| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
వెగడునఁ జె య్వేది వేగంబ తేఱి | సంశప్తకు లర్జును సాయకముల కోహటింపక సముత్సాహంబు వదల కం | దఱు నొక్కపెట్ట తద్రథము వొదివి హరులతో గాడియు హరికేలు నొగలును | బలుగాఁడియును గండ్లు బట్టి మెలఁగ మిడుకరాకుండ నమ్మేటివిల్కాని మే | నును నిగ్రహించుట గనుఁగొనంగ |
|
| తే. |
నద్భుతం బయ్యె నపుడు సేయార్చి శౌరి | లీలఁ గొందఱ మత్త శుండాల భంగి మెఱయఁ దూలించెఁ గాలను గుఱుచ తూపు | గములఁ బార్థుండు పలువుర సమయఁ జేసె. |
229 |
| వ. | అంతఁ గొంత యూరుపువోయినం జిఱునవ్వు నవ్వి కవ్వడి కమలనాభున కి ట్లనియె. | 230 |
| ఆ. |
‘తేరు గదలనీక వైరులు బలువిడిఁ | బొదివిపట్ట రాచ పొల్ల నైన యేను దక్క నృపతిసూనుఁ డి ట్లొరుఁడు స | హించు నెట్లు విక్రమించుఁగాక!’ |
231 |
| క. |
అని పలికి చూడు మా న | న్ననుచు భుజంగాస్త్ర మేయ నది యరులకు గ్ర క్కునఁ బాదబంధ మొనరిం |చిన ముంచె నతండు వారి శితవిశిఖములన్. |
232 |
| వ. | ఇ వ్విధంబున. | 233 |
| ఆ. |
నాగ పాశ బంధనంబుల గుదివడి | వారు వివిధ బాణ దారితాంగు లై రథంబు విడిచి; రప్పు డా సంశప్త | క వ్రజంబుఁ గని త్రిగర్తవిభుఁడు. |
234 |
| క. |
గరుడాస్త్రం బేసిన న | చ్చెరువుగ గరుడములు గవిసి చీరెం జంచు స్ఫురణము మెఱయఁ గ వెస న | య్యురగాత్మక బంధ మూడ నుర్వీనాథా! |
235 |
| క. |
తన కడిమి బంధమోక్షము | గనిన రథికకోటి గడఁగి గాండివిపయి నే పునఁ దూపులు దొరఁగింపఁగ | ఘనభుజుఁడు సుశర్ముఁ డేసెఁ గన దస్త్రమునన్. |
236 |
| చ. |
అది నరుడెంద మాడుటయు నాతఁడు మూర్ఛ మునింగి తేరిపైఁ జదికిలఁబడ్డ నుబ్బి ‘యద్దె చచ్చె సుశర్ముని యేటు దాఁకి బ ల్లిదుఁ డగు పార్థుఁ డంచు మదలీలల నార్చిరి నీదు సైనికుల్; సదలను దిక్కులం బరఁగె శంఖముఖోద్భట తూర్య నాదముల్. |
237 |
| సీ. |
అంతఁ దెప్పిఱి విలయాంతకు కైవడిఁ గవ్వడి యేచి మార్గణ చయంబు పె ల్లడరించిన బీఱువోయె సుశర్మ | యా సేనమీఁద నైంద్రాస్త్ర మక్కి రీటి నవ్వుచు నేయ నాటోపమున నది | వివిధ బాణాకృతిఁ గవిసి నుఱుము గావింపఁగాఁ బదివేవురు సంశప్త | కాగ్రేసరులు దెగటాఱి రప్పు |
|
| ఆ. |
డుక్కు దక్కి తలరి తక్కటి యోధులు | చేష్టితంబు లెడలఁ జిత్రరూపు లట్టులైరి ధూమ మడఁగిన వెలుఁగొందు | ననలు చందమయ్యె నన్నరుండు. |
238 |
| వ. | హతశేషులైన సంశప్తకులు చతుర్దశ సహస్రయోధముఖ్యు లవ్విజయు విజయంబు సహింపక యొండొరులం బురికొల్పి బలంబులతోడం గడంగిన నతం డతిదారుణంబగు రణంబుసేయఁ దక్కటి పాండవుల దెసఁబోరు కౌరవ బలంబు తద్బల శౌర్యంబు లోర్వక భీతిఁగలంగి పఱచినం గృతవర్మ కృపగురు పుత్ర కర్ణులు నులూక సౌబల సుయోధనులు దుశ్శాసనాది కుమారులును బరవసంబు సేసి యా సైన్యంబుఁ దైన్యంబు వాయ విక్రమించి; రట్టియెడఁ గృపుని యపరిమిత శరజాలంబు పాంచాల పుంజంబుం బొదివినం గనలి శిఖండి యమ్మహీసురవరుని మార్కొనియె; నయ్యిరువుర సమరంబు రామ రావణుల రణంబు కరణి నొప్పె; నట్లు పోరి పోరి శారద్వతుండు. | 239 |
| చ. |
హరులను సూతుఁ జంపిన నుదగ్రత నా ద్రుపదాత్మజుండు వి స్ఫురిత కృపాణ చర్మ పరిశోభితుఁడై యరదంబు డిగ్గి స త్వరముగ నేఁగుదేర శరవాహిని పై నిగిడించె; నాతఁ డ య్యరి వెఱఁగందుచున్ నిలుచునట్టుగ జోదులు పిచ్చలింపఁగన్. |
240 |
| వ. | అట్లేచిన కృపాచార్యుపై నురవడించిన ధృష్టద్యుమ్నుం గృతవర్మయు ధర్మతనయ ద్రౌపదేయుల నశ్వత్థామయుఁ గవలం గురుపతియును వృకోదరుం గర్ణుండునుం దలపడి నిలువరించి రగ్గౌతముండు శిఖండి పలక పఱియలు సేసిన నతండు దెరలక కేవల కరవాలంబున విక్రమింపం గడంగిన నయ్యతిరథుండు. | 241 |
| క. |
వాలిక తూపులు మేనం | గీలుకొలిపి నొంపఁ గన సుకేతుఁడు బాణ జ్వాలలు నిగుడ నడరి యా | భీలత నా కృపునితోడఁ బెనఁగె నరేంద్రా! |
242 |
| తే. |
తనకు నెడ సొచ్చి యిట్టు లతండు పెనఁగ | ద్రుపదనందనుఁ డల్లన తొలఁగిపోయె; నా సుకేతుండు గృపునిమై నాఁట నిరువ | దాఱు శరములు వఱపి రయంబు మెఱయ. |
243 |
| వ. | ధనువు దునిమి యొండు కోదండం బెత్తిన నదియును ఖండించి. | 244 |
| క. |
తోడన హయసూతుల మెయిఁ | గాఁడఁగ నేయుటయు నతఁడు గనలుచు బలువిల్ క్రీడయ పోలెం గొని మే | న్గాఁడఁగ నిగిడించెఁ ద్రిదశనారాచంబుల్. |
245 |