| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | అష్టమాశ్వాసము |
| కం. | శ్రీకాంతాధామ! సుదం తాకాంతాప్రేమ! రవిసుతాదృక్కువల వ్యాకీర్ణాతిశ్యామల తాకలితసుధామ! లక్షణాద్యభిరామా! | 1 |
| తే.గీ. | అవధరింపుము రామచంద్రావనీంద్ర చంద్రుఁడేరీతిఁ దెల్పినసత్కథ విని యనుజమణు లిర్వురద్భుతాయత్త చిత్తు లగుచు నానందమొంది రయ్యవసరమున | 2 |