| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆశ్రమవాసపర్వము - ద్వితీయాశ్వాసము |
| శా. |
కారుణ్యాత్మక దృక్ప్రచార! గతసంకల్పాంతరంగస్థితి స్మేరాకార! పతంగమధ్యమ మరీచివ్యాప్తి మూర్ఛత్సుధా ధారారూపవిహార! నిర్మిత జగత్సంసార! నానాగమ క్షీరోద్యన్నవనీతతాలసిత! నిశ్చిత్తత్వ సంభావితా! |
174 |
| క. |
నిర్మలసంవిదుపాస్యా! | ధర్మకరణ! దుర్వికాస్య దైత్యశ్రేణీ నిర్మథన కేళి! నిర్జర | శర్మకృతి విహారశీల! సంయమిలోలా! |
175 |
| మాలిని |
సమదవిమద దూరా సన్న రక్షా! ప్రసన్నా! శమశుభమయమూర్తి! స్ఫారదుర్లక్ష సారా! దమవిభవసముద్యద్ధామ! నిస్సీమభూమా! సమహృదయలసత్సంసర్గ! సానందవర్గా! |
176 |
| గద్యము | ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బైన శ్రీమహాభారతంబున నాశ్రమవాసపర్వంబునందు సర్వంబు ద్వితీయాశ్వాసము. | 177 |
| శ్రీమదాంధ్రమహాభారతంలో ఆశ్రమవాసపర్వం సర్వం ముగిసింది. | ||