| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - ద్వితీయాశ్వాసము |
| చ. |
అనిమిషవంద్యమాన! ఘనసాదరశీల సుధాయమాన! స త్త్వనలిన గంధరూప! విబుధ ద్విషదంతకర ప్రతాప సం జనిత నిరస్తకామ! మునిసంఘ మహార్ణవ పూర్ణసోమ! వే దనికర సంవిధేయ నిజతత్త్వ పరిష్క్రియ నిత్యనిష్క్రియా |
399 |
| క. |
ప్రమితి విదూరా! సుమన | స్సమితి సమారాధన ప్రసన్నాకారా! గమనా గమన నిరసనా! శమన దమన సాధ్యపరమ సారోల్లసనా! |
400 |
| మాలిని |
ద్విజపతి వృషభాంకోదీర్ణ! కారుణ్య పూర్ణా! భజన నిరతరక్షౌ ప్రౌఢ! నిర్భేదరూఢా! గజదురిత సముత్సేకఘ్న! హృత్పద్మనిఘ్నా! యజన విధి ఫలత్వవ్యాప్త! నిత్య ప్రదీప్తా! |
401 |
| గద్యము | ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బయిన శ్రీమహాభారతంబున కర్ణపర్వంబునందు ద్వితీయాశ్వాసము. | 402 |