| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - సప్తమాశ్వాసము |
| క. |
మలహారినాథ! విలస | చ్చళుక్యకులతిలక! రాజసర్వజ్ఞ! రిపు ప్రలయప్రతాప! పరనృప | లలనాననకమలహరిణలాంఛనమూర్తీ! |
311 |
| మాలిని |
ప్రణమదఖిలధాత్రీపాలకాలోలచూడా మణిగణకిరణశ్రీమండితాంఘ్రీ! నరేంద్రా గ్రణి! నిఖిలమహీరక్షామణీ! రాజనారా యణ! విమలమతీ! శీతాంశువంశప్రకాశీ! |
312 |
| గద్య. | ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్టప్రణీతం బైన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబునం గుమారాస్త్రవిద్యా సందర్శనంబును, ద్రుపదగ్రహణమోక్షణంబును, దుర్యోధనుదుర్మంత్రంబును, వారణావతయాత్రయు, జతుగృహ దాహంబును, విదురోపదిష్టద్వారంబునం బాండవాపక్రమణంబును, హిడింబు వధయును, హిడింబా వివాహంబును, వ్యాససందర్శనంబును, ఘటోత్కచసంభవంబును, విప్రగృహంబున నజ్ఞాతచర్యయును, బకాసురవధయును నన్నది షష్ఠాశ్వాసము. | 313 |