| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - పంచమాశ్వాసము |
| సీ. |
యదుకులవిమలపయఃపయోనిధిసుధా | కరరేఖఁ, గమనీయకాంతినిలయ, ననవరతాన్నదానాభితర్పితముని | విప్రజనాశీఃపవిత్రమూర్తి, వినయాభిమానవివేకసౌజన్యాది | సదమలగుణరత్నజన్మభూమిఁ, బరమపతివ్రతాభరణాభిశోభితఁ | దామరసేక్షణఁ, దాల్మియందుఁ |
|
| ఆ. |
బృథివిఁ బోనిదానిఁ బృథయను కన్యక | నధికవీరుఁ డై స్వయంవరమునఁ బడసి పరనరేంద్రపరిభావి పాండు భూ | వరుఁడు పేర్మితో వివాహ మయ్యె. |
34 |
| వ. | మఱియు భీష్మానుమతంబున మద్రరాజతనయ మాద్రి యనుదాని మహోత్సవంబున వివాహంబై పాండురాజు భరతకులరత్నాలంకారుం డై పరాక్రమంబున నెవ్వరిని మెచ్చక యపారచతురంగబలసమన్వితుం డై. | 35 |
| మ. |
ధ్వజినీ పాత భరంబునం దలరఁగా, ధాత్రీధరాహీంద్ర మూ ర్ధజరత్నప్రకరంబు లున్నతగజేంద్రస్యందనప్రోల్లస ద్ధ్వజ వాతాహతిఁ దూలఁగా జలదబృందం బీక్రియన్ సర్వది గ్విజయార్థం బరిగెం గురుప్రభుఁడు దోర్వీర్యప్రకాశార్థి యై. |
36 |
| క. |
అతులప్రతాపలీలా | యుతుఁ డై ప్రాగ్దక్షిణాపరోత్తర దిగ్భూ పతుల నిజశాసన వశీ | కృతులం గావించెఁ దనదుకీర్తి వెలుంగన్. |
37 |
| మహాస్రగ్ధర |
అతిరౌద్రాకారకీలాయతదవదహనోగ్రాగ్ర సేనానిపీడా హతు లై నానావిధోపాయనములు గొని సౌహార్దవాంఛన్ జయశ్రీ శ్రితబాహుం గానఁగా వచ్చిరి సకలజగత్సేవ్యమానున్ మహేంద్ర ప్రతిముం గౌరవ్యవంశప్రభు నఖిలమహీపాలు రాంబాలికేయున్. |
38 |
| చ. |
లలిత హయ ద్విపంబుల విలాసినులన్ మణిరౌప్య కాంచనా వలుల నజావిగోమహిష వర్గములన్ బహుభూషణంబులన్ బలువిడిఁ గప్పముల్ ధరణిపాలురచేఁ గొని నూఱువేల్‌గజం బులఁ బెఱికించి తెచ్చెఁ గురుముఖ్యుఁ డకుప్యధనమ్ము లిమ్ముగన్. |
39 |
| క. |
శరనిధిపరివృత విశ్వం | భరఁ గల భూపతులు పాండుపతికృతమునఁ గిం కరు లై ప్రతిసమకల్పిత | కరు లై రది మొదలుగాఁగఁ గౌరవ్యులకున్. |
40 |