| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | ద్వితీయాశ్వాసము |
| కం. | శ్రీరాధామధురసుధా ధారధరలోల! కామితప్రదశీలా! శారీరశ్రీజిత నవ ధారధరజాల! శ్రీమదనగోపాలా ! | 1 |
| తే.గీ. | అవధరింపుము కుంభసంభవమహర్షి చంద్రుఁ డిట్లను శ్రీరామచంద్రుఁజూచి జానకీనాథ! సురలిట్లు శారిఙ్గచేత నభయదానంబుఁగొని వేడ్క నరిగి రంత | 2 |