| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
దల్లులుఁదమ్ముఁడుఁదాను సేనయును వెల్లియై భరతుండు వేడ్కతోఁగదలి యెనయ రాఘవునకు నెదు రేఁగుచోట హనుమంతుఁడనియె నుదాత్తుఁడై2531భరతు: “నదె చూడు రాఘవుం డా భరద్వాజు సదనంబునందుండిచను2532దెంచువాఁడు; అదె చూడు పుష్పకం; బదెచూడు రాముఁ; డదె చూడు కపిసేన; యదె2533వచ్చెఁజూడు సరయూప్రవాహ ముజ్జ్వల2534శక్తి దాటు తరుచరకలకలోద్ధత 2535పటుధ్వనులు.” నన విని భరతేశుఁడవ్విమానంబుఁ గనుఁగొని యుబ్బి గద్గదకంఠుఁడగుచుఁ గన్నంత దవ్వులఁ గడుభక్తి మ్రొక్కి యన్నకు సాష్టాంగ మక్కడ2536నెఱఁగి యుదయాద్రిపై నున్న యుదయార్కుపగిదిఁ బదిదిక్కులకు బ్రభాపటలంబు బర్వఁ బుష్పకారూఢుఁడై పొలుపారుచున్న నిష్పాపు రఘురాము నెఱిఁజేరి మ్రొక్కె. నంత నా పుష్పకంబవనికి డించి యెంతయు హర్షించి యినకులేశ్వరుఁడు నొండొండ కావించె నొనరఁదల్లులకు దండప్రణామముల్ దాను లక్ష్మణుఁడుఁ. బరువడి వారును బరగ దీవించి పరిరంభణముల సంభావించి రెలమి. భరతశత్రుఘ్ను2537లు భక్తితో రామ ధరణివల్లభునకు ధరణినందనకుఁ జతురత వెలయ లక్ష్మణునకుఁబ్రీతిఁ గృతమతుల్ మఱియు మ్రొక్కిరి పుణ్యధనులు. భరతశత్రుఘ్నులఁబరగ దీవించి పరిరంభణముల సంభావించి రొప్ప. నత్తఱి సీతామహాదేవి ప్రీతి నత్తలకెల్ల నాయతభక్తి మ్రొక్కె. మ్రొక్కినకోడలి మొగిఁగౌఁగిలించి యొక్కట దీవించి రోలి నందఱును. రామలక్ష్మణు2538లును రాగిల్లి మ్రొక్కి రా మహామునివర్యుఁడగు వసిష్ఠునకు. నమ్ముని దీవించి యాలింగనంబు నెమ్మిఁగావించె నా నృపనందనులను. రూపించి భరతశత్రుఘ్నులు ప్రీతి నా పూర్ణహృదయులై యప్పుడు వచ్చి తమ తల్లులకు మ్రొక్కి తగుభక్తి దొలఁక విమలాత్ములై రాము వెనుకనున్నట్టి యా విభీషణునకు నర్కసూనునకు నా వాలిసుతునకు నటముఖ్యులైన కపులకుఁబ్రియములు గావించి వారి విపులసమ్మదమున వెసఁగౌఁగిలించి: “యనఘులు నిజభృత్యులై మీరు గలుగ ఘనకీర్తిజయములు గనియె రాఘవుఁడు; జయమును గీర్తియు సాధించె రాముఁ డయనయోదయవృత్తులై మీరు గలుగఁ; జెలులు భృత్యులును నై చిత్తంబులింత గలసినబంధువుల్ గలరె మా!”కనుచు నేకొలందులుగాని హృదయసమ్మదముఁ గైకొనుచుండిరి.కడఁకతో నంతఁ దల్లులు బాంధవుల్ దమ్ములుఁగపులు 2539వెల్లియై బలములు వేడ్క2540ఁదో నడవఁ దేజంబు మెఱయ నందిగ్రామపురము రాజశిరోమణి రాముండు సొచ్చె. నంతఁబుష్పకమున కర్చన లిచ్చి యెంతయు భక్తితో నినకులేశ్వరుఁడు: “తలఁచినప్పుడు రమ్ము; ధననాథునొద్ద నలకలోపల నుండు;”మని వీడుకొలిపె. భరతుఁడప్పుడు రాము పజ్జకుఁజేరి కరమొప్పఁగరములు గడుభక్తి మొగిచి: “మీ పాదుకలయందు మేదినీభార మేపార నునిచి యే నింతగాలంబు నవధానమతితోడ నాలస్యముడిగి యవనీశ! నీ రాజ్య మరసితి నొప్ప.” నని చెప్పి పాదుక లర్థి నొప్పించి వినతుఁడై యత్యంతవినయంబు మెఱసి: “వెలయ నయోధ్యకు వేంచేయవలయు; నొలసినమునివేష ముచితంబు గాదు; రాజమండనములు రమణమైఁబూనుఁ; డీ జటాభారంబు లీ వల్కలములు మానుఁడు మీ.”రన్న మనుజవల్లభుఁడు పూనిక నిండుట బుద్ధిలోఁ దలఁచి “2541యగుఁగాక;”యనవుడు నప్పుడు గదిసి తగు నేర్పరులు వచ్చి తాత్పర్యమొప్ప నొలసినకడఁకతో నురుజటాబంధ ములు వీడ్వ నభ్యంగములు నాచరించి తమ్ములుఁదాను నుత్సవజలస్నాన మిమ్ములఁగావించి యినకులేశ్వరుఁడు ప్రకటదివ్యాంబరాభరణమాల్యములు నకలంకచిత్తుఁడై యమరఁగైసేసె. ధరణీతనూజకు దశరథాంగనలు కరముఁబ్రియంబునఁగైసేసి రెలమి. సుదతులు దారాదిసుగ్రీవసతులు ముదమొప్ప శృంగారములు సేసి రప్పు. డా లోన హనుమంతుఁడర్థిఁదోడ్తేర వేలసంఖ్యలు చెంచువిలుకాండ్రుగొలువ లలితజటావల్కలంబులతోడఁ గొలఁది మీఱినవేడ్క గుహుఁడేఁగుదెంచి జవ్వాదిపిల్లులుఁజమరవాలములు మవ్వంపు గజదంతమౌక్తికంబులును గిటి2542దంత వేణుమౌక్తికములు సర్ప నిటలసంభవ2543మణుల్ నిబిడశార్దూల నఖములు భేరుండనఖములు సింహ నఖములు కృష్ణాజినంబులు మిగుల నాణెమౌ గోరోచనమును గస్తూరి వీణెలుఁదేనియల్ వివిధంబులైన ఫలములకావళ్లు భయభక్తులాత్మ మొలవఁగానుకలుగా ముందఱఁబెట్టి పొడగాంచి యానందమున రామునకును దడయక సాష్టాంగదండంబు వెట్టి నిటలాగ్రహస్తుఁడై నిలుచున్న గుహుని జటిలత్వ మీక్షించి జనలోకవిభుఁడు తన కృపాజలధి నాతని నోలలార్చి చనవిచ్చి యమృతభాషల నిట్టులనియె: “సురుచిరతేజ! చెంచులరాజ! నీదు పిరిగొన్నభక్తియుఁబెంపును దెంపు సొంపార నీ వాయుసుతునిచే వింటి; నింపుగా మాలోన నీవు నొక్కఁడవు; కాన, యీ జడలు వల్కలములు విడిచి పూనుము మా యట్ల భూపచిహ్నముల.’ నని యానతిచ్చిన నరిగి వల్కలము లును జటాపటలంబులును వేగ విడిచి సుమహితోదకముల సుస్నాతుఁడగుచు విమలాంగుఁడై రామవిభునిసన్నిధికి వచ్చినఁజూచి దివ్యములైన యట్టి మెచ్చులసొమ్ములు మేల్మివస్త్రములు నెట్టన నొసగిన నెఱయఁగైసేసి దట్టంపుభక్తి భూధవుఁగొల్చియుండె. |