| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము |
| సీ. |
ఆ సమయమున ము న్నమరేంద్ర విజితు లై | యహిలోకమున నున్న యసురవరులు ధృతరాష్ట్రనందను తెగువ యెఱింగి యా | త్మీయపక్షక్షయస్థితికి వగచి యాతనిఁ బిలిపింప నప్పుడు శుక్రాదు | లైన భూసుర సమూహములచేత వేల్మి వెట్టించిన వేగంబ యొక కృత్య | వెలువడి భీషణవికృతమూర్తి |
|
| ఆ. |
‘యేమి పనులు గలిగె నెఱిఁగింపుఁ’ డనిన, వా | ‘రిచటి కిపుడు కౌరవేంద్రు ననఘు నుజ్జ్వలాంగు నా సుయోధనుఁ దెమ్ము, ప్రా | యోపవేశవృత్తి నున్నవాని. |
41 |
| వ. | అని పనిచినం గృత్యయు నాక్షణంబ చని ప్రాయోపవిష్టుండై యున్న దుర్యోధను గ్రుచ్చి యెత్తికొని రసాతలం బునకుం దెచ్చి, దైత్యులకు సమర్పించినం, బ్రీతులై వారు వానిం గౌఁగిలించుకొని కుశలం బడిగి, యిట్లనిరి: ‘అయ్యా! నీవు శూరుండవు. శూరజన రక్షితుండవు, భరతకులోద్వహుండ; విట్టి సాహసం బేల చేసితివి? మఱి యాత్మఘాతుకునకు లోకంబున నిందయు, హీనతయు, దుర్గతియుం బ్రాపించు; లోకవిరుద్ధంబు లై మూల ఘాతంబు లైన కార్యంబులయందు నీయట్టి బుద్ధిమంతులు ప్రవర్తిల్లుదురే? యట్లుగావున, నీ వఖిల ధర్మార్థయశోభోగనాశం బైన యీదుర్విచారంబు విడువుము; ధైర్యంబును బ్రతాపంబును బాటింపుము; శత్రుజనభంజనంబు సేయుము; నీవు మనుష్యమాత్రుండవు గావు; నీపూర్వజన్మప్రకారంబు సెప్పెద; మాకర్ణింపుము. | 42 |
| ఉ. |
ఏము తపంబు సేసి పరమేశ్వరు నీశ్వరుఁ బార్వతీమనః కాముకుఁ గామవైరి నవికారుఁ బురాంతకుఁ బ్రీతుఁ జేసినం గామితదాయి యైన శితికంఠుఁడు నిన్ను సృజించి యిచ్చె ను ద్దామదయావిధేయుఁడు ముదంబున మాకు నధీశ్వరుండుగన్. |
43 |
| ఉ. |
నీదగు పూర్వదేహము వినిర్మలవజ్రశిలావిశేష సం పాదిత మస్త్రశస్త్రపరిపాటనభేద్యము గాదు, నిత్యనిః ఖేదము పుష్పకోమలము ఖేచర భూచరకామినీమనో హ్లాదన; మిట్లుగా నభవుఁ డర్థి నొనర్చె నుమాసమేతుఁడై. |
44 |
| ఉ. |
నీవు ధరిత్రిఁ బుట్టుటయు నీకు సహాయము చేయఁ గోరి నా నావిధ దైత్యదానవగణంబులు రాజకులంబులందు స ద్భావన నుద్భవించెఁ బటుబాహులు దివ్యమహాస్త్రకోవిదుల్ ద్రావితవైరు లుర్వి భగదత్తపురస్సరు లైన వీరులై. |
45 |
| వ. | భీష్మద్రోణకృపాదులు గొందఱు దేవాంశసంభవులైనను దదీయభావంబులు రాక్షసావేశంబు నొందెడు; దానంజేసి వారు నిర్దయులై విమూఢులుంబోలె నన్యోన్య పరుషంబులు వలుకుచు నలుక మిగులం బుత్త్ర పౌత్త్రమిత్త్రభ్రాతృ శిష్యగురుబాలవృద్ధజనభేదంబులు విచారింపక సమరంబు సేసి దివ్యంబులు మానుషంబులు నైన వివిధాస్త్ర శస్త్రంబులఁ బాండవపక్షక్షయంబు గావింపం గలవారు; పాండవులు బంధుస్నేహంబు విడిచి తెగువకుం జొచ్చి నీచేత నిహతు లగుదురు; నీమనంబున బీభత్సువలని భయంబు గొంత గలదు; దాని నెఱింగి యేమునుం దగు నుపాయంబు దలంచితి; మది యెట్లనినఁ గృష్ణుచేతం జచ్చిన నరకాసురునంశంబు గర్ణు నావేశింపం గల యది; తత్కారణంబునం గృష్ణార్జునులతోడ బద్ధవైరుండై యవ్వీరుండు నిజదివ్యాస్త్రంబులం గృష్ణుల నిద్దఱ నిర్దహించు; నివ్విధం బెఱింగి యింద్రుండు పాండవ రక్షణార్థంబు వచ్చి కర్ణుకవచకుండలంబులు గపట రూపంబున నపహరింపం గలవాఁడు; మఱియును. | 46 |
| క. |
క్షితి సంశప్తకు లనఁగా | శతలక్షసహస్రసంఖ్య జనియించిరి ద ర్పితులై దనుజులు దద్బల | తతిచే సమరమున నింద్రతనయుఁడు సిక్కున్. |
47 |
| తరలము |
నిహతకంటక మైన యిద్ధరణీతలం బఖిలంబు నీ మహితశాసనగోచరం బగు మానవేంద్ర! ప్రసన్నతా మహిమ నొందుము, నీవ తేపవు మాకు నందఱకుం; గురూ ద్వహ! విషాదము వొందఁ బాడియె దైత్యపక్షభయంబుగన్? |
48 |
| మ. |
చను; మిం కొండు దలంపు మాను’ మని యాశ్వాసించి వానిం బునః పునరాలింగన మాచరించి యెలమిం బూజించి, దైత్యోత్తముల్ జననాథోత్తము వీడు కొల్పిరి; తదాజ్ఞం జేసి యాకృత్యయున్ మును దాఁ దెచ్చిన చోటఁ బెట్టె నధిపున్ మోదంబు సంధిల్లఁగన్. |
49 |
| ఉ. |
అంత సుయోధనుండు హృదయంబున విస్మయ మంది యంత వృ త్తాంతము స్వప్నవృత్తము క్రియం దలపోసి నిజంబ కాఁగ న త్యంతము నిశ్చయించుచుఁ బృథాసుతులన్ సమరంబులోన ని ర్జింతున కాక యంచు వికసిల్లె దురాశయ భగ్నబుద్ధియై. |
50 |
| క. |
విను, జనమేజయ! పౌరవ | జనవిభుఁ డబ్భంగి రాత్రిచరితం బగు న ద్దనుజ సమాభాషణ మె | వ్వనికిని నెఱిఁగింపకుండువాఁ డయ్యె మదిన్. |
51 |
| వ. | అంతఁబ్రభాతం బగుటయు రాధేయుండు సుయోధనుపాలికిం జని హేతుమద్వాక్యంబుల నతని కి ట్లనియె. | 52 |
| ఉ. |
‘చచ్చిన పిమ్మటం గడిఁదిశత్రుల నోర్వఁగవచ్చునే? శుభం బిచ్చునె చావు లెందును నరేశ్వర! యాఱడి చత్తు నంట దా మెచ్చగునయ్య యేరికిని? మేనికి జీవము గల్గుచోన పెం పచ్చుగ సిద్ధిఁ బొందు విజయార్థసుఖంబులు మర్త్యకోటికిన్. |
53 |
| ఉ. |
కావున శోకదైన్యముల కాలము గా దిది; లెమ్ము విక్రమ శ్రీవిలసిల్లు’ మంచుఁ గురుసింహుని సింహసమానుఁ జారుశ య్యావివశాంగు నంగపతి యాదటఁ దా నిరుగేల గ్రుచ్చి సం భావన నెత్తుచుం బ్రణయభాషల వెండియు వాని కి ట్లనున్. |
54 |
| క. |
‘మది నర్జునుఁ జూచి భయం | బొదవినయది నీకు; వాని నుగ్రరణమునం బదునాలవయేఁడు జయిం | చెద; నాయుధ మంటి ప్రతిన సేసితి నధిపా!’ |
55 |