ఇతిహాసములు ఉత్తరరామాయణము ఆశ్వాసాంత పద్యములు
ఆశ్వాసాంత పద్యములు
శా.హేలా గోపిత గోపికాంశుక! శుకప్రేక్షాపయోధిస్ఫుర
త్ప్రాలేయాంశుయశోధురంధర! ధరప్రత్యర్థి ముక్తాంబుదా
భీలప్రస్తరవర్షవారణ! రణస్ఫీతామృతాంధోద్విష
జ్జాలవ్యాళభిదాఖగోత్తమ! తమస్సంఛేదితేజోనిధీ
279
కం.యతికువలయ హిమకర! కర
భృతనందక చక్ర! చక్రహితఘృణి మణిభా
సిత వత్స! వత్స దనుజా
యతమారుతభుజగ! జగదుదంచిత నియతీ!
280
భుజంగప్రయాతమునిశాంతస్ఫురత్పాండునీరేజనేత్రా!
నిశాంత జ్జగద్వంద నీయాబ్జమిత్రా!
యశోదానదాక్షిణ్యహారిత్వధుర్యా!
యశోదామనోరంజకాశ్చర్యచర్యా!
281
గద్యముఇది శ్రీమదనగోపాల కృపాలలితకటాక్షవీక్షాసమాసాదిత చతుర్విధానవద్య కవిత్వవిద్యావధానాధునాతన భోజరాజ సకలవిద్వజ్జనాభివర్ణితోదీర్ణ వితీర్ణి వైభవాధఃకృతరాజరాజ రాజయోగసామ్రాజ్య లక్ష్మీవిలాస ధురంధర ధరాధిపసభాంతరస్తవనీయ నయకళాయుగంధరబంధురమనీషావిశేషమంధాన వసుంధరాధర శోధితాగణిత గణితశాస్త్రరత్నాకర వినయాదిగుణరత్నాకర కంకంటివంశపయః పారావారపరిపూర్ణసుధాకరాప్పయామాత్య సంక్రందన నందన విజ్ఞానవిభవ విజితసనందన విష్ణుమాయావిలాసాభిధాన యక్షగాననిర్మాణప్రవీణతానిధాన పాపరాజప్రధానప్రణీతంబైన శ్రీమదుత్తరరామాయణంబను మహాకావ్యంబునందు ప్రథమాశ్వాసము. 
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju