| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆశ్రమవాసపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
‘మును చేసినయవి చాలవె? | విను గాంగేయాది బంధువితతికిఁ దగ నిం కను శ్రాద్ధంబులు వలసిన | మనము దగమె చేయ దుష్టమతి యతఁ డేలా? |
113 |
| క. |
మఱచితె యాతఁడు మనలం | బఱచిన బన్నములు భీష్మ బాహ్లిక ముఖు ల త్తఱి నెటఁ బోయిరి? వారల | నెఱుఁగమె మన? మట్టి బంధు లేటికి మనకున్? |
114 |
| వ. | వారి విషయం బైన మేలునకు మాఱాడుట యెగ్గు గా; దాకర్ణింపుము. | 115 |
| తే. |
కర్ణునకుఁ జేయవలసిన గారవమున | గొంతి యింకను శ్రాద్ధ మత్యంతవిభవ ముల్లసిల్లంగఁ జేయుఁగా కుచిత నిరతి | యావిధమునకు మాఱాట సూవె యెగ్గు.’ |
116 |
| వ. | అని పలికి వెండియు. | 117 |
| సీ. |
‘పాంచాలి నవమానపఱిచిన తెఱఁగును | నయ్యింతి వెనుక రా నడవిఁ గలయ ధర్మజుచన్న చందంబును మది గీఱి | యుండక మఱ పెట్టు లొలసె నీకు నాంబికేయుఁడు తండ్రి యగుట నాఁ డెటఁబోయె | భీష్ముండు మొదలగు పెద్దవారి బాంధవం బేమయ్యెఁ బార్థ! యీవిదురుఁ డె | ఱుంగఁడే వారల భంగి?’ యనిన |
|
| ఆ. |
ధర్మజుండు భీముఁ దగువచనముల న | దల్చె నరుఁడు మరియుఁ దగఁడె పూజ కాంబికేయుఁ? డిట్టు లనకుము మనకు న | గ్రజుని పనుపు సేఁత వ్రతము గాదె!’ |
118 |
| క. |
అని భీము నదిమి విదురునిఁ | గనుఁగొని మా తండ్రి పుణ్య కర్మము లెమ్మైఁ దన బంధులకై చేయఁగ | మనంబునం దలఁచె నా సమంచితభంగిన్. |
119 |
| క. |
నా యింటి ధనము గైకొని | చేయఁగలాఁ డమ్మహీశు చిత్తము సంతో షాయత్తంబుగ వేగమ | పోయి యనఘ! చెప్పు మవ్విభుఁడు ప్రియ మందన్. |
120 |
| చ. |
అన విని మెచ్చి ధర్మసుతుఁ డర్జునునిం గొనియాడి యాదరం బున విదురుం గనుంగొని ‘ప్రభూత విధానములన్ నిజేచ్ఛ నా ధనమును నర్జునార్థమును దాఁ గొని శ్రాద్ధము లాచరించు నాఁ డనఘ! కురూద్వహుం డిది మదాత్మకు నిం పని విన్నవింపుమీ!’ |
121 |
| వ. | అని చెప్పి మఱియు ని ట్లనియె. | 122 |
| క. |
‘వనవాసాయాసంబుల | ననయంబును నలఁగి దాని నాత్మ నిడి మరు త్తనయుండు పెక్కులాడెఁ ద | గని మాటల; దీన రాజుఁ గనలకు మనుమీ! |
123 |
| క. |
ఇతఁ డేమి యన్ననే మగు? ధృతరాష్ట్రుఁడు మాకుఁ బరమదేవత; విను స మ్మతిఁ దత్ప్రసాదముం బడ | సితి మేమును దత్కృతాభిషిక్తుల మనఘా! |
124 |
| వ. | అని పలికి యప్పుడమిఱేఁడు వికచవదనుం డగుచు. | 125 |
| క. |
మా తండ్రి నిష్ట విధములఁ | బైతృక విధు లాచరింపఁ బంపుము రథ్య వ్రాత కనక గో రథములన్ | జేతి కొదవ నర్జునుండు చేర్చుచు వచ్చున్. |
126 |
| క. |
గ్రామములు దేవతలకును | భూమిసురులకును గురు ప్రభువు ని మ్మను మీ పో మసలితి చెపు మాతని | కీ మాటలు వలయు పనుల కీవు మెలఁగుమీ! |
127 |
| క. |
అనినఁ బ్రియ మంది విదురుఁడు | చని యానృపుతో నజాతశత్రు కడకు నీ పనిచిన పనికిం బోయితి | వినిపించితిఁ దెఱఁ గతండు విని మోదమునన్. |
128 |
| క. |
నరువలను సూచె నతఁడుం | బరమ ప్రియ భరితుఁ డయ్యెఁ బార్థివవర! య య్యిరువురుఁ బ్రాణంబులు డాఁ | పరు నీకును ధనము దాఁచు పని కలిగెడినే? |
129 |
| క. |
చేయుము విచ్చలవిడి గాం | గేయ ప్రముఖులు నిరస్త కిల్బిషు లై మో దాయత్త చిత్తులుగ భూ | నాయక! శ్రాద్ధములు జగమునం బొగ డెసఁగన్. |
130 |
| చ. |
కనకము మేలి రత్నములు గ్రామములన్ హయగోవ్రజంబులుం దనియఁగ నిమ్ము సర్వవసుధాసుర కోటులకున్ నిజేచ్ఛ నీ తనయులు పుణ్యలోక సుఖధామము లై విలసిల్లునట్లుగా’ ననుటయు నాంబికేయుహృదయంబున మోదమెలర్చె భూవరా! |
131 |
| చ. |
పదపడి భీముమాట లొకభంగి నెఱుంగఁగఁ జెప్పి, ‘వాఁడు దు ర్మదుఁ, డవి పాటి గావు కురురాజ మహత్తర! పెట్టకుండు నీ హృదయమునందు వాని నని యేర్పడ ధర్మజు పార్థువాక్యముల్ విదురుఁడు సెప్పె సంతసము వెల్లిగొనంగ ననేకభంగులన్. |
132 |
| ఆ. |
అట్లు సంతసిల్లి యధిప కార్తిక పౌర్ణ | మాసి నవ్విభుండు మహిత భూమి దేవకోటి నెల్ల రావించి యంచిత | శ్రద్ధఁ జేయఁ దొడఁగె శ్రాద్ధవిభులు. |
133 |
| సీ. |
కనకాది వస్తువుల్ గడువేడ్క ధర్మనం | దనుఁడు పుత్తేర నుదాత్త భంగి బాహ్లికునకు, గంగపట్టికి, సోమద | త్తునకుఁ దదీయపుత్త్రునకుఁ దొలుత నంచిత శ్రాద్ధంబు లాచరించె సుయోధ | నాది కుమారుల కందఱకును బేర్వేర క్రియలు నీప్సిత విధంబులఁ దగ | నొనరించె సింధురాజునకుఁ దక్కుఁ |
|
| ఆ. |
గలుగు బంధులకును వలయు రాజులకును | ద్రోణునకును బుద్ధిఁ దోఁచినట్టి యిష్టజనములకు నహీన భవ్యప్రకా | రములఁ బారలౌకికము లొనర్చి. |
134 |
| చ. |
అతులితరత్న కాంచన గవాశ్వ విభూషణ వస్త్రకన్యకా క్షితిముఖ వస్తుదానములు గీర్తన కెక్కఁగ నవ్విభుండు సు వ్రతుఁ డయి చేసెఁ బంచదశవాసరముల్ నిజదానలౌల్య మ ప్రతిహత వృత్తిఁ జెల్ల విని పాండుసుతాగ్రణి ప్రీతిఁ బొందఁగన్. |
135 |
| ఆ. |
భూమి దాన విధులు భూవర యొక మాత్ర | నంబికాతనూజుఁ డాచరింప నంతఁ బోక యూళు లగ్రజన్ములకు నీ నతనిఁ బనిచెఁ బాండవాగ్రజుండు. |
136 |