| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - సప్తమాశ్వాసము |
| క. |
కడుఁబెద్దకాల ముండితి | మొడఁబడి; యిం దెంతకాల మున్నను మన క య్యెడు లాభ మేమి? మఱి యె | ప్పుడు నుచితమె యొరుల యిండ్ల పొత్తున నుండన్. |
29 |
| వ. | దక్షిణపాంచాలంబు గరంబు రమ్యం బనియును, బాంచాలపతి పరమధార్మికుం డనియును వింటిమి; మఱి యట్లుం గాక. | 30 |
| క. |
అడుగకయు విప్రవరులకు | నడరఁగ నద్దేశమున గృహస్థులు భక్తిం గుడువఁగఁ బెట్టుదు రెప్పుడుఁ | గడు హృద్యము లయిన మోదకంబులతోడన్. |
31 |
| వ. | ‘అందులకుం బోవుద’ మనినం గొడుకులెల్ల వల్లె యని ‘మీ పంచిన విధంబ చేయం గలవార’ మని యొడంబడి తమయున్న యింటిబ్రాహ్మణునకుం జెప్పి వీడ్కొని. | 32 |