| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | భీష్మపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | దేవా! వైశంపాయనుండు జనమేజయున కి ట్లనియె. | 2 |
| తే. |
భండనంబునఁ దనయుండు గం డడంగి | పోక విని తీవ్రఖేదంబుఁ బొంది యంబి కాతనూభవుఁ డప్పు డాసూతపుత్త్రు | నడిగె నుత్తరవర్తన మాదరమున. |
3 |
| వ. | అడుగుటయు నతం డతని కి ట్లను ‘నాఁటిరేయి గాంగేయుతోడ గాంధారేయుండు. | 4 |
| ఆ. |
‘మనము పూఁచి పట్టి మొన లేర్చికొని పోవఁ | బాండురాజసుతులబలము గవిసి గాసి చేయునదియుఁ గాక నీ ముందటఁ | బవనతనయుచేత భంగపడితి. |
5 |
| క. |
నినుఁ గొని గెలిచెదఁ గుంతీ | తనయుల నని యున్న తలఁపు దప్పించెదు నీ వనిమిషులనైనఁ జేకొన | వనిమొన వా రింత బలియు రగు టేమి యొకో?’ |
6 |
| క. |
అనిన విని నవ్వి యతఁ డి | ట్లను ‘నిం తన నేల? నన్ను నని నా యొడ లో మినచోటుఁగలదె? పెఱయో | ధనికాయం బైన నకట! తలఁకదె చెపుమా! |
7 |
| వ. | పాండవుల గెలువ నలవి గా దని యెప్పుడుం జెప్పుదు నైన నఱలేక నీకు జయంబు గోరి పోరెద వగవ కుండుము.’ | 8 |