| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - సప్తమాశ్వాసము |
| ఉ. |
మానితు లైన పాండవకుమారులుఁ గుంతియు లక్కయింట ను గ్రానలదగ్ధు లై రని ధరామరముఖ్యు లెఱింగి చెప్పఁగా నా నరనాయకుండు విని యాతత శోకమహానలజ్వల న్మానసుఁ డయ్యె బంధుజనమంత్రిపురోహిత విప్రసన్నిధిన్. |
22 |
| వ. | మఱియును. | 23 |
| సీ. |
‘ఇంద్రసమానున కిందీవరశ్యామ | సుందరాంగున కింద్రనందనునకు దేవిఁగాఁ బ్రీతితో దీని నీఁ గాంచితి | నని యున్నచో విధాతృనకు నిట్లు పాడియే విఘ్న మాపాదింప; నమ్మహా | ధ్వరమునఁ బుట్టిన సరసిజాక్షి నే నెట్టు లొరులకు నీ నేర్తు’ నని దుఃఖ | పరవశుఁడయి యున్న ధరణిపతికిఁ |
|
| ఆ. |
దత్పురోహితుండు దా నిట్టు లనియె ‘న | ప్పాండవులనుగుఱిచి బహువిధంబు లగు నిమిత్తములు నయంబునఁ జూచితి; | నెగ్గు లేదు; వారి కెల్ల లగ్గు’. |
24 |
| వ. | ‘తొల్లి దేవేంద్రుండు గొండొకకాలం బదృశ్యుం డై యుండిన, నతనిం గానక శచీదేవి శోకింపం బోయిన నుపశ్రుతిం జేసి బృహస్పతి దానికి దేవేంద్రాగమనంబు సెప్పె నని వేదంబుల వినంబడుం; గావున నేను నుపశ్రుతిం జూచితి; నిది దప్పదు; పాండవులు పరలోకగతులు గారు; పరమానందంబున నున్నవారు; వార లెందుండియు నిందులకు వత్తురు; నీవును సుచిత్తుండ వయి స్వయంవరం బిప్పురంబున ఘోషింపం బంపు; మిది కన్యాదానంబునందు రాజులకు శాస్త్రచోదితం’ బనినం బురోహితువచనంబునంజేసి, యూఱడి ద్రుపదుండు నేఁటికి డెబ్బదియేనగు దివసంబునం బౌషమాసంబున శుక్లపక్షంబున నష్టమియు రోహిణినాఁడు స్వయంవరం బని ఘోషింపం బంచి. | 25 |
| క. |
ఎవ్వరికిని మోపెట్టను | దివ్వను శక్యంబు గాని దృఢకార్ముకమున్ దవ్వై దివమునఁ దిరిగెడు | నవ్విలసత్కనకమత్స్వ యంత్రముఁ జేసెన్. |
26 |
| క. |
‘ధరణిఁ గల రాజులెల్లను | బురుడునఁ గాంపిల్య నగరమున కరిగెద రొం డొరులం గడవఁగ, నని భూ | సురువరుఁ డెఱిఁగించెఁ బృషతసుతుకథయెల్లన్. |
27 |
| వ. | దాని విని పాండునందను లందులకుం బోవనున్నఁ గొడుకుల యభిప్రాయం బెఱింగి కుంతీదేవి యి ట్లనియె. | 28 |