| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | సుకేశుండు దేవవతిని వరించి మాల్యవదాదులఁ గనుట |
| శా. | రక్షోరాజ్యరమావధూటి యనఁగా రంజిల్లు నప్పద్మప త్త్రాక్షిన్ బెండిలియై సుకేశుఁ డధనుం డర్థంబుఁ బ్రాపించి నట్ల క్షీణస్పృహ మించె నద్దివిజకన్యారత్నమున్ నిర్జరా ధ్యక్షున్ జెందు పులోమజన్ దెగడె దీవ్యద్భోగ భాగ్యోన్నతిన్ | 220 |
| చం. | కరియుఁ గరేణువున్ బెనఁగు కైవడి నిచ్చలు హెచ్చు మచ్చికల్ దొరసి సుఖించువారలకుఁ దోడనె పుట్టిరి పావకత్రయ స్ఫురణఁ ద్రిలోక సంగతిఁ ద్రిపూరుష మంత్రగతిన్ ద్రినేత్ర వై ఖరిఁ ద్రిగుణంబులున్ బలెఁ ద్రికాలము లట్టుల మువ్వు రాత్మజుల్ | 221 |