| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము |
| చ. |
అనవుడు నేమియుం బలుక కా నృపపుత్త్రుఁడు నిర్జరేంద్ర పు త్రునిపయి నుజ్జ్వలంబులగు తూపుగముల్ పరఁగింప వాని నె ల్ల నతఁడు శాతభల్లతతులం దునుమాడియు నొల్లఁడయ్యెఁ ద త్తను వొక బాణమేనియును దాఁకఁగఁజేయ నరేశ్వరోత్తమా! |
099 |
| వ. | అగ్గాండీవి కృప యేమని చెప్పుదు? | 100 |
| క. |
తనమీఁద మగధుఁ డేయఁగ | జననాయక! రథ్యములను సారథి నైనన్ గొనకొని నొప్పింపక య | ల్లవ శరనికరంబుపైఁ గలయ నిగిడించెన్. |
101 |
| క. |
అది బలహీనతగాఁ గొని | మద మేపారంగ నక్కుమారుఁడు లీలం గదసి బలునారసంబులు | తదంగమునఁ గ్రుచ్చె; నతఁడు దాన నలిగియున్. |
102 |
| వ. | ఆ సహదేవు పుత్త్రు గాత్రంబు దాఁక కుండునట్లుగా శరంబులు నిగిడించి. | 103 |
| ఉ. |
సారథిఁ గూల్చి యశ్వములఁ జంపి రథంబుఁ బగిల్చి కేతువుం జీరి శరాసనంబుఁ బొడిసేసిన నమ్మగధుండు ధీరతో దారగతిన్ సముజ్జ్వల గదా భ్రమణంబున బాహు వొప్ప న వ్వీరవరేణ్యుపైఁ గవిసె విక్రమ మాకృతి దాల్చి పొల్చె నాన్. |
104 |
| వ. | అట్లు గవియుటయు. | 105 |
| తే. |
అప్పుడును మత్సరంబున కతఁడు భాజ | నంబు గాకుండెఁ; గాన యన్నరుఁడు వెడఁద వాతియమ్ముల గద పలు వ్రయ్యలై మ | హీతలంబునఁ దొరఁగంగ నేసి నధిప! |
106 |
| వ. | అ ట్లేసిన. | 107 |
| సీ. |
నివ్వెఱపడిన యానృపనందనునితోడ | నయ్యతిబలుఁడు “మా యన్న యొకని ప్రాణంబులకును దప్పకు మయ్య!’ యని యాన | తిచ్చిన కతన నే నేయకున్న నీ వింతవడి పోర నిలువఁ జాలితి; విను; | మది యట్టులుండె; రాజార్హమైన ధర్మంబు వాటించి తాఁకితి నన్ను; నిం | తియ చాలు; నింక శాంతియ నరేంద్ర! |
|
| తే. |
తగిన యది యని పల్కె; నతండు ‘నిజము | నట్ల కా’ కని యూహించి యమ్మహాత్ము పాద పరిసరమున భక్తిఁ బ్రణతుఁ డైన | గ్రుచ్చి కౌఁగిటఁ జేర్చి యక్కురువిభుండు. |
108 |
| వ. | ‘వచ్చు చైత్రమాసంబునం బున్నమనాఁడు పాండవాగ్రజు నశ్వమేధంబు ననుసంధించుట కై బంధులు నీవును రావలయు’ ననిన నవ్వసుమతీపతి ‘యట్ల చేసెద’ నని యత్యంత వినయంబున నవ్విజయుం బ్రియపూర్వ కంబుగాఁ బూజించి యామంత్రితుం జేసిన నాతండు ప్రీతుండయి యభినందించి యమ్మగధపతిం బురం బునకుఁబోవం బనిచి యశ్వరత్నంబు ననుసరించె; నదియును వంగపుండ్ర మ్లేచ్ఛదేశంబులం జరియింప నయ్యైరాజులు చెనకినం దేజోధనుండగు నాధనంజయుండు జయించుచుఁ జన నత్తురంగంబు. | 109 |
| సీ. |
చేదిదేశంబు సొచ్చిన శిశుపాలుని | తనయుండు శరభుండు తనదు శక్తి పురము వెల్వడి యుద్ధపూర్వకంబుగఁ చేరి | యమ్మహావీరున కర్చ లిచ్చె; నతని వీడ్కొల్పి యయ్యతుల తేజుఁడు ఘోట | కము వెన్కఁ జనుచుఁ డేంకణ కిరాత ముఖ దేశ నృపతులు ముట్టినఁ దగ గెల్పు | గొనుచుఁ గ్రమంబునఁ గోసలులను |
|
| ఆ. |
గాశులను జయించెఁ; గ్రమ్మఱ యత్తురం | గము దశార్ణదేశగామి యయ్యె జిష్ణుఁ డనుసరింపఁ జిత్రాంగదుం డని | చేసి యోడి పూజ చేసె నధిప! |
110 |
| వ. | ఇట్లు దశార్ణపతి పార్థునిం బూజించి యాతని యాదరణంబు వడసి పోయెఁ; బదంపడి తురంగంబు నిషాదా ధీశ దేశంబునకుం జనిన నేకలవ్యనందనుఁడు పాకశాసననందను మీఁద నైషాద సేనాసమేతుండై తోఁ తెంచిన. | 111 |
| చ. |
అతని బలంబుఁ గ్రూర విశిఖార్చుల నేర్చిన బాహుసార గ ర్వితుఁ డగు నన్నిషాదపతి వీఁక నెదుర్కొనినం గిరీటి యా తత పటుబాణ దీధితులఁ దన్మద సంతమసం బడంచె; వాఁ డతి వినయంబునన్ వినతుఁడై తగ నర్చితుఁ జేసె నాతనిన్. |
112 |
| వ. | అ ట్లేకలవ్యనందనుం దనవశంబు చేసికొని ధనంజయుండు హయంబు ననుగమించె; నది మరలి మఱియును దక్షిణాభిముఖంబయి చని తిరుగఁ బౌండ్రాంధ్ర ద్రవిళ కేరళ కర్ణాట దేశాధీశుల ననాయాసంబున వశగతులం గావించికొనియెఁ; గ్రమంబున సౌరాష్ట్రంబు సొచ్చి గోకర్ణ సమీపంబునం బ్రవర్తించి పదంపడి. | 113 |
| సీ. |
ద్వారకానగరంబు చేరువ ఘోటక | మరుగంగఁ బ్రీతులై యదుకుమారు లాలపుటాలంబు ననువున నయ్యింద్ర | నందనుఁ గని పూజనం బొనర్ప నభినందనము చేసె నవ్వీరుఁ; డపరాబ్ధి | తీరదేశంబులఁ దిరిగి పంచ నదముపైఁ జని మావు నరనాథ! గాంధార | దేశంబు చొచ్చి వర్తింప శకుని |
|
| తే. |
నందనుఁడు బాల్యకలిత దుర్నయము పేర్మిఁ | దనదు సేనలఁ గూర్చి యుద్దామగతిఁ గి రీటిఁ దాఁకిన నతఁడు వారించి పాండ | వాగ్రజుని యాజ్ఞ దెలుపంగ నంతఁ బోక. |
114 |
| క. |
పొదివినఁ గనుఁగవ వెడ కెం | పొదవఁగఁ జతురంగముల శరోత్కరములఁ దాఁ బొదివె విజయుఁ; డవి వడియుం | జెదరియు సన్నంబు లైనఁ జిత్తములోనన్. |
115 |
| ఉ. |
మత్సర మెక్కఁగా సుబలు మన్మఁడు దుర్దమలీలఁ గిట్టి బీ భత్సునిపై నిశాత శరపంక్తి నిగుడ్పఁ దదీయ బాహు సం పత్సముదీర్ణతం దనదు భావమునం గొనియాడి యెంతయున్ వత్సలుఁ డైన యన్నరుఁడు వానికి నిట్లనుఁ గౌరవోత్తమా! |
116 |
| క. |
‘రాజులఁ జంపకు మని మా | రా జానతి యిచ్చె; నుద్ధురత నే నని న య్యోజ విడిచినట్లైనఁ బ | రాజితుఁగా నన్ను నద్ధరాపతి దలఁచున్. |
117 |