| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - షష్ఠాశ్వాసము |
| సీ. |
‘ప్రాకృతజనుల వర్తనములవెంటఁ జి | త్తమున జరామరణముల కలిమి దలఁపక యేమఱి మెలఁగెడు శుకుఁజూచి | విపులధర్మజ్ఞాన నిపుణ ధిషణుఁ డైన వేదవ్యాసుఁ డాతని కిట్లను | ‘మనసు నింద్రియములు మర్దితములు గాఁ జేయు ముత్పథగాములు గానీకు | మక్రోధసత్య శమార్జవములుఁ |
|
| తే. |
దపము దమము నహింసయు ధర్మమునకు | నాకృతులు వీనిఁ బాలింపు మాఁకలియును నీరువట్టును దగియెడు నెఱి నడంచి | దేవతాతిథి శేషోపజీవి వగుము. |
222 |
| క. |
నురువున నొనరించిన పం | జరంబులో నున్న పులుఁగు చాడ్పున మేనం బురుషవర! జీవ ముండుట | పరికింపక యేమఱంగఁ బాడియె నీకున్? |
223 |
| తే. |
ఎన్నికొనుచుండఁ జనుచుండు నేండ్లు లివ్వి | ధమున నాయువు దోడ్తోడఁ దఱిఁగి జీవ హాని వాటిల్లఁగాఁ బుత్ర! యనవధాన | నిద్ర మోహితుఁడై యున్కి నీకుఁ దగునె? |
224 |
| క. |
విను మాంసశోణిత వివ | ర్ధనమగు నైహికమునందుఁ దత్పరులు పరం బని యొకటి కలిమి దలఁపరు | గొనరు బుధులమాట నాస్తికులు వినయనిధీ! |
225 |
| తే. |
బుద్ధిమంతుల తెరువునఁ బోక యుత్ప | థప్రవర్తుల నడచు పథంబునందుఁ జనుట విను మప్పటికిఁ జూడఁ దనకుఁ జాల | నించియుండు నాపద యొనరించుఁ బిదప. |
226 |
| చ. |
తన తన ధర్మమున్ నడపి దానన సంతసమంది శాంత భా వనరతినుండు వారిఁ గని, వారల చెప్పెడు ధర్మవృత్తి ని చ్చెనయుఁగ నూఁది సత్పదముఁ జెందుట కెక్కుము, పొత్తినూలి ప్రు వ్వునెనయుఁగాకు, బంధకుఁడవుం దన కజ్ఞుఁడు దాన యెమ్మెయిన్. |
227 |
| తే. |
అస్థిరేంద్రియ సలిలమయంబుఁ గామ | రోషదారుణ గ్రాహ ప్రదూషితంబు నైన సంసారసాగర మతులధైర్య | పోతపాత్రిక నిస్తరింపుము కుమార! |
228 |
| క. |
కామాదితృప్తుఁడై నరుఁ | డేమఱియుండంగ గొఱియనెత్తెడు పులి యు ద్దామత మృత్యువు గొని చను | నామూఢుని యట్లుగాకు మతుల వివేకా! |
229 |
| తే. |
బ్రాహ్మణత్వంబు గడు దుర్లభంబు; దాని | నెట్టకేలకుఁ గని కడయెయ్దఁ జేయ వలదె తపము దమంబు నిశ్చలవివేక | సంపదయు నూఁది నరుఁడు దుస్సంగ ముడిగి? |
230 |
| క. |
విను విప్రశరీరము సుఖ | మునకే? బహునియమదుఃఖముల నిహమునఁ జెం దను నిత్యసౌఖ్యముం బర | మునఁ బొందను బుట్టెఁ గాక బోధప్రవణా! |
231 |
| క. |
బలితపుటురిఁ గామంబున | నిలుచుట యా రజ్జుఁద్రెవ్వ నీలిగి సుమతుల్ వెలువడి చని సుఖు లగుదు ర | వ్వల నెఱుఁగరు పడుదు రంద వత్స! దురాత్ముల్. |
232 |
| తే. |
తాను దెగునేని బాంధవదారపుత్త్ర | మిత్త్రు లను నజ్జనంబు లేమిటికి? విగత చింతుఁడై గుహసొచ్చి యశ్రాంతబుద్ధిఁ | దడవి కానంగ వలవదె తన్నుఁ దాన? |
233 |
| తే. |
జరయు మరణంబు మర్త్యుని జన్మమాది | గాఁగ వెనువెంటఁ దగులు నగ్గంబు వేచి యెల్లి సేసెద ననక మే లిపుడ చేయు | తనయ! వార్చునె మృత్యువు జనుల పనులు! |
234 |
| ఆ. |
ఆశ్మశాన గమను లంతియ చుట్టంబు | లగ్నిఁ గలిపి మరలు నఖిలమైన జ్ఞాతిజనము దీనిఁ జర్చింప కందఱి | యందు మమతఁ బెనుచు నజ్ఞుఁ డనఘ! |
235 |
| క. |
లోకము కాలముచే ని | ట్లాకుల పడుచునికి గాంచి యధికధృతిని ధ ర్మైకాంతతా నిరూఢిం | గైకొని త్రోవంగవలదె కాలవికృతులన్? |
236 |
| క. |
మానుషము దుర్లభము, సో | పానంబగు నది విముక్తి పదము గనుటకున్, దానిఁ గని తొంటి చందము | రానీక, సముద్యమమునఁ బ్రాఁకఁగ వలదే? |
237 |
| క. |
అనఘా! తపోవనమునన | జననంబును మరణదశయు సంప్రాప్తము ల య్యెనయేని వాఁడు ముక్తుఁడె | మనంబు బహుకామవికృతి మగ్నంబైనన్. |
238 |
| తే. |
భోగములు సంపరిత్యక్తములుగఁ జేసి | కేవలాంగుఁడై నిర్మలభావయుక్తిఁ దపము గృహముననేనియుఁ దత్పరతఁ జ | రించి సంసారజలధిఁ దరించు నరుఁడు. |
239 |
| క. |
విను దారపుత్రమిత్రులు | సనిరి కొడుక! మున్ను చనిన జన్మంబుల, నీ కును వారు, వారలకు నీ | వును మఱుపుట్టువులఁ గొఱయవుట గల్గెనొకో? |
240 |
| ఆ. |
ఏన కలను నాకు, నెవ్వరివానిఁగా | నాత్మఁ దలఁతు?, నన్ను నట్టివాని నెందుఁగానఁ, గాన యెవ్వరివాఁడను | గా ననంగవలదె మాననీయ! |
241 |
| క. |
దారాపేక్షం గష్ట | ప్రారంభముఁ బూని యిహమునందుఁ బరమునన్ వారని సంక్లేశంబులఁ | గూరు నరుఁడు దానిఁ జేయ గొనకొండ్రె బుధుల్? |
242 |
| చ. |
ధన మది యేల భోగమును దానము లేదగునేని? శత్రు మ ర్దన మొనరింపఁడేని బలదర్పము లేల? సధర్మవృత్తికిన్ గొనకొనఁడేని విన్కి మునికుంజర! యేల జితేంద్రియుండు గాఁ డనఁ జనునేని నాత్మవిధ మారయు నా క్రమమేల చెప్పుమా!’ |
243 |
| క. |
అని యి ట్లుపదేశించిన | విని శుకుఁడు విముక్తిమార్గవిదుఁడై చనియెన్ జనకుఁ దొఱఁగి నిశ్చలదీ | పనిభాత్ముం డగుచుఁ గురునృపాలవరేణ్యా!’ |
244 |
| క. |
అనిన విని దేవతటినీ | తనయునితోఁ బాండురాజ తనయాగ్రజుఁ డి ట్లనుఁ బ్రీతియు వినయము నా | ననమునఁ దళుకొత్త నరతనయవంశవరా! |
245 |