| వ. |
దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె: నిట్లు సమధిగత సామ్రాజ్యుండై ధర్మనందనుండు దేజో విశేషంబున మహోజ్జ్వలత్వంబునొంది మహీసురుల నాశ్రితజనంబుల నర్థులం గృతార్థులం గావించి, ధృతరాష్ట్ర గాంధారీ విదురులకు రాజ్యంబు సమర్పించి, ‘మీరలింతటికి నొడయుల రేను మీ పనిచిన పని సేసి పెట్టిన యట్లు గుడిచి యుండం గలవాఁడ’ నని పలికి, నిత్యంబును వారల యనుమతి గొని భవ్యమార్గంబునం బ్రజలం బాలించుచు, వారికిం బూర్వప్రకారంబుకంటె నతిశయిల్ల నెల్ల వర్తనంబులు సంప్రీతిం జెల్లించుచు విపతులైన సతుల నుమ్మలికంబు వొరయకుండం గరుణ నరయుచుఁ, గృప యుయుత్సు సంజయులకుం గౌరవామాత్యులకు మన్ననలు సలుపుచుఁ, గుంతీదేవికి శుశ్రూష యాచరించుచుఁ, బాంచాలికి సౌమనస్యం బాపాదించుచు ధౌమ్యునకు సగౌరవంబుగా సకల సంపదలు నొసంగి, తన్ముఖంబున దేవ పితృ పూజనంబులు నతిథి తర్పణంబులు వైదేశిక విప్రార్చనంబులు దీనానాథ పోషణంబులుం బరమ సంతోషంబుతో నడపుచుం గృష్ణు నారాధించుచు సమస్త పౌరజనపదకోటుల మనంబులం బ్రమోదంబు పరిపూర్ణంబగునట్లుగా నివ్విధంబునఁ బ్రవర్తిల్లుచుండి, యొక్కనాఁడు రేపకడ కృష్ణుని యున్న మందిరంబునకుం బోయి.
|
2 |