ఇతిహాసములు ఉత్తరరామాయణము కుంభకర్ణవిభీషణుల వివాహకథ
కుంభకర్ణవిభీషణుల వివాహకథ
మ.అవియెల్లన్‌ రఘువీర! మీరెఱుఁగరే యా గాథ లట్లుండె ని
ట్లు వివాహోత్సవ మాచరించి దశకంఠుం డంత సౌదామినీ
చ్ఛవి మీఁటౌ బలిపుత్రికాదుహిత వజ్రజ్వాల యన్‌దాని బాం
ధవు లౌరా యనఁ గుంభకర్ణునకు నుద్వాహం బొనర్చెన్‌ రహిన్‌.
288
మ.సరమం గేసరమంజు సౌరభవతిన్‌ సౌందర్యలీలా విలా
సరమన్‌ భాసురమన్మథాస్త్రతులితన్‌ శైలూషగంధర్వశే
ఖరకన్యామణిఁ జిన్నతమ్మునకు వేడ్కం బెండ్లిసేసెన్‌ నిశా
చరవంశాగ్రణి యద్దశాననుఁడెదన్‌ సౌభ్రాత్రముప్పొంగఁగన్‌
289
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju