| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | అనిన విని కౌంతేయాగ్రజుండు శాంతనవునితోడఁ ‘గర్మంబులు సంస్కారయోగంబున శుభాశుభంబులం బురుషుం బొందించు వానికిం గర్త యప్పురుషుండ యగుట గాకుండుట నిశ్చయింపరాకుండు. నాకేర్పడం జెప్పవే?’ యనుటయు నప్పుణ్యుం డక్కురువరేణ్యున కిట్లను ‘నింద్ర ప్రహ్లాద సంవాద సమాకర్ణనంబున నది దేటపడు నాకర్ణింపుము. సత్త్వస్థుండును, సంయమనిరతుండును, ననహంకారుండును, నమర్షక్రోధ దూరుండును, దుల్యనిందాస్తుతియును, సమలోష్టకాంచనుండును, నారాయణధ్యాన పరాయణుండును నగు ప్రహ్లాదుం డొక్కయెడ నొక్కరుండ యాసీనుండై యుండ నింద్రుం డతని యంతరంగం బారయ వేఁడి చేరంబోయి. | 369 |
| క. |
‘సంపద లేమికి మది శో | కింపవు; శత్రువుల చేతికిని లోనగు టూ హింపవు; నీ కూరకునికి | పెంపని పాటించె; దిట్టి బేలవు గదవే!’ |
370 |
| వ. | అనిన విని హిరణ్యకశిపునందనుం డప్పురందరున కిట్లనియె. | 371 |
| ఆ. |
‘కలిమిలేమి యనఁగఁగల వొకరెం డవి | యత్నగౌరవము వియత్నతయును గలుగ వచ్చు ననుట గాదది సూ బేల | తనము వినుము తెలియ ననిమిషేంద్ర! |
372 |
| క. |
తేరక యుండఁగఁ జేరుం | దేరంగాఁ బొలియు విధి యధీనంబులు గా కారయ విత్తంబులు పురు | షారంభాయత్తములె? మహా బుద్ధినిధీ! |
373 |
| క. |
శత్రుజనులు చెఱుచుటయును, | మిత్రులు బ్రతికించుటయును మిన్నక యాప త్పాత్రతయును సంపదయు వి | ధాతృఁడు సంధించుఁ జూవె తఱితోఁ బురుషున్. |
374 |
| ఆ. |
భావములు నిజస్వభావంబునన తోఁచు | నడఁగునట్లు గాన యస్థిరతకు నెలవు లని యెఱుంగ నేర్చిన భావంబు | లందుఁ దగులు నెట్లు డెంద మనఘ! |
375 |
| ఆ. |
ఏను గర్త ననుట యెఱుఁగమి దాఁ గర్త | యేని నేమి ఫలము నెడలకుండ నఖిలకర్మములును నాచరించుచు నున్న | వాఁడె కాన కర్తగాఁడు దాను.’ |
376 |
| వ. | అని పలికి వెండియు. | 377 |
| క. |
‘అనఘా! విధివిహితంబుం | దన చేఁతఁగఁ దలఁప ఫలము దగులు నహంకా ర నిరూఢున కనహం కా | రునకది లేమి ఫలయుక్తిఁ ద్రోవం జాలున్. |
378 |
| క. |
విను విధికృత్యము లూరక | కనుఁగొనుచును సిద్ధ్యసిద్ధికల్పిత సుఖదుః ఖ నిరూఢిఁ బొందకుండఁగ | మనముం దొలఁగించు వెరవు మహనీయ మగున్. |
379 |
| క. |
కావున భూతానిత్యత | భావించుట యెపుడుఁ గలిగి బంధచ్ఛేద ప్రావీణ్యము సంపరితో | షావహముగ నున్నవాఁడ నమరప్రవరా! |
380 |
| క. |
దాంతుఁడుఁ బ్రజ్ఞావంతుఁడు | శాంతుఁడు నగువాని మానసం బాయాస శ్రాంతముగా దెమ్మెయి ని | శ్చింతుఁడనై యుండుదును విశిష్ట విచారా!’ |
381 |
| క. |
అనవుడు ననిమిషపతి ‘యే | యనువున నీ శాంతి నీకు నగపడియె మహా జనపూజ్య!’ చెప్పవే? నా | కని యడిగిన నిట్టులనియె నతఁ డాతనితోన్. |
382 |
| తే. |
‘ఆర్జవంబు ప్రసన్నత యాత్మవత్త్వ | మప్రమాదంబు వృద్ధసేవాభినిరతి మేలుసేయుఁ బ్రజ్ఞాశాంతిశాలి యగుట | కాలపాకంబుతోఁ దాన కలుగు ననఘ!’ |
383 |
| క. |
అనిన విని విస్మయము నె | మ్మనమునఁ దళుకొత్తగా నమరపతి యభివం దన మొనరించి పొగడుచుం | జనియె నిజావాసమునకు జగతీనాథా!’ |
384 |
| వ. | అని చెప్పిన విని యప్పాండవాగ్రజుండు ‘భూపాలునకు లక్ష్మీ భ్రంశం బేమిటఁ గలుగు?’ ననుటయు నయ్యాపగా నందనుం డతని కిట్లనియె. | 385 |
| తే. |
‘వాసవునకును బలికి సంవాద మనఘ! | కలిగె నయ్యితిహాసంబు గర్ణగోచ రంబు సేయుము నీ దగు ప్రశ్నమునకు | నుత్తరం బిది సెప్పెదఁ జిత్తమలర. |
386 |
| సీ. |
ఇంద్రుఁ డబ్జజు కడ కేతెంచి వినతుఁడై | ‘బలి మహాసంపద వెలుఁగుచుండె; నితని నిప్పుడు గాన; మాతఁ డెచ్చో నున్న | వాఁడొకో!’ యనుడు నవ్వారిజాస నుండు ‘నీతలఁ పొప్పకుండుట యెఱిఁగితి; | నైనను జెప్పెద ననృతవాది గాకుండుమీ యుష్ట్రఖర గోహయంబుల | యందులో నొక్కటి చంద మొంది |
|
| తే. |
యడఁగి యున్నాడు వధియించు టనుచితంబు | వాని నని పల్కె నటు సేయువాఁడఁ’ గాను మాటవెట్టుదుఁ గన్నచో మాననీయ | వాక్య’యని వీడుకొనియె నవ్వాసవుండు. |
387 |
| వ. | వీడ్కొని చని జగతిం జరియించి యొక్కచోట ఖరరూపంబున సంప్రీతుం డయి యున్న యబ్బలిం గని బలారాతి యిట్లనియె. | 388 |