పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము చతుర్థస్కంధము
శ్రీరస్తు
శ్రీమహాభాగవతము - చతుర్థస్కంధము
ఉపోద్ఘాతము
క. శ్రీవిలసితధరణీతన, యావదనసరోజవాసరాధిప! సితరా
జీవదళనయన! నిఖిలధ, రావరనుత! సుగుణధామ! రాఘవరామా!
1
వ. మహనీయగుణగరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిలపురాణవ్యాఖ్యాన వైఖరీసమేతుండైన సూతుం డిట్లనియె: నట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె. 2
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - chaturtha skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )