| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - చతుర్థాశ్వాసము |
| క. |
భూపకులతిలక! నృపవి | ద్యాపారగ! నిత్యసత్యధనధాన్యదయా లాపచతురాస్య! ధర్మ | వ్యాపారవిచార! విష్ణువర్ధన నృపతీ! |
398 |
| వసంతతిలకము |
శ్రీరమ్య! రాజకులశేఖర! రాజరాజా! భూరిప్రతాప! పరిభూతవిరోధివర్గా! హారామృతాబ్జహర హాస తుషార కుంద స్ఫారద్యశః ప్రసర పాండుకృత త్రిలోకా! |
399 |
| గద్య. | ఇది సకల సుకవి జన వినుత, నన్నయభట్ట ప్రణీతంబైన శ్రీమహాభారతంబునం దారణ్యపర్వంబున దధీచికథయును, నగస్త్యు మాహాత్మ్యంబును, భగీరథు ప్రయత్నంబునుం, గంగావతరణంబును, ఋశ్యశృంగు చరితంబును, బరశురాము చరితంబును, గార్తవీర్యు వధయును, రామకృష్ణాదుల యాగమనంబును, సౌకన్యాఖ్యానంబును, జ్యవనుండు సంయాతియజ్ఞంబున నశ్వినుల సోమపీథులం జేసి వారిచేత జవ్వనంబు వడయుటయు, మాంధాతృ జన్మంబును, సోమకుండు యజ్ఞంబుఁ జేసి పుత్త్రశతంబు వడయుటయు, జంతూపాఖ్యానంబును, శ్యేన కపోతంబులై యింద్రాగ్నులు శిబిమాంసంబు గొనుటయు, నష్టావక్రు మాహాత్మ్యంబును, రైభ్యయవక్రీతుల సంవాదంబును, భీముండు సౌగంధిక హరణార్థం బరుగుటయు, హనుమద్దర్శనంబును, రామాయణకథయును, భీముండు గంధమాదనంబునం దుండు కొలనికిం బోయి యక్ష రాక్షసుల వధియించుటయు, గంధమాదనంబున నందఱుం గూడుటయు, జటాసురవధయు నన్నది తృతీయాశ్వాసము. | 400 |