| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - అష్టమాశ్వాసము |
| క. |
హరి యింద్రుఁ దలఁచె; నింద్రుఁడు | కర మనురాగమున విశ్వకర్మను బనిచెన్ ‘సురపురమున కెన యగు పుర | మరుదుగ నిర్మింపు ముర్వి’ నని కడుఁ బ్రీతిన్. |
69 |
| సీ. |
ద్వైపాయనుండును ధౌమ్యుండు నాదిగా | భూసురుల్ సూత్రవిన్యాస మమరఁ జేసి, శాంతికవిధుల్ సేయంగ, సుప్రశ | స్తం బైన రమ్యదేశంబునందు, వాసవాదిష్టుఁ డై వసుధకు నేతెంచి | పేర్మితో నవ్విశ్వకర్మ పురము నిర్మించె, నదియును నిరుపమలీలలఁ | దనరి యింద్రప్రస్థ మనఁగ నింద్రు |
|
| ఆ. |
పురముతోఁ గుబేరుపురముతో వరుణేంద్రు | పురవరంబుతోడ నురగరాజ పురవిభూతితోడ నురువిలాసంబుల | సరి యనంగ నొప్పు ధరణిమీఁద. |
70 |
| ఉ. |
ఇమ్ముగ విశ్వకర్మ రచియించిన కాంచన హర్మ్య తుంగ శృం గమ్ముల రశ్మిరేఖలు ప్రకాశములై కడుఁ బర్వి, తత్సమీ పమ్మునఁ బాఱుచున్న ఘన పంక్తులయం దచిరద్యుతి ప్రతా నమ్ములఁ గ్రేణి సేయుచు ననారతమున్ విలసిల్లుఁ దత్పురిన్. |
71 |
| చ. |
అలఘుతరంబు లై తుహినహారిసుధారుచి నిందురోచిరా కులశశికాంతవేది పృథుకుంజగళ జ్జలనింఝరంబులన్ విలసిత జాహ్నవీ విమలవీచి విలోల లసత్పతాకలం బొలుపగుఁ దత్పురీభవనముల్ హిమశైలముఁ బోలి యున్నతిన్. |
72 |
| చ. |
వననిధిలోని రత్నములు వాసుకిమూర్ధజరత్నసంఘముల్ గొనఁగ నవశ్యమున్ జనులకున్ సమకూరదు గాన నెప్పుడుం గొనుఁడు పరార్థ్యరత్నములు గోరినవానిన యిత్తు మన్తెఱం గునఁ బచరింతు రంగడులఁ గోమటు లప్పురి నిద్ధరత్నముల్. |
73 |
| సీ. |
వలరాజు సచివుల వడువున బెడఁగగు | కర్కశస్తనములఁ గరమువాఁడి చూడ్కుల నతిరాగసురుచిరాధరముల | మదవిలాసాలసమందగతుల వక్రాలకంబుల వలుఁదపిఱుందుల | దర్పగద్గదభాషితములఁ జేసి జనులచిత్తములకు సంక్షోభ మొనరించు | కామినీజనములు గలిగి, సకల |
|
| తే. |
కామభోగములకు సదేకాంతగృహముఁ | బోలి పొలిచియు, ధర్మార్థములకు నిదియ యాస్పదంబు నా వర్గత్రయావిరుద్ధు | లైన జనుల కెంతయు నొప్పు నప్పురంబు. |
74 |
| క. |
శరనిధినినాదనిభ మగు | పురఘోషముఁ గీడుపఱిచి పొలుపగుఁ గర మ ప్పురి బ్రహ్మపురి మహీసుర | వరవేదాధ్యయనరవ మవార్యం బగుచున్. |
75 |
| చ. |
పరిఘజలంబులం దమలపంకరుహోత్పలకైరవాదిసుం దరకుసుమంబులున్ ఘనపథంబున నుజ్జ్వలతారకానిరం తరకుసుమంబులున్ వెలయుఁ దత్పురవప్రము పాదపీఠికా శిరముల కొప్ప నర్చనలు సేసిన పువ్వుల యవ్విధంబునన్. |
76 |
| చ. |
తమము నడంచుచున్ వెలుఁగుతత్పురగోపురశాతకుంభకుం భముల విచిత్రసన్మణిగభస్తివితానములన్ విచిత్రవ ర్ణములగు నాత్మవాహముల నమ్మక పల్మఱుఁ జూచి యన్యవా హము లని సంశయప్రణిహితాత్ముఁ డగున్ హరిదశ్వుఁ డెప్పుడున్. |
77 |
| చ. |
సరళ తమాల తాల హరిచందన చంపక నారికేళ కే సర కదలీ లవంగ పనస క్రముకార్జున కేతకీలతా గరుఘనసార సాల సహకార మహీరుహరాజ రాజి సుం దర నవనందనావళులఁ దత్పురబాహ్యము లొప్పుఁ జూడఁగన్. |
78 |
| మ. |
అనిలం బప్పురిఁ బౌరచిత్తముల కత్యానంద మొందంగ నం దిని యన్నేటితరంగలం బెనఁగుచున్ దివ్యద్రుమాకీర్ణ నం దనసందోహముఁ దూఱుచున్ వికచకేతక్యాదినానాలతాం తనవామోదముఁ బొందుచున్ సుడియు నిత్యంబుం గరం బిష్ట మై. |
79 |
| వ. | ఇట్టి యింద్రప్రస్థపురంబున నింద్రవిలాసంబుతో వ్యాసవాసుదేవానుమతుం డై ధర్మతనయుండు ధౌమ్యపురస్సర మహీసురప్రవరవేదఘోషంబులు, సకలజనాశీర్వాదనాదంబులు, మృదుమధుర మంగళ సంగీత రవంబులు, వివిధ తూర్యధ్వనులు నతిసమృద్ధంబులై యెసంగ వర్గచతుష్టయంబునుం బోని యనుజవర్గంబుతో శుభముహూర్తం బునం బురప్రవేశంబు సేసి సర్వప్రకృతిజనానురాగకరుం డయి. | 80 |
| చ. |
అనుజులు నల్వురుం దనకు నత్యనురాగమునన్ విధేయు లై తనరుచు నుండ వేదవిహితం బగు యజ్ఞమపోలె సర్వపా వనశుభమూర్తి యై భువనవంద్యుఁడు ధర్మపరుండు ధర్మనం దనుఁడు ధరాధిరాజ్యము ముదంబునఁ జేయుచునుండెఁ బేర్మితోన్. |
81 |
| సీ. |
అనఘు వేదాధ్యయనాసక్తు నారభ్య | మాణమహాధ్వరు మనుచరిత్రు సర్వవర్ణాశ్రమసంరక్షణక్షము | సత్యసంధాను నజాతశత్రు భరతవంశోత్తముఁ బ్రభు ధర్మనందను | రాజుఁగాఁ బడసి సురాజ యయ్యె వసుధ, యధిష్ఠానవతి యయ్యె మఱి లక్ష్మి | బంధుమంతం బయ్యెఁ బరమధర్మ, |
|
| ఆ. |
మన్నరేంద్రునందు నాపూర్ణతరశర | దైందవాతపంబునందుఁ బ్రీతి సమమ కా సమస్తజనులచిత్తంబు లా | నందరసభరంబు నొందఁ దాల్చె. |
82 |
| క. |
ధరణిప్రజ ధర్మసుతు సు | స్థిరనిర్మలధర్మచరితఁ జేసి రుజా త స్కరపరరాష్ట్రవిబాధలఁ | బొరయక సంతతసమృద్ధిఁ బొందె విభూతిన్. |
83 |
| క. |
తనరిరి తద్దేశంబున | ననవరతము యజనయాజనాధ్యయనాధ్యా పనదానములుఁ బ్రతిగ్రహ | మును నను షట్కర్మములను భూసురవంశ్యుల్. |
84 |
| క. |
పంబి యజనాధ్యయన దా | నంబుల వర్తిల్లె బ్రాహ్మణప్రియ మయి ధ ర్మ్యం బయి క్షత్రియవైశ్యకు | లం బవిరతపుణ్యకర్మలాలస మగుచున్. |
85 |
| క. |
పరమద్విజశుశ్రూషా | పరు లయి శూద్రాదు లవనిఁ బరగిరి ధర్మ స్థిరమతు లయి ధర్మజు ధ|ర్మరాజ్య మభివృద్ధిఁ బొందె మహిమాన్విత మై. |
86 |
| వ. | అంత. | 87 |
| క. |
‘నారదుఁడు వచ్చుఁ; దద్వచ | నారంభుల రగుఁడు మీర’ లని కఱపి మహో దారుఁడు వారల వీడ్కొని | నారాయణుఁ డరిగెఁ దత్‌క్షణమ తనపురికిన్. |
88 |
| వ. | పాండవులును పరాక్రమ, ప్రణయ, వశీకృతాఖిలరాజన్యు లయి సుఖం బుండు నంత నొక్కనాఁడు. | 89 |