| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
కోప సందీప్తుఁడై చాపంబు సజ్యంబు | గావించి మౌర్వి మార్గణముఁ గూర్చి పాశుపతాస్త్ర సంబద్ధంబుగాఁ జేసి | పురములు మూఁటిని బుద్ధినిలుప నవి యొక్కచోటికి నప్పుడ కూడిన | మునులును సురలును ముదముఁ బొంది గెలుగెలుమంచు నగ్గింప నయ్యుగ్రుండు | దెగ వాపి యేసిన దితిజయుతము |
|
| ఆ. |
గాఁ బురత్రయంబు కాలి నీఱై పశ్చి | మాబ్ధిఁ దొరఁగ నమ్మహాగ్ని లోక ములు దహింపఁజొచ్చెఁ బురహరుఁ డది మాన్చె | సంతసిల్లె సకల జంతువులును. |
293 |
| వ. | అప్పు డనిమిష మునిజనంబులు గృతకృత్యులయి భూతనాథుం బ్రణుతించి యతం డనుమతిసేయ నంబుజాసనుండు లోనుగా నందఱు నిజస్థానంబులకుం జని రివ్విధంబున లోకహితార్థంబుగా నప్పరమేష్ఠి శివునకు సారథ్యం బనుష్ఠించె నీవు నట్ల పోలెఁ గౌరవ రక్షణార్థంబుగా రాధేయు రథంబు గడపు మిక్కర్ణునకు నక్కిరీటికిఁ గృష్ణునకున్ బలశౌర్యంబుల నెక్కుడయినవాఁడవు మదీయ జీవితంబును రాజ్యంబును భవదధీనంబులు వానిం గలిగింపను జయంబును సుఖంబును గావింపను నీవ యొడయండ విక్కార్యం బాచరించి నన్ను రక్షింపు’ మని ప్రార్థించి నీ పుత్రుండు మద్రపతికి మఱియు నిట్లనియె. | 294 |
| సీ. |
‘ఇది యొక్క యితిహాస మే నొద్దనుండ ధ | ర్మ ప్రవీణుండగు బ్రాహ్మణుండు ధృతరాష్ట్ర వసుమతీపతికిఁ జెప్పిన యది | వినుము భార్గవ వంశమునఁ బ్రసిద్ధుఁ డగు జమదగ్నికి నత్యంతనిర్మల | మతి రాముఁ డుదయించె నతనిచేయు తపమున హరుఁడు ప్రత్యక్షమై నిలిచిన | నతఁడు దివ్యాస్త్రంబు లడుగుటయును |
|
| ఆ. |
నమ్మహాత్ముఁ డశుచు లైనవారల నవి | నిర్దహించుఁగాన నీవు పరమ శుచివిగమ్ము నీకుఁ జొప్పడు నఖిల మ | హాస్త్ర వీర్య’ మనియె నాదరమున. |
295 |
| వ. | అనిన విని జామదగ్న్యుండు వినతుండై ‘నాకెప్పుడు పాత్రత్వంబు గలిగె నప్పుడ నీవుతలంచి దయసేతువు గాక నీకు శుశ్రూష సేయుచుండునట్లుగాఁ బ్రసాదింపవలయు’ నని విన్నవించిన విని కరుణాయత్తచిత్తుండగు భవుం డవ్వరం బిచ్చిన నమ్మహాత్ముండు నియమ నిష్ఠాపరుండై పూజోపహార ప్రముఖ విధానంబుల నద్దేవు నారాధించు చుండ ననేక సంవత్సరంబులు సన నొక్కనాఁడు పరమేశ్వరుండు ప్రసాదలసితాననుండై గౌరీదేవికి నతనిం జూపుచు. | 296 |
| క. |
‘రాముఁడు విమలవ్రత చ | ర్యామహితుఁడు నాకు భక్తుఁ’ డని పలుమాఱుం దా ముద్దు సేసి మృదువచ | నామృత సంసిక్తుఁ జేయు నా సమయమునన్.’ |
297 |
| వ. | బలవంతులగు దనుజులచేత బాధితులయి బృందారకు లయ్యిందుధరు పాలికి భయ సంభ్రమములతో నరుగుదెంచి తమ యలజడి యెఱిఁగించిన. | 298 |
| ఆ. |
జామదగ్న్యుఁ జూచి చయ్యనఁ జని దాన | వుల వధించి దేవతలకుఁ బ్రీతి యాచరింపు మనియె హరుఁడు దానికి మది | ముదముఁ బొంది కేలుమొగిచి యతఁడు. |
299 |
| క. |
‘అకృతాస్త్రుఁడ నగు నాకుం | బ్రకటభుజాబలులు నస్త్రపారీణులునై సకల సురనికర సంబా | ధకులగు దానవుల గెలువఁదరమే?’ యనుడున్. |
300 |
| తే. |
అంబికానాథుఁ డిట్లను నతనితోడఁ | ‘దలఁపు నీదెస నిలిపెద దానఁజేసి పగఱ నిర్జింపనగుఁ బదంపడి మనోర | థంబు సిద్ధించు నరుగుము దడయ కనఘ!’ |
301 |
| చ. |
అనవుడు నట్లకాకయని యా జమదగ్నిసుతుండు ధీరతం జని సముదగ్రులైన సురశత్రులఁ దీవ్రతరాయుధోత్కరం బున వధియించి వారి బలుపోటుల నొచ్చినమేనితోడ వ చ్చినఁ బురవైరి నిర్వ్రణునిఁ జేసెఁ గరంబున నంటి యాతనిన్. |
302 |
| వ. | ఇవ్విధంబునం బ్రదీప్త శరీరున్ గావించి భర్గుం డాభార్గవు పయిం బ్రీతిశీతలంబగు నాలోకం బొలయ నాతని కిట్లనియె. | 303 |
| క. |
‘అనివర్తనమతిఁ గవయఁగ | నని నీదగు తనువు సునిశితాయుధములు దాఁ కిన నొవ్వదు శత్రులు వ న్నిన నుడుపుము గర్వ మడఁచి నిర్మల చరితా! |
304 |
| వ. | కావున వరప్రతిగ్రహంబున కిదియ సమయంబు. | 305 |
| క. |
కొను’ మని దివ్యంబగు న | స్త్రనికాయము శస్త్రచయము దద్దయు దయ ని చ్చిన నవి యాతఁడు సాష్టాం | గనమస్కారంబు సేసి కైకొనియె నృపా! |
306 |
| వ. | తదనంతరంబ లోకగురుండగు నా హరునిచేత ననుజ్ఞాతుండై యతండు నిజస్థానంబునకుం జనియె నయ్యితిహాసప్రకారం బిట్టిది యివ్విధంబున వివిధ దుష్కరసత్కర్మానుష్ఠానఫలంబులై వచ్చిన సర్వదివ్యాస్త్రంబులు నా రాముండు రాధేయునకుఁ బ్రీతచేతస్కుండై యొసంగె నట్టి మహాత్ములు హీనకుల జాతుల నాదరింతురే? యప్పుణ్యపురుషుండు గయికొనుటఁ గర్ణుం డుత్కృష్ట యోనిజాతుండని తలంచెద వదన వక్షోబాహు ప్రముఖాంగంబులు సూడ దేవకుమారుండుంబోలె నున్నవాఁడు ప్రకృతి కాంత కాంచన కుండలవజ్ర కవచంబులతోడ నాదిత్యసన్నిభుండగు కొడుకుం గాంచునే? సింగంబులేడి కెట్లు వుట్టు? నితనికి సూత సంవర్ధితుండైన కీడుదొడరె నింతియ కానోపు రుద్రశిష్యత్వంబున విశ్రుతుండగు భార్గవరామునకుఁబ్రియశిష్యుండగు నంగరాజు ననంగ దమనుం బరిగ్రహించిన విరించి భంగిఁ బరిగ్రహించి నీవు సారథ్యం బాచరింపు మఖిల గుణంబులను సారథి రథికున కధికుండు గావలయునను నీతి కలదు నీవు ప్రసన్నుండవగుటం జేసి నాకోర్కె సిద్ధించె ననుటయు. | 307 |
| తే. |
‘క్రుచ్చి మద్రవిభుండు నీకొడుకుఁ గౌఁగి | లించి ప్రియ మాననమునఁ దలిర్ప నృపకు మార! నీవు నాకొలఁది యిట్లరయ నెఱుఁగు | దేని యిది లెస్స నీకోర్కి యేను దీర్తు.’ |
308 |
| వ. | అని మఱియును. | 309 |