| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆశ్రమవాసపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
‘భరతవంశోత్తమ | పౌరజనంబులు తమ మాటలుగ భవత్సన్ని ధాన మున న న్నుపన్యాస మొనరింపఁ బంచిన | యట్టిభాషణము లేకాగ్రబుద్ధి నవధరింపుము! మీ మహాన్వయంబున మహీ | విభులయం దొప్పమి వెదకి యైనఁ గానము మము మీరు గన్నట్టి ప్రజల నె | ట్లట్ల రక్షించితి రాదరమున |
|
| తే. |
వినుము! దుర్యోధనుండు చేసిన యనర్హ | మొక్కటియు లేదు; నినుఁ ద్రిలోకోత్తరుండు సత్యవతి కొడు కే మని సమ్మతించి | పంచె దానిన చేయుము పరమనియతి. |
098 |
| క. |
అడ లెడఁబడఁగా మమ్మును | విడిచితి గురు వైన శోక వేదన యే మిం కుడిపికొనునప్పటికిఁ దో | డ్పడు నీదగు సద్గుణములు బంధులు వోలెన్. |
099 |
| ఆ. |
ధాత్రి శంతనుఁడు విచిత్రవీర్యుఁడుఁ బాండు | రాజు నెట్టు లట్ల రాజరాజు ప్రజకు సంతసముగఁ బాలించె; నీయందు | నతనియందుఁ గలదె యధిప! యెగ్గు? |
100 |
| వ. | భీష్మద్రోణ కృపద్రౌణి కర్ణ కృతవర్మ, శల్యు, లొక్క దిక్కును, భీమార్జుననకుల సహదేవ ద్రుపద విరాట సాత్యకు లొక్కదెసయు నై విధిప్రేరణంబునం బోరిరి; వారివలన నఖిల క్షత్త్రియసంక్షయం బావహిల్లె నది యొక్క దుర్యోధను చేతన యయ్యెనె? యట్లుం గాక రణంబు రాజుల కుత్తమ ధర్మంబ కాదె! యందుల మరణంబును సుగతికరణకల్యంబు; నీ సుతుండు సహాయులుం దానునుం బుణ్యలోకసౌఖ్యంబునంబొందియున్నవాఁడు; ధర్మాచరణశాలి వగు నీకును సుగతిప్రాప్తి సులభంబ యగు; నిట మీఁదటికి మా భాగ్యంబునం జేసి పరమ కృపాభరితు లైన పాండవులు మాకు రక్షకులుగాఁ బడసితి; మాకర్ణింపుము. | 101 |
| తే. |
స్వర్గ మైనను బాలింపఁ జాలువారు | వారలకు భూమిపాలన విధి యనంగ నెంతపని? వీరి చేతికి నిచ్చి తిపుడు | మమ్ము నెల్ల విధంబుల మనిచి తధిప! |
102 |
| సీ. |
ధర్మపుత్త్రుఁడు దీర్ఘదర్శి, మహోదాత్త | సచివుండు, బంధు రక్షణ పరుండు, రిపు నెడ నైనను గృప పెద్ద, భావసం | శుద్ధియుఁ బ్రతిభయు సువ్రతంబు నితనికి వెన్నతో నిడినవి | యొరులను దనయట్ల కాఁ జూచుఁ దమ్ము లెల్ల సన్నుతి కెక్కిన సకలగుణముల ని | మ్మహితాత్ముచందాన మమ్ముఁ బ్రోచు |
|
| తే. |
మాత్రయే దేవవిషయసమంచితాగ్ర | హార సజ్జన మాన్యంబు లైన గ్రామ ములు దగంగ రక్షింతురు వెలయఁ దారు | నిత్తు రూళ్ళులు దేవమహీసురులకు. |
103 |
| క. |
మృదువులకుఁ జాల మృదువులు; | విదితయశా! వినుము పాండవేయులు కడు బె ట్టిదులు బెడిదంపు వారికి | మదలోభిత్వములు లేవు మందున కైనన్. |
104 |
| క. |
శూరులు, శాంత స్వాంతులు, | పౌరజన ప్రకర జానపదచయ నిత్యా పార ప్రమదాపాదన | పారగు లతుల గురుభక్తి పరతంత్రాత్ముల్. |
105 |
| తే. |
గొంతి దేవికిఁ గోడండ్రకును మనములఁ | గరుణ యగ్గల మై యుండు ధరణినాథ! పౌరులందును జనపద ప్రజల యెడను | నాడుదురు మేలు తమ కగ్గ మైన యపుడు. |
106 |
| తే. |
వీర లెప్పుడు మము నీవు గారవించు | టెఱిఁగి మన్నింతు రమలినహృదయ! కలఁక దక్కి ధర్మజుపై రాజ్యతంత్రభార | మిడి మనంబున నూఱడి యిచ్చ సలుపు.’ |
107 |
| వ. | అని చెప్పె ని ట్ల వ్విప్రముఖంబునఁ బౌరులభాషణంబులు విని ధృతరాష్ట్రుండు ప్రీతుం డయి సముచిత ప్రకారంబుల నజ్జనంబులం గ్రమంబున వీడుకొలిపి, కౌంతేయాది బంధువులను మిత్రులను నిజనివాసంబులకుం బోవం బనిచి, గాంధారీ సమేతుం డై యభ్యంతరమందిరంబున కరిగి యద్దినశేషంబును రాత్రియుం దగు వర్తనంబులఁ గడపి, మఱునాఁడు విదురుని రావించి ‘మృతు లయిన బాంధవుల కెల్లను సవిశేషశ్రాద్ధంబులు చేయు తలంపు పుట్టి కొన్ని దివసంబులు పయనంబు మానితి; మానిత మాననీయ చరిత్రుం డగు ధర్మపుత్త్రుపాలికిం బోయి నీ విక్కార్యంబు సంఘటింపు’ మని పనిచిన నతం ‘డట్ల చేసెద’ నని యనుజసహితుం డై యున్న యన్నరేంద్రునిం గాంచి. | 108 |
| సీ. |
‘మీ తండ్రి సురనదీసూతి బాహ్లికులకు | సోమదత్తునకుఁ, దత్సూనునకును, దుర్యోధనాదిసుతులకును; దక్కును | గలుగు బంధులకు నుత్కర్ష మెసఁగ శ్రాద్ధముల్ సేయు విచారంబు దోఁచిన | మసలెఁ గార్తికపౌర్ణమాసి దాఁక వనమున కరుగ కప్పని నీకుఁ బోలిన | యట్టులు గావింపు’ మనిన నాతఁ |
|
| తే. |
డెంతయును వేడ్క నమ్మాట కియ్యకొనియె; | నర్జునుండును బ్రీతుఁ డై యర్హ మనియె; భీముఁ డపుడు కమర్చిన మోముతోడ | విదురు వదనంబు సూచుచుఁ బెదవు లదర |
109 |
| వ. | ఏమేనిం బలుకం జూచినన్ బీభత్సుండు మెలుపున నతని వారించి యల్లన యిట్లనియె. | 110 |
| సీ. |
‘రాజు వృద్ధుఁడు ధృతరాష్ట్రుండు భీష్మము | ఖ్య జ్ఞాతులకు శ్రాద్ధకర్మ మాచ రింపఁ దలంచి యర్థించె; భవజ్జిత | ధనధాన్యములు నీవు దాని కియ్య కొనమి యశంబునకును ధర్మమునకు వి | ధ్వంసంబు సేయదే? ధర్మతనయు తలఁచినపని విఘ్నితము సేయఁదగునయ్య? | మనకు నయ్యంబికాతనయుఁ దొల్లి |
|
| ఆ. |
వేఁడికొందు మతఁడు వేఁడెడుఁ గానకు | నేఁగుచుండి మనల నిప్పు డింత సూడవలదె? యొండులాడక యప్పని | సలుపు టొప్పు బాహుశాలి! నీకు. |
111 |
| క. |
అని చెప్పఁగ జెవిఁ దాఱిచి | విని ధర్మతనూజుఁ డంత విజయునిఁ బొగడెన్ మనమున నమ్మాటల క | య్యనిలతనయుఁ డిట్టు లనియె నన్నరుతోడన్. |
112 |