాహుతిఁజేసెఁ. బటుబుద్ధివై రాముబాణాగ్నిఁబడుము; కుటిల2201క్రియల కింకఁగొలఁదిగా; దుడుగు.” మన విని దశకంఠుఁడలుక దీపింపఁ దన చేతియాహుతి ధరణిపై వైచి యురుతరంబగు నిష్ఠురోగ్రకోపాగ్నిఁ బొరిధూమతోరణంబులు వోని బొమలు ముడివడ సమవర్తిమూర్తియై పేర్చి కడఁకమై నత్యుగ్రఖడ్గ మంకించి యతులరత్నాంగదు నంగదు వ్రేసి వితతవిక్రముఁడింతి విడిపించి పుచ్చె. వీడిన నెఱివేణి వెన్నునఁజార వాడినమోముతో వగలఁదూలుచును నంతఃపురంబున కరిగె దైత్యేశు కాంత చింతించుచుఁగడుఁజిన్నఁబోయి. యప్పుడు హనుమంతుఁడత్యుగ్రముష్టిఁ దప్పక దశకంఠుతల బిట్టు వొడిచె. నా వాలిసూనుండు నంతలోఁదెలిసి రావణు వ్రేసి విక్రమకేలి వ్రాలెఁ. దోరంపునెత్తుటఁదోఁగి యెంతయును గ్రూరుఁడై జేవుఱుఁగొండచందమున నతిఘోరకోపాట్టహాసంబు లెసగ నతులసత్త్వోదాత్తుఁడై దశాననుఁడు నంగదు గద వ్రేసె; ననిలనందనుని భంగించె నిశితాసిఁ బటుశక్తి మెఱసి; నలుని నారసమున నలునొప్ప నొంచె; నలవున గజునొంచె నంకుశనిహతి; మొగి నీలు దండించె ముసలఘాతమునఁ దగ శక్తి శతబలి దర్పంబు మాపెఁ; బవితుల్యముద్గరప్రదరముల్ వుచ్చి ద్వివిదుని మైందుని2202వ్రేసె; వ్రేయుటయు, వానరవరులు దుర్వారులై తమదు సేనలఁజొచ్చి రచ్చెరువుగా. నప్పు డనిలసూనుఁడు రాఘవాధీశుకడకుఁ జని మ్రొక్కిహస్తాంబుజము లొప్ప మొగిచి: “రామావనీశ్వర! రాక్షసేశ్వరుని హోమంబుఁజెఱిచితి; మొప్ప వచ్చితిమి.’ యనవుడు2203రఘురాముఁడంతరంగమున ననయంబు హర్షించె. నట దైత్యపతియు గడువేగమునఁబోయి ఘనశోకవహ్ని నుడుకుచునున్న మందోదరిఁజూచి: “యతివ! నీ మనమున నక్కటా! దైవ కృతమున కింత శోకింప నేమిటికి? ననిమొన నేఁడు రామావనీనాథుఁ దునిమెద; నటుగాక దురములో నతఁడు నను సమయించిన నలినాయతాక్షి! జనకనందనఁజంపి సాహసంబొప్ప వేవేగ నగ్ని ప్రవేశంబు సేయు నీ.”వనుటయు నింతి నిజనాథుఁజూచి |