పురాణేతిహాసములు శ్రీమహాభారతము మహాప్రస్థానికపర్వము - ఏకాశ్వాసము
అగ్నిదేవుఁ డర్జును చేతి గాండీవంబు సముద్రంబున వైపించుట (సం. 17-1-33)
సీ. నిలిచి బీభత్సుండు నిర్భర స్నేహంబు | కతమున విడువక గాండివంబు
గొనివచ్చుచున్న నాతనితోడ నవ్వాయు | సఖుఁ ‘డో ధనంజయ! శౌరిచక్ర
మెన్నఁడే దివమున కేఁగె; నీ వేల గాం | డీవంబు విడువవు? దేవకార్య
మునకుఁగా వరుణదేవునిచేత నేను దె | చ్చినయది యీ ధనుశ్రేష్ఠ మమ్మ
 
తే. హానుభావుని కొప్పింపు’ మనిన ‘లెస్స | యట్లు సేయుదుఁగా’ కని యక్కిరీటి
యగ్రజానుజులకుఁ జెప్పి యాదరమున | నాతఁ డచ్చాప మంబుధియందుఁ బెట్టె.
028
వ. తదనంతరంబ కృశానుం డంతర్ధానంబు సేసి; నయ్యోగపరాయణులు పదంపడి. 029
ఆ. దక్షిణాభిముఖతఁ దలకొని యిలకుఁ బ్ర | దక్షిణంబు గాఁగఁ దమ మనములు
తద్ద ముదము నొంద నద్దెస వార్ధి యు | పాంతమునకు నేఁగి రధిపముఖ్య!
030
వ. అచ్చటినుండి. 031
క. పడమర మొగమై పశ్చిమ | జడనిధి తీరంబు సేరఁజని యుత్తర మె
క్కుడు నియతి నడచి వారిథిఁ | బొడ వడఁగిన యాదవేంద్రుపురి చేరువగన్‌.
032
చ. అటఁ జని యశ్రమంబున హిమాచలమున్‌ సమతిక్రమించి వా
రటవులు భూములున్‌ నదులు నద్రులునుం గడుఁబెక్కు లంచితో
త్కట దృఢయోగసేవన నితాంత నిరాకుల వర్తనంబు నొం
దుట గతఖేదులై కడచి తూలక మేరు సమీపభూమికిన్‌.
033
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )