| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము |
| చ. |
గురుతనయుం డనేకరథికుల్ దన పార్శ్వములం దుదగ్రు లై దురము కడంకమైఁ దఱుమ దోర్బల శౌర్యము లుల్లసిల్ల ని ష్ఠుర శరవృష్టి ముంచె మధుసూదను మధ్యమపాండవున్ వియ చ్చరులు ప్రశంస సేయఁగ నిజధ్వజినీనయనోత్సవంబుగన్. |
372 |
| క. |
అలిగి నరుఁ డైంద్ర మాదిగఁ | గల దివ్యాస్త్రంబు లేయఁగా నయ్యై యు జ్జ్వల మార్గణంబులను న | క్కలశభవసుతుండు మాన్చెఁ గౌరవముఖ్యా! |
373 |
| వ. | ఇ వ్విధంబున వివిధాస్త్రజాలంబులం బోరి పోరి. | 374 |
| సీ. |
ఉఱక యశ్వత్థామ యుగ్రబాణంబులు | విజయుని దక్షిణభుజము దూఱ మూఁడేయ నొచ్చియుఁ బోఁడిమి సెడక య | బ్బలియుం డదల్చెఁ దత్పార్శ్వవర్తు లగు పెనుమూఁకల నమ్ములవెల్లిఁ బే | రల్క నక్కుంభజునాత్మజుండు రథ్యచయంబు నారాయణు వానర | ధ్వజము నవ్వీరు గాత్రమును బొదివె |
|
| తే. |
మెఱుఁగు వాలంపగముల నమ్మెయి నరుండు | ద్రౌణితోడ భరంపడి రణ మొనర్చు చుండ నట మున్న ధర్మజుఁ డురవడించి | చిత్రసేనుని నమ్ములఁ జిక్కువఱిచి. |
375 |
| క. |
తఱిమి తన మునుము సైన్యము | నురుమాఁడఁగఁ గని సుయోధనుఁడు మున్నుగ నే డ్తెఱ నీ యోధులు మార్కొని | యఱిముఱి నొప్పించి పట్ట నమరి పొదివినన్. |
376 |
| ఉ. |
పావని మున్నుగాఁ గవలుఁ బార్షతుఁడున్ వెస వారిఁ దాఁకినం జేవ దలిర్ప నచ్చటికిఁ జెచ్చెరఁ గర్ణుఁడు వచ్చి తీవ్ర బా ణావృతమూర్తిఁ జేసె మనుజాధిప! యా రథికావలిన్ ధను ర్జ్యా వితత స్వనంబున వియద్వివరంబు ప్రపూరితంబుగన్. |
377 |
| క. |
అట్టియెడ మాద్రి పిదపటి | పట్టి కురునృపాలు రెండుపదులమ్ములు దా బెట్టుగ నేసిన వేదన | ముట్టుడుఁ జేడ్పడియె నతఁడు మొనయును దలఁకెన్. |
378 |
| మ. |
కని రాధేయుఁడు దివ్యబాణనిహతిం గౌంతేయ సైన్యంబు నె ల్లను నొప్పించిన బీఱువోయె నది యుల్లాసోగ్రుఁ డై ధర్మ నందను నమ్మేటిమగండు గిట్టుటయు నాతం డల్గి పె ల్లేసినన్ విను మందస్మితసుందరుం డగుచు నవ్వీరుండు ధీరోద్ధతిన్. |
379 |
| వ. | అనేక చండ కాండంబు లంగంబునం గీలించి. | 380 |
| ఆ. |
వలుఁద నారసంబు వక్షంబుఁ దూఱంగ | నేయుటయును బాండవేయుఁ డార్తిఁ గూరి నిలువలేక కూర్చుండఁబడి సూతు | నరద మెగవు తొలఁగ ననియె నధిప! |
381 |
| వ. | అనుటయు వాఁ డట్ల చేయం గౌరవులు గడంగి పోనీక పొదువుం డను నెలుంగులతో నక్కౌంతేయాగ్రజు వెన్నాడి కవిసినం గేకయ పాంచాల బలంబు లడ్డపడి పెనంగె; భీమసేనుండు సుయోధనుని ‘నిలు నిలు’ మని యదల్చి యమ్ములం గప్పె; నప్పుడు రాధేయుండు రభసంబున. | 382 |
| క. |
పాంచాలురఁ గేకయుల ను | దంచిత గర్వమున వాలురమ్ములవెల్లిన్ ముంచిన నోటఱి యరికరి | పంచాననమూర్తి భీముపజ్జ కొదిఁగినన్. |
383 |
| వ. | అక్కర్ణుండు నిజరథంబు మెఱయ ధర్మనందను వెనుకొనియె; నతండు విశిఖ వేదనం జేడ్పడిన చిత్తంబుతోడ నిజశిబిరంబున కల్లనల్లన పోవుచుండియుఁ దన్ను నా సూతనందనుండు మూఁడుదూపుల నేసిన మరలి యమ్మేటిమగని మేనం బలుమార్గణంబులు సొనిపి తత్సారథి సాయక త్రయంబునకు హయంబుల శరచతుష్టయంబునను స్రుక్కించె నట్టియెడ. | 384 |
| క. |
ఇరుదెసల నున్న కవ ల | న్నరపతి దురవస్థ సూచి నారాచపరం పరలు పరఁగించుచును జె | చ్చెరఁ గర్ణునిఁ దాఁకి రతఁడు చిఱున వ్వొలయన్. |
385 |
| తే. |
వార లిరువుర నుగ్రంపు నారసములఁ | గప్పి దంత వర్ణములును గాలవాల సుందరంబులు నగు ధర్మనందనుని తు | రంగమంబులఁ బడనేసి రయము మెఱయ. |
386 |
| క. |
అతని శిరస్త్రాణంబును | శితవిశిఖ నిపాతితంబు సేసి యుదారో ద్ధతి నకలు కార్ముకము హయ | తతియుం దునుమాడుటయు నతండును నతఁడున్. |
387 |
| క. |
సహదేవుని తే రెక్కిన | నహితాంతకుఁ డైన కర్ణుఁ డమ్మువ్వుర సం పిహిత శరీరులఁ జెసెను | బహువిధ బాణములఁ జలము బలమును మెఱయన్. |
388 |
| చ. |
కనుఁగొని శల్యుఁ డి ట్లనియెఁ గర్ణునితో ‘నిది యేల? ధర్మనం దనుపయి నాగ్రహించెదు; హితం బగు కార్యమె యిమ్మహీశు నీ వనిఁ దెగటార్చినట్లయిన నర్జునుఁ డుత్కట శోకరోషమున్ పెనఁగొన నిన్నుఁ గౌరవులఁ బీనుఁగుపెంటలు సేయకుండునే? |
389 |
| తే. |
ఇతఁడు దెగటాఱెనేనియు నేమి ఫలము | గలదు? నరుఁ బొలియించుట యలఘుశౌర్య; మది కురుక్షితిపాలున కఖిల రాజ్య | సిద్ధియును జేయు; నింక నా బుద్ధి వినుము. |
390 |
| వ. | అదియునుం గాక. | 391 |
| క. |
వాఁడె కురుక్షితిపాలుఁడు | పోఁడిమి సెడి భీముచేతఁ బొదువఁబడియె న వ్వాఁడిమగని కడ్డము నీ | వేఁడిమి దక్కంగఁగలదె వేఱొకఁ డరయన్? |
392 |
| క. |
పవనసుతు చేత నా భూ |ధవుఁ డీల్గినయేని నీవు ధర్మతనయునిం గవలన్ సమయించుట దలఁ | ప వృథాస్ఫురణంబు గాదె పరబలభేదీ!’ |
393 |
| క. |
అన విని యఱ్ఱెత్తి భవ | త్తనయుని దెసఁ జూచి వాయుతనయునిచే నా తని పొదువఁబడుట యేర్పడఁ | గని రాధాతనయుఁ డతని గావఁగఁ జనియెన్. |
394 |
| క. |
చనుటయు నజాతశత్రుఁడు | దన శిబిరంబునకుఁ బిన్నతమ్ముని యరదం బున నతని నతని యన్నను | గొని చనియెను సత్వరముగఁ గురుకులముఖ్యా! |
395 |
| వ. | అని యిట్లు సంజయుండు ధృతరాష్ట్రునకు ధర్మనందను పలాయనం బెఱింగించె ననుటయు. | 396 |
| ఆ. |
మొదలిరాజు సభయముగ నిట్లు సమరంబు | దొఱఁగి చనియె నట్టె; పెఱబలంబు దొరలు నిలిచి పోరు టరిది; యనంతర | వర్తనంబు విప్రవర్య! చెపుమ. |
397 |
| వ. | అని యడుగుటయు. | 398 |