పురాణేతిహాసములు శ్రీమహాభారతము అశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము
ఆశ్వాసాంతము
శా. భక్తి స్మేర మునీంద్ర చిత్తకమల ప్రస్ఫీత సౌరభ్య సం
యుక్తారూఢ తర ప్రకాశ తనురూపోల్లాస! రాగాది ని
ర్ముక్తై కాంతి జనైకతా రసిక! చిన్ముద్రాసదోన్నిద్ర! ధీ
శక్తిస్వైర విహారదూరలసితా! సద్భావనోన్మీలితా!
285
క. అజరామర పదకర పద | భజనా! సంసార జలధి పారీణస్తో
తృజనా! స్వమూర్తి వైదిక | యజనా! పాశ్చాత్యనాడి కార్ద్రవ్యజనా!
286
మాలిని త్రియుగ కమల వీథీ దీప్త సంచార లీలా!
నియమిత పవనాత్మాగ్ని ప్రభాస్నిగ్ధ సంగా!
స్మయ వికచ మహాబ్జ స్వైర మాధ్వీక ధారో
దయమయ మధురాత్మా! దర్శితానందవర్త్మా!
287
గద్యము ఇది శ్రీమదుభయ కవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీమహాభారతంబున నశ్వమేధ పర్వంబునందు సర్వంబును చతుర్థాశ్వాసము. 288
శ్రీమదాంధ్ర మహాభారతంలో అశ్వమేధపర్వం ముగిసింది.
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )