| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | అనిన విని శల్యుండు గర్ణున కి ట్లనియె. | 22 |
| చ. |
‘వినిన జనంబు లీతఁ డవివేకి యనన్ వల దింత రజ్జు ల ర్జును బలశౌర్య సంపదలు సూచి యెఱుంగమె మున్ను? నిన్ను నా తనిఁ గలనన్ జగం బెఱుఁగదా యతఁ డద్భుత విక్రమోజ్జ్వలుం డెనయుదె నీవు పౌరుషవిహీనుఁడ వద్దివిజేంద్రనందనున్. |
23 |
| సీ. |
రాత్రిమైఁ దాఁకి క్రూరతఁ బోర మగఁటిమి | వాసిన అంగారపర్ణుకంటె, ఘోషయాత్రా విధిఁ గురురాజుఁ జెఱ పట్టి | మాన మేదిన చిత్రసేనుకంటె, ఖాండవోద్యానంబుఁ గావ నేరక సిగ్గు | వడి చన్న నిర్జరప్రభునికంటెఁ, గ్రీడాకిరాతుఁ డై క్రోడంబునకుఁ గాఁగఁ | బెనఁగి చిక్కిన త్రిలోచనునికంటె |
|
| ఆ. |
నెక్కు డైన వీరుఁ; డే నర్జునునితోడఁ | బొడుతు నొడుతు ననినఁ బోలుఁ గాక; వినుము సూతతనయ! మనబోఁటు లాతనిఁ | జెఱుతు మనుట నోరిచేటు గాదె? |
24 |
| చ. |
నృపుఁడును భీష్ముఁడుం గృపుఁడు నీవు గురుండును దత్సుతుండు ను గ్రపు బలమేచి తో నడవఁగా బెనుదాడిగఁ బోయి మత్స్య నా థుపసులఁ బట్టి యద్దొరలతోఁ జెడి పాఱితి కర్ణ! యప్డు క య్యపు బలుపాడె, డిప్డు మన యర్జును నమ్ములు ద్రుప్పు వట్టెనే? |
25 |
| ఉ. |
ముందరియట్లు గాదు, జనముల్ దెగడన్ వెఱఁ బాఱ నేఁడు సం క్రందనసూతి మార్కొని తిరంబయి పోరెద, దాఁపఁ బ్రాణముల్, నిందకుఁ జాల నింక నను నిక్కపుఁబల్కులు పల్కు టొప్పు; దా నం దుదిఁ జచ్చినం జను; మొనన్ నరుఁ దాఁకుట రిత్త వోవునే?’ |
26 |
| వ. | అనవుడు నలుక వొడమిన నడంచికొని రాధేయుండు మద్రపతి కి ట్లనియె. | 27 |
| చ. |
‘నరునకుఁ బూని పల్కితి వినం జవిమాలిన దొడ్డ పల్కు లే నరగలి లేక బెట్టడరినప్పుడు సూడుము నన్ను నాతనిం దిరమయి బాహు శక్తియును ధీరతయున్ వెరవుం జలంబు నె వ్వరిదెసఁ గాంచి తెక్కుడుగ వారి నుతింపుము మాను మంతకున్.’ |
28 |
| వ. | అనుటయు ‘నట్ల చేసెద నని పలికి శల్యుం డూరకుండెఁ, ‘దేరువో ని’ మ్మని రాధేయుండు దఱిమి పలికిన నమ్మద్రేశ్వరుండును దురంగంబుల సత్వరంబుగా నడపె, నివ్విధంబునం జని మనమొన సొచ్చి సైనికులు సంతసిల్ల వారలం గలయం గనుంగొని కర్ణుం డిట్లనియె. | 29 |
| సీ. |
వలను శోభిల్ల నెవ్వాఁ డైన వీఁడె య | ర్జునుఁ డని నా కిప్డు సూపెనేనిఁ బసదనం బేనిచ్చు భంగి యందఱకును | వివరించి చెప్పెద వినుఁడు మీరు వొగడంగఁ దగు రథ్యముల తోడి సౌవర్ణ | రథములు వలసిన, రయము లావుఁ బొలుపును గలుగు కాంభోజ హయంబుల | వలసినఁ, బేర్చు సత్త్వంబునందుఁ |
|
| తే. |
బరిణతములగు సుందర కరివరముల | వలసినను, జారులావణ్యవతుల వలసి నను, మహాగ్రామములు వలసినను, గోర్కి | కెక్కు డమ్మేటి మగని కే నిచ్చువాఁడ. |
30 |
| క. |
మఱి యొక్కటి సెప్పెద, ని | ద్దఱు కృష్ణులఁ జంపి వారి ధనములు నా కి త్తఱిఁ దద్రథ మిదియే యని | యెఱిఁగించిన యతని కిత్తు నేను ముదమునన్.’ |
31 |
| వ. | అని పలికి శంఖం బొత్తిన దుర్యోధనుం డనుజ సహితంబుగాఁ బ్రమోదంబు నొందె; నప్పుడు నిస్సాణాది తూర్య నిస్వనంబులు దిక్కులం బిక్కటిల్లె; మన యోధవరులును వరూథినియు నుబ్బునఁ బేర్చి యార్చిన నినదంబులు నింగిముట్టె; నయ్యెడఁ బ్రహాసభాసుర ముఖుండై మద్రవిభుండు రాధేయున కి ట్లనియె. | 32 |
| ఉ. |
‘ఎవ్వరు సూప నేల?, నరు నిప్పుడ కాంచెదు; రిత్త వారికిం గ్రొవ్వున నుజ్జ్వలార్థములు గొండని యీ వల; దిట్టు లిచ్చినన్ నవ్వు జనంబు, మిక్కిలి ధనంబులు గల్గినఁ జేయరాదె నీ కెవ్విధి నైన సద్వ్యయము, లెందు నపాత్రపు టీవి యొప్పునే?’ |
33 |
| వ. | అని యంత నిలువక. | 34 |
| క. |
కొలఁది యెఱుంగక కృష్ణులఁ | గలన గెలుతు ననియె దీవు, గంటిమె సింగం బుల నెత్తఱి నైనను నే | పొలమున నేనియును నక్క పోరి గెలువఁగన్. |
35 |
| ఉ. |
అగ్గి సొరం దలంచునటు లర్జును నెక్కటి దాఁకఁ గోర్కి నీ కెగ్గిది మాను; మీ పలుకు లెవ్వరుఁ జెప్పఁగ లేరు; రూపఱ న్మ్రగ్గఁగఁ గాలమయ్యె నొకొ! నా వచనంబు లొకింత కర్ణము ల్దగ్గర నిచ్చి యోధులు బలంబులుఁ దోడుగఁ బోరు టొప్పగున్. |
36 |
| ఆ. |
ఏను ధార్తరాష్ట్ర హిత మాచరించుట | కై పెనంగి చెవుల కప్రియంబు లైన నిన్ని మాటలాడితి; నా బుద్ధి | విని దురాగ్రహంబు విడువవలయు.’ |
37 |
| చ. |
అనవుడు నల్గి సూతసుతుఁ డాతని కిట్లను ‘మద్బలంబు న మ్మిన నను నిత్తెఱంగునకు మేకొన కుండఁగ మాన్ప వజ్రహ స్తునకు వశంబుగా ద నినఁ జొప్పడునే నిను బోఁటి కాప్తిఁజె ప్పిన క్రియఁ జెప్పి నీవు వెఱపించిన నే వెఱ పెక్కు వాఁడనే?’ |
38 |
| వ. | అనుటయు నతని నగ్గలంబు కోపింపం జేయుటకై శల్యుండు మఱియు ని ట్లనియె. | 39 |
| తే. |
‘ఇప్పుడే నీకు బుద్ధులు సెప్ప నేల? | నరుఁడు గాండీవ గుణ నిక్వణంబు సెలఁగఁ గదిసి నీ మెయి బలుతూపుగములు నిగుడఁ | జేసి నిను బుద్ధిమంతుని జేయుఁగాక!’ |
40 |
| వ. | అని యంతం దనివోక యతండు. | 41 |
| సీ. |
‘రోష మహాటోప భీషణ హరితోడ | సమరంబునకు హరిణము గడంగి, దాన ధారాభీల దంతావళము తోడ | సంగ్రామమునకు శశంబు గడఁగి, చండ స్వభావోగ్ర పుండరీకము తోడ | నాజికి సారమేయంబు గడఁగి, దారుణ తుండాతి ఘోర గృధ్రము తోడఁ | గలహంబునకు నురగంబు గడఁగి, |
|
| ఆ. |
యడరునట్లు గాదె యస్త్రకళా సము | జ్జ్వలుఁడు పార్థుతోడ సంగరమున కీవు గడఁగి యడరు టెల్ల రాధేయ! నీ | కెట్టి బలము నమ్మ నెందుఁ గలదు?’ |
42 |
| వ. | అనియె, ని వ్విధంబున నధిక్షేపింపంబడి కర్ణుండు గోపించి కెంపారు కన్నుల నాశల్యు నాలోకించి. | 43 |
| క. |
‘గుణవంతుల గుణములు ని | ర్గుణుఁ డెఱుఁగమి దెల్ల; మీవు గుణహీనుఁడ వీ గుణ మితనియందుఁ గల దని | గణుతింపఁగ నైపుణంబు గలదే నీకున్? |
44 |
| సీ. |
అర్జును నస్త్రవిద్యా ప్రమాణంబు నా | యెఱిఁగిన యంత నీ వెఱుఁగ వతని కొలఁదియు వనమాలి కొలఁదియు గాంచి నా | కొలఁదియు నెఱిఁగి వారల మదీయ దివ్యాస్త్ర బలమునఁ దెగటార్ప నగునని | యే నిశ్చయించితి; నెట్టు లనినఁ గడుఁ బెద్దకాలంబు గంధ పుష్పాదులు | నర్చించుచున్నాఁడ ననుదినంబు |
|
| ఆ. |
దొనఁ గరంబు భక్తి నునిచిన నున్న ది | యహిమయంబు దారుణాస్త్ర; మింత యంత యనక యెదిరి నాహుతి గొను దాన | జిష్ణు నోర్తు నొండెఁ గృష్ణు నోర్తు. |
45 |
| వ. | భార్గవాస్త్రంబున నొక్కనిం బొరిపుత్తు నట్లుఁ గాక యాదవ పాండవ నివహంబులోనం గృష్ణార్జునులయందు లక్ష్మీ విజయంబులు సుప్రతిష్ఠితంబులై యుండు; నయ్యిరువురం బొదివి పెనంగం గనుటకంటె మేలునుం గలదే? వారల గరుడ కపి ధ్వజంబులుఁ జక్ర గాండీవంబులు బెండు మానుసులకు భీషణంబులు గాని నాకుఁ బరితోషణంబులు వేవురు గోవిందులుఁ బదివేవురు పార్థులుఁ బన్నినం బోరెద; నీవు మహాయుద్ధ కోవిదుండవు గామింజేసి వెఱచఱచి కాఱు లఱచెద; వక్కడి పక్షపాతంబునఁ బ్రేలెదవో యెఱుంగ నింకనిట్టి మాటలాడితేని ప్రాణంబుల కొఱ యొల్ల వని పలికి వెండియు.’ | 46 |