| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| ఆ. |
‘విను మరిష్టనేమి యను ముని నడిగె నీ | యడిగినట్ల సగరుఁ; డమ్మహాత్ముఁ డన్నరేంద్రునకుఁ బ్రియంబునఁ జెప్పిన | సౌమ్యవాక్యములు ప్రశాంతిఁ జేయు. |
459 |
| వ. | వానిం జెప్పెద నవహితుండవై వినుము. సగరుం బ్రబోధించుటకు నరిష్టనేమి యిట్లను. ధనధాన్య పశుకళత్ర పుత్రాదుల సందడింబడి డెందం బాకులంబగునేని ముక్తిమార్గంబు దుర్గమంబై యుండు. | 460 |
| సీ. |
వృద్ధ కళత్రంబు బుద్ధిమత్పుత్రుల | విడిచి నిర్భరత వివిక్త దేశ మునకుఁ బోవలయు; సపుత్రుం డపుత్రకుం | డను విశేషంబు లే; దతులశాంతి వైరాగ్యములు గలవానికి విను నృప | వర్య! బంధులఁబ్రోవవలదె యను త లంపున సంసారలంపటుం డగువాఁడు | బేల; దా మృత్యువుపాలు వడిన |
|
| ఆ. |
యపుడవారి నరయ నబ్బునే యద్దశఁ | దలఁచి ముక్తి గోరఁదగదె యట్లుఁ గాక తనకు వారు గలుగుదురే యప్పు | డదియుఁ దలఁపవలయు నదియ కాదె! |
461 |
| తే. |
భూతముల పుట్టుఁ జేష్టయుఁ బొలియుటయును | జూచునేర్పు గలుగువాఁడు సూడనేర్చు మోక్షమార్గంబు చిత్తంబు మూఢమైన | సక్తుఁడగు లోకగతి నెట్లు ముక్తి గలుగు? |
462 |
| క. |
అనఘ! దురన్నము శాల్యో | దనమును భూమియును మృదుల తల్పము నజిన మ్మును సురుచిరచీనాంబర | మును సరి యెవ్వనికి నతఁడు ముక్తిం బడయున్. |
463 |
| తే. |
నేలయెల్లను నేలిన నృపుల పుట్టు | నీగిపోకయుఁ జూపాదిగాఁగఁ గలుగు శక్తు లెడలినఁ జెడు మేని చందమును ద | లంప నేర్చునతఁడు మోక్షలక్ష్మిఁ జెందు. |
464 |
| క. |
ధనయోగము దుర్లభమని | యును గ్లేశము సులభ మనియు నూహించుచు నె మ్మనమున మర్త్య త్వము గీ | డని యెఱుఁగు నతండు గను మహానందంబున్. |
465 |
| క. |
కావున గృహస్థవృత్తి | న్నీవతిలోలుఁడవు గాక నెఱిఁ జేయుము ర క్షావిధి ధరణీప్రజకుం | గైవల్యము దాన నీకుఁ గలుగుం జులుకన్.’ |
466 |
| క. |
అని బోధించిన సగరుం | డనయముఁ దెలివొంది నియతుఁడై ప్రజ రక్షిం చె నరేంద్ర! నీవుఁ దద్వ | ర్తనమున నెగడుము జనాభిరంజన మొప్పన్.’ |
467 |
| తే. |
అనినఁ బ్రియమంది పాండవేయాగ్రజుండు | ‘ధర్మ విద్వేషపరులగు దానవులకు మంత్రియై యుండు శుక్రత్వ మహిమ యెట్లు | గలిగె భార్గవునకుఁ బుణ్యగణ్యచరిత!’ |
468 |