పురాణేతిహాసములు శ్రీమహాభారతము శల్యపర్వము - ద్వితీయాశ్వాసము
ఆశ్వాసాంతము
మ. శ్రుతివాక్యార్థమయ ప్రభావ! మునిసంస్తుత్యానుభావా! శచీ
పతిముఖ్యానిమిషాభివాద్య నిరసద్భావైకవేద్యా! మహో
న్నత హేతుత్వవిరాజమానచరణా! నమ్రాపదుత్తారణా!
సతతోన్నిద్ర విధైకభక్తసులభా! సంవిత్ప్రభావల్లభా!
420
క. సిత నీలాదిక వర్ణా! హితవై కృత దూర! మానసేజ్యాధారా
శతదళభవసత్యవతీ | సుతాదిబుధ మతిలతా ప్రసూనాకారా!
421
మాలిని భరిత వికసనాంతః పద్మనిశ్రేణికాసం
చరణ పరిణతత్వశ్లాఘనీయ క్రమోద్య
న్మరుదుపగమలీలా మథ్యమానేందు బింబ
క్షరదమృత వికారోత్సారణానంద రూపా!
422
గద్యము ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి తిక్కనసోమయాజి ప్రణీతం బయిన శ్రీమహాభారతంబున శల్యపర్వంబునందు సర్వంబును ద్వితీయాశ్వాసము. 423
శ్రీమదాంధ్రమహాభారతంలో శల్యపర్వం ముగిసింది.
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )