ఇతిహాసములు ఉత్తరరామాయణము ఆశ్వాసాంత పద్యములు
ఆశ్వాసాంతము
శా.వైదర్భీకుచపత్త్రభంగరచనావైయాత్య సత్యారతా
హ్లాదా జాంబవతీకపోలముకురప్రాంచన్ముఖా మిత్ర విం
దాదంతచ్ఛదచుంబనాభిరత భద్రాద్యూతలోలా సుదం
తాదృఙ్మోహన భానుజాంకతలసుప్తా లక్షణాశ్లేషణా
343
కం.శ్రీవత్సగోత్రశుభకర,
శ్రీవత్సశ్రితతలోదరీకౌస్తుభ సు
శ్రీవత్స రవిసహస్ర
శ్రీవత్సప్రముఖదనుజశిఖరిబలారీ
344
మాలినిసరసిజదళనేత్రా చారుసౌవర్ణగాత్రా
గరుడజవనపత్త్రా కాలభిత్కంకపత్త్రా
చరణవినతమిత్త్రా శాత్రవధ్వాంతమిత్త్రా
కరధృతఘనగోత్రా కంజవిద్వేషిగాత్రా
345
గద్యముఇది శ్రీమదనగోపాల కృపాలలితకటాక్షవీక్షాసమాసాదిత చతుర్విధానవద్య కవిత్వవిద్యావధానాధునాతన భోజరాజ సకలవిద్ద్వజ్జనాభివర్ణితోదీర్ణ వితీర్ణ వైభవాధఃకృతరాజరాజ రాజయోగసామ్రాజ్య లక్ష్మీవిలాస ధురంధర ధరాధిపసభాంతరస్తవనీయ నయకళాయుగంధరబంధురమనీషావిశేషమంథాన వసుంధరాధర శోధితాగణిత గణితశాస్త్రరత్నాకర వినయాదిగుణరత్నాకర కంకంటివంశపయః పారావారపరిపూర్ణసుధాకరాప్పయామాత్య సంక్రందన నందన విజ్ఞానవిభవ విజితసనందన విష్ణుమాయావిలాసాభిధాన యక్షగాననిర్మాణప్రవీణతానిధాన పాపరాజప్రథానప్రణీతంబైన శ్రీమదుత్తరరామాయణంబను మహాకావ్యంబునందు సర్వంబును నష్టమాశ్వాసము. 
ఉత్తరరామాయణము సంపూర్ణము
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju