| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | షష్ఠస్కంధము |
| సీ. |
నరనాథ! వినుము కన్యాకుబ్జపురమునఁ గలఁడు బ్రాహ్మణుఁడజామిళుఁ డనంగ బాతకుం డతులనిర్భాగ్యుం డవజ్ఞుండు నష్టసదాచారి కష్టరతుఁడు జూదంబులందు దుర్వాదంబులందును జౌర్యంబునందు మచ్చరము గలిగి తొత్తును బత్నిగా మత్తుఁడై వరియించి కొడుకులఁ బదుగురం బడసి చాల |
|
| ఆ. |
మోహజలధిలోన మునిఁగి ముచ్చట దీర, బాల లాలనాదిలీలఁ దగిలి పెద్దకాల మతఁడు పెంపార సుఖియించి, బలిత మెల్లఁదొలఁగి పలితుఁ డయ్యె. |
60 |
| సీ. |
నిర్మలం బనఁజాల నెఱయు చిత్తంబన నల్లని వెండ్రుకల్ తెల్లనయ్యెఁ దగు మోహపాశబంధంబు జాఱినమాడ్కిఁ బొదలిన యంగంబు వదల వ్రాలె నింద్రియంబుల కోర్కు లిఁక నొల్ల ననుభంగి నుడుగక తల చాల వడఁకఁజొచ్చెఁ దమకంబు ప్రాయంబు దగిలి పోయినమాడ్కి లోచనంబుల చూడ్కి నీచమయ్యె |
|
| తే. |
వగరు పుట్టె నంతఁ బెగలె దంతంబులు, నుక్కిసయును దగ్గుఁ బిక్కటిల్లె శిరసు నొవ్వఁదొడఁగెఁ జెదరె మనంబంతఁ, గడిఁదియైన ముప్పుకాలమునను. |
61 |
| తే. |
ఎనయ నతని కెనుబదెనిమిదివర్షంబు లంత నరుగుటయును భ్రాంతుఁ డగుచుఁ గోరి పిన్నకొడుకు నారాయణాఖ్యుండు బాలుఁ డగుట మిగుల భక్తిఁజేసి. |
62 |
| క. |
తన సతియుఁ దానుఁ గూరిమి మనమునఁ బెనఁగొనఁగ నక్కుమారుని ననిశం బును ముద్దు సేయుచుండెను జనవర! వాత్సల్య మాత్మ సందడిఁ గొనఁగన్. |
63 |
| క. |
బాలుని ముగ్ధవచోఋజు ఫాలుని నిజజనకబంధుపరిణామకళా శీలుని లోలతఁ గనుఁగొని యాలరి బ్రాహ్మణుఁడు నందితాత్ముం డగుచున్. |
64 |
| క. |
అత్యంతపానభోజనకృత్యంబులఁ బొత్తు గలిగి క్రీడలఁ దత్సాం గత్యంబు వదల కాగతమృత్యువుఁ గననేరఁ డయ్యె మిక్కిలి జడుఁడై. |
65 |
| తే. |
తెలియ కీ రీతి నతఁడు వర్తింపుచుండ భయదమగు మృత్యుకాలంబు ప్రాప్తమైన భూరివాత్సల్యవృత్తి నప్పుత్త్రుఁ దలఁచి యాత్మఁ బ్రలపించు నారాయణా యటంచు. |
66 |
| వ. | అప్పుడు. | 67 |
| క. |
కింకరుల ధర్మరాజవశంకరుల దురంతదురితసమధికజన నా శంకరుల సకలలోకభయంకరులను గనియె నింద్రియాకులుఁ డగుచున్. |
68 |
| క. |
ఘాతకుల దండదండిత పాతకుల మహోగ్రకర్మభరనిష్కరుణా జాతకులఁ బ్రేతనాయక దూతకసంతతుల నతఁడు దూరమునందున్. |
69 |
| మ. |
కనియెన్ బ్రాహ్మణుఁ డంత్యకాలమున వీఁకన్ రోషనిష్ఠ్యూతులన్ ఘనపీనోష్ఠవికారవక్త్రవిలసద్గర్వేక్షణోపేతులన్ జనసంత్రాసకరోద్యతాయతసుపాశశ్రేణికాహేతులన్ హననవ్యాప్తివిభీతులన్ మువుర నాత్మానేతలన్ దూతలన్ |
70 |
| వ. | ఇట్లతివికృతతుండగండభాగవిషమవివృత్తనేత్రులు, నతిపుష్టనిష్ఠురతనుయష్టిసంవేష్టిత మహోర్ధ్వరోములు, నభ్యస్తసమస్తజీవాపహరణకరణప్రశస్తహస్తవిన్యస్తపాశధారులు నగు యమభటుల మువ్వురం గనుంగొని యజామిళుండు వికలేంద్రియుండును, వికంపిత ప్రాణుండును వికృతలోచనుండును, విహ్వలాత్మకుండు నై. | 71 |
| క. |
దూరమున నాడు బాలుఁడు బోరనఁ దన చిత్తసీమఁ బొడగట్టిన నో నారాయణ! నారాయణ! నారాయణ! యనుచు నాత్మనందను నొడివెన్. |
72 |
| చ. |
మరణపువేళ నద్దనుజమర్దను సంస్మరణంబు సేయఁ ద త్పరిసరవర్తు లాత్మపరిపాలకునామము నాలకించి ని ష్ఠురగతి నేగుదెంచి పొడసూపి యదల్చిరి కాలుదాసులన్ ఖరతరభాషులన్ వికటకల్పితవేషుల దీర్ఘరోషులన్. |
73 |
| క. |
దాసీభర్త నజామిళభూసురుఁ దత్తనువువలన బోరన వెలికిం దీసెడు యమభటులను బోఁద్రోసిరి శ్రీవరునికూర్మిదూతలు కడిమిన్. |
74 |