| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
‘అనిలోఁ దెరలుట దొలఁగుట | యనునివి సనుఁ గాక, నొచ్చియైనను గల నె ల్లను వెడలఁ జనునె? యే న | ట్లును గా కిట వచ్చుటం జులుకనైతిఁ గడున్.’ |
52 |
| క. |
‘విను! కర్ణున కే నోడితి | నన నేటికి? నీవు నోడి; తనిలజ మాద్రీ తనయులు మున్నే యోడిరి; మనతోఁ గూడంగఁ గంసమర్దనుఁ డోడెన్!’ |
53 |
| క. |
‘కావున మన మిఁక ననికిం | బోవం బని లేదు; విపినభూమికిఁ జని య చ్చో వెఱపు దక్కి తపసుల | మై, విచ్చలవిడిఁ జరింత మందఱముఁ దగన్!’ |
54 |
| క. |
‘కాదేని, బిరుదు లాడక | సాదుల మై వినయ మొప్పఁ జని, కురునాథుం డేది పనిచినను జేసి, ద | యాదృష్టి నతండు సూచున ట్లుండఁదగున్.’ |
55 |
| వ. | అని కెంజాయ రంజిల్లు కన్నుల నన్నరు నాలోకించి. | 56 |
| ఉ. |
‘నీతెఱఁ గిట్టిదేని? రణనిష్ఠకుఁ బూనక కార్యవాది వై ద్వైతవనంబునంద సముదగ్రభుజాబలదుర్జయుండు రా ధాతనయుండు, వాని ననిఁ దాఁక నశక్యము నాకు నన్న, నే నీతెరు వేల వత్తు? మహి యేల నశక్తుఁడు వాంఛ సేయునే?’ |
57 |
| క. |
‘అని వధించెదఁ గర్ణు నే నని ప్రతిజ్ఞ | సేసి, యిటు దెచ్చిన న న్నిట్లు సేసి, తింత కెట్లు నేర్చితి? పొడవుగా నెత్తి నేల | వైవ నోర్చితి ననుఁ బగవారి నడుమ.’ |
58 |
| ఉ. |
‘పంకజనాభుఁడున్ వినఁగఁ బల్కిన యప్పలు కిమ్మెయిం దుదిన్ బొంకగుటోర్చి తిట్టి నినుఁ బుట్టినయప్డు నుతించెఁ బోరికిన్ శంక గొనండు, గెల్చుఁ గురుసంఘము నీతఁడు పుణ్యుఁ డన్న యా బొంకరి దివ్యవాణియుఁ దపోధనులున్ మము ని ట్లలంతురే!’ |
59 |
| క. |
‘విను! మప్పలుకులు పాటిగఁ | గొని దుర్యోధనునితోడఁ గొంటిని బగ ము న్ను; నిజంబుగ నెఱుఁగను వీఁ | డని రాధేయునకు వెఱచునని యే నిన్నున్.’ |
60 |
| సీ. |
‘దేవత లిచ్చిన తేరు నశ్వంబులుఁ | గపికేతనంబును గలవు; దైవి కంబు చే నున్నది; గాండీవ మనఁ దాటి | యంతవి ల్లది గాక, హరి రథంబు గడపెడు నటె! పరికర మిట్టి దై యుండ | నెట్లు కర్ణున కోడి యిట్టు వలియఁ బాఱుతెంచితి నీవు? భండనంబునఁ గర్ణుఁ | గని పాఱు దని సుయోధనుఁడు సెప్పె; |
|
| తే. |
నది నిజంబుగఁ గొనక బే లైతి; నాదు | బేలతనమునఁ గాదె పాంచాల మాత్స్య పాండ్యులాదిగఁ గలిగిన బంధుమిత్త్ర | జనులు దెగటాఱి రప్రయోజనము గాఁగ.’ |
61 |
| వ. | అని పలికి, కృష్ణునాననం బాలోకించి; ‘కర్ణు నిగ్రహించుట యశక్యం బయ్యె; సుయోధనాది కౌరవులు గనుంగొన వానిచేతం బరిభవింపఁబడి యేను జీవంబుతో నునికిం గడచిన కష్టంబునుం గలదే? యది యట్లుండె; నేను జావు దప్పివచ్చుట వడముడి కతంబునం గలిగె; నతం డొక్కరుండును బ్రాణంబులు డాఁపక పరబలంబులు బడలువడం బోరుచున్నవాఁడు.’ | 62 |
| క. |
అని, పార్థుఁ జూచి యతఁ డి | ట్లను; ‘నేఁ డభిమన్యుఁ డొండె హైడింబుం డొం డెను గలిగిన ని ట్లగునే? విను! మును చేసినది యనుభవింపఁగ వలదే?’ |
63 |
| ఆ. |
‘నిన్నుఁ దృణముఁ జేసి, న న్నాదురాత్ముండు | బంధుహీనుఁ బోలెఁ బఱుప, నెడరు దోఁచి నప్పు డొదవి తొలగించువానిఁ గా | కన్యు నేల బంధుఁ డండ్రు జనులు?’ |
64 |
| చ. |
‘హరి గలుగంగ నేటికి? భయంబున వచ్చితి నీదు గాండివం బెరవుగ నిచ్చి, నీవు నొగ లెక్కి, హరిన్ రథిఁ జేయఁగన్న ని ష్ఠుర భుజవిక్రమోగ్రుఁ డగు సూతతనూభవుఁ దత్సహాయులం బొరిగొనఁడే సుయోధనునిపోఁడిమి దూలఁగ నొక్కమాత్రలోన్?’ |
65 |
| ఆ. |
‘గొంతి కడుపునందుఁ గొడుకుచూలై నీవు | దోఁపకుండ వైతి; తోఁచినట్టి పిండ మెడలి యైనఁ బిదప దిగంబడ | దయ్యె; నింత వుట్ట దట్టు లైన.’ |
66 |