| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - ప్రథమాశ్వాసము |
| తే. |
‘అంగనాజనమ్ములకు రహస్య రక్ష | ణంబునందలి శక్తి మనంబులందుఁ గలుగకుండెడు మెల్లలోకముల’ నని శ | పించె నా ధర్మదేవతాప్రియసుతుండు. |
41 |
| వ. | ఇట్లు మహాతేజోధనుం డగు నజ్జననాథుం డట్లు శపియించి కుంతి చేసిన కర్ణగోపనంబు ప్రసంగంబుగా నంతరంగంబు గృతపడిన కార్యంబులదెస నిగుడం దనకతంబున మృతిఁబొందిన యుభయపక్ష బంధుమిత్రకోటులం దలంచి యుమ్మలించి విశేషించి కర్ణుచావునకుఁ దూరవగచి విహ్వలించి వివ్వచ్చునాననం బాలోకించి యిట్లనియె. | 42 |
| క. |
‘మన కేటిరాజ్య? మొండొక | జనపదమున కేఁగి భైక్షచర్యావిధి జీ వనము నడిపికొనియుండుద | మనఘా! యట్లయిన సుఖుల మవుదుము సుమ్మీ!’ |
43 |
| వ. | అని వెండియు. | 44 |
| సీ. |
‘జ్ఞాతుల నందఱఁ జంపితి, మది యాత్మ | వధమ కాదే! రాజవర్తనంబుఁ గాల్పు; మహింస నిక్కము దాల్మి మత్సర | వర్జన మిది వనవాసజనుల కాగమ విహితంబు లటె; యింత యొప్పునే? | వనమున వసియింపవలయు వింటె; యసుఖదంబైన రాజ్యామిషంబునకుఁ గు | క్కల భంగిఁ దమలోనఁ గాటులాడి |
|
| తే. |
కులము నెల్లను బొలియింపఁ గుత్సితంపు | బ్రదుకు వచ్చెనె యను వగపాలు వడఁగఁ బ్రమద మొసఁగదుత్త్రైలోక్యరాజ్య మైనఁ; | గాన నే నొల్ల మహి; మీర కైకొనుండు. |
45 |
| మ. |
ధృతరాష్ట్రుండు దనూజుకీడు సమబుద్ధిం జూడ కన్నీచుఁ డే గతిఁ జన్నం జననిచ్చెఁ గాని మగుడంగాఁ దివ్వఁ డయ్యెన్; నిరా కృతశీలుండగు నా సుయోధనుఁడు సంక్షీణంబు సేసెం గులం; బతనిం జంపఁగఁ గోపమాఱె; మది శోకాక్రాంత మయ్యెం దుదిన్. |
46 |
| వ. | ఆ దుర్జనుండు కర్జం బెఱుంగక దుర్మానంబు వాటించిన సైరించి తొలంగనైతి; రాజ్యపరిగ్రహపరత్వంబు మచ్చిత్తంబునం గలిమింజేసి కిల్బిషం బత్యంతంబు నాచరింప వలసెఁ; బరిగ్రహ దోషంబు పరిగ్రహత్యాగంబునం గాని పోదు; పరిగ్రహత్యాగశీలుండు జన్మమరణ దుఃఖంబులం బొరయం డని శ్రుతులు సెప్పెడు; నొకనికి సకలధర్మంబులు ననుష్ఠింప శక్యం బగునే? యపరిగ్రహం బొక్కటన శుద్ధుండ నయ్యెద; మీరు భూమిపాలన పరిగ్రహ తత్పరత్వంబున వర్ణాశ్రమధర్మరక్షణంబు సేయుం; డేను గాననంబునకుం జని మునిజన సకాశంబున సుఖినై యుండెద’ ననిన విని యింద్రాంశసంజనితత్వకలితతేజోధనుం డగు నద్ధనంజయుండు దనయూష్మలత్వంబునకు నవ్వాక్యంబులు దుస్సహంబు లైనం బదరి దరస్మితంబునఁ దద్వికారంబుఁ గప్పి యప్పుడమిఱేని కిట్లనియె: | 47 |