| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
తన గర్భాండంబులరెం | టను బ్రియనందనులు వెలువడమి, నతిలజ్జా వనత యయి వినత పుత్త్రా | ర్థిని యొకయండంబు విగతధృతి నవియించెన్. |
5 |
| క. |
దాన నపరార్ధకాయవి | హీనుఁడు, పూర్వార్ధతనుసహితుఁ డరుణుఁ డనం గా నుదయించె సుతుండు, మ | హానీతియుతుండు తల్లి కప్రియ మెసఁగన్. |
6 |
| వ. | ఇట్లు వికలాంగుం డై పుట్టిన యనూరుండు వినతకు నలిగి ‘నన్ను సంపూర్ణశరీరుం గానీక యండం బవియించిన యవినీతవు కావున నీవు నీసవతికి దాసివై యేనూఱేం డ్లుండు’ మని శాపం బిచ్చి, ‘యింక నీ రెండవయండంబు తనకుఁ దాన యవియునంతకు నుండని; మ్మిందుఁ బుట్టెడు పుత్త్రుండు మహాబలపరాక్రమసంపన్నుండు నీ దాసీత్వంబు వాపు’ నని సెప్పి సూర్యరథసూతుండయి యరిగె; వినతయు నయ్యండం బతిప్రయత్నంబున రక్షించుకొనియుండె; నంత. | 7 |