| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆరణ్యపర్వము - షష్ఠాశ్వాసము |
| ఉ. |
పాపవినిశ్చయుండు సతిపయ్యెదకొంగు గడంగి పట్టినం గోపముతో నుదల్చికొని కోమలియున్ వెస వాని వ్రేయుడుం బోపడి వాఁడు చిత్రముగ భూమితలంబునఁ ద్రెళ్ళె మారుత క్షేపవిభగ్నమూల మయి చెచ్చెరఁ ద్రెళ్ళు మహీరుహంబునాన్. |
190 |
| వ. | ఇట్లు నేలంబడి తడయక యెగసి జయద్రథుండు మగువం దిగిచి రథంబుపై నిడికొని సపరివారుం డయి యరుగం దొడంగె; నప్పు డప్పొలఁతి పురోహితునకు మ్రొక్కిన నమ్మహాత్ముండు సైంధవుం బేర్కొని యిట్లనియె. | 191 |
| మ. |
‘తగునే రాజకులప్రసూతులకు నత్యంతంబు నేతాదృశం బగు దుష్కర్మము? నాదుపల్కు విను; మీ యబ్జాక్షి పుణ్యాత్మ, యి మ్మగువన్ వే విడు ; పాండునందనులు నీమానంబుఁ బ్రాణంబు నే పగిదిం గొందురు గాని పోవిడువ; రీపాపంబు నిన్ ద్రెక్కొనున్’. |
192 |
| వ. | అని యాక్రోశించుచు నమ్మహీసురవరుండు వానిపిఱుందన చనియె; నిట పాండవులు నవ్వనంబున ననేక మృగంబుల వధియించి యందఱు నొక్కయెడం గూడంబడి యాశ్రమాభిముఖులై వచ్చునెడఁ దమ్ములం జూచి ధర్మజుం డిట్లనియె. | 193 |
| సీ. |
‘ఇనుఁ డున్న దెసనుండి యెలుఁగింపఁ దొడఁగెఁ బ | క్షులు మృగంబులు నతిఘోరరుతుల; మగిడెడు నిప్పుడు మనకు దాపలి దెస | నతిభీషణాకృతి నఱచె వఱడు; పగఱచే నవమానపాటును గయ్యంబుఁ | గలుగు నీశకునప్రకార మరయఁ; గడుకొని చెయి వెట్టి కలఁచినట్లయ్యెడుఁ | జిత్తంబుఁ, దనువు నిశ్చేష్ట మయ్యె; |
|
| ఆ. |
నరుగుదెండు వేగ యాశ్రమంబునఁ గృష్ణ | నునిచి వచ్చినార మొంటి నకట! తలఁపఁ గ్రూరమతులు ధార్తరాష్ట్రులు గడు | నెగ్గు సేయఁజూతు రెడరు వేచి. |
194 |
| ఆ. |
కమలహీన మైన కమలాకరము వోలెఁ | రాజహీనమైన రాత్రి వోలెఁ జూడఁ గామ్యకంబు శూన్యమై యున్నట్లు | దోఁచె; నేమి కీడు దొడరునొక్కొ!’ |
195 |
| వ. | అనియె ని ట్లయ్యేవురు నరదంబులు సత్వరంబుగాఁ దోలుకొని యాశ్రమంబునకు వచ్చునెడఁ బాంచాలి పరిచారిక ధాత్రేయిక యనునది యతికరుణంబుగా నేడ్చుచున్నం గని, ధర్మతనయుసారథి యైన యింద్రసేనుండు రథంబు డిగ్గ నుఱికి చని ‘ఇది యేల నేలంబడి పొరలుచు నేడ్చెదవు? నీ కపకారంబు సేసినవా రెవ్వ?’ రనిన నది వానిం జూచి ‘సైంధవుచేతం బాంచాలి చెఱపోయె’ నని పలుకుచుఁ బెల్లేడ్చిన నింద్రసేనుం డి ట్లనియె. | 196 |
| సీ. |
‘పాండుపుత్త్రుల బహిఃప్రాణంబు నుత్తమ | శీలసమగ్రఁ బాంచాలతనయఁ గొనిపోవునంతటి గుండెఁ గల్గెనె విమో | హాంధమానసుఁ డైన సైంధవునకు? నేఁగుఁ గా కేమి మహీతలగతుఁ డైన | గగనంబునకు వేగ యెగసి చనినఁ బోనిత్తురే పొరివుత్తురు గాక యు | ద్ధురవృత్తిఁ బార్థు లా దురితచరితు; |
|
| ఆ. |
వీరవరుల ఘోరవివిధాస్త్ర కౌశలం | బెఱుఁగఁ డయ్యెఁ గాక యేమి వాఁడు; వగవకుండు మబల! వైరి నుగ్రతఁ దున్మి | మగువఁ దెత్తు రిపుడ మనుజవిభులు’. |
197 |
| వ. | అనిన నయ్యంగన యపాంగతరంగితంబు లగు బాష్పజలంబు లల్లన కరపల్లవప్రమార్జనంబుల నపనయించుచు నతనిం గనుంగొని యిట్లనియె. | 198 |
| ఆ. |
‘ఇంద్రకల్పు లైన యేవురు నృపతుల | నాత్మఁ గొనక యుఱక యంబుజాక్షి నపహరించి నపుడ యద్దురాత్మునకును | జేటుమూఁడె వేఱ చెప్ప నేల? |
199 |
| ఉ. |
ఇంతకు మున్న వాఁడు సనియెం; గడు దవ్వుగఁ బోవకుండ న త్యంతరయంబునం బటురథావళి యొప్పఁగఁ నేఁగుఁ డుగ్రులై సంతనకట్టుఁ డస్త్రములు శస్త్రములుం, దొడుగుండు వర్మముల్, సంతతదివ్యబాణముల శాత్రవుఁ దున్ముఁడు దెండు నెచ్చెలిన్. |
200 |
| సీ. |
బూదిలోఁ దొరఁగిన పూర్ణాహుతియుఁ బోలెఁ, | కుక్కతో ల్తిత్తిలోఁ గూరినట్టి రాజితకపిలగోరసధారయును బోలె, | మసనంబులోఁ బడ్డ మహిత పుష్ప మాలికయునుబోలె మదిరాక్షి దుర్జను | కతమున దూషిత గాక మున్న చనరయ్య! వేగంబ; చనునె సన్మంత్రవి | శ్రుతపురోడాశంబు శునకమునకుఁ? |
|
| తే. |
జనునె కమలసుగంధికాసారకేళి | కలుషశవఖాది యైన సృగాలమునకుఁ? జనునె తన్వంగి సౌందర్యచతురభావ | భంగి యాదుష్టచరితుని పాలు వడఁగ?’ |
201 |