| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | మౌసలపర్వము - ఏకాశ్వాసము |
| సీ. |
ఉన్మార్గ వర్తులై యుండిరి వినుమట్టి | యవసరంబున ఘూర్ణితారుణంబు లయిన నేత్రముల సాత్యకి కృతవర్ముని | వదనంబు గనుఁగొని మద మెలర్ప నొద్ద నిల్చున్న ప్రద్యుమ్ను చే సఱచుచు | నవమాన మేర్పడునట్టి భంగిఁ బెలుచ నవ్వి ‘ యరాతిబృందంబు నిద్రావ | శత్వంబుఁ బొందుటఁ జావువోని |
|
| తే. |
దుష్టదశ నొంది యుండఁగఁ దుచ్ఛుఁడేని | నడరి వధియింపఁగాఁ జొరఁ డనిన రాజ తనయుఁ డంత పాపంబు సేయునె యితండు | పొడిచెనటె యిస్సిరో యిట్టి పోటుఁ బోటె.’ |
042 |
| తే. |
అనినఁ బ్రద్యుమ్నుఁ ‘డిది నీచు లయిన వారి | తెరువు వృష్ణివంశోత్తమ! దీని నిట్లు నీవు వాక్రువ్వ నేటికిఁ? బోవ విడువు; | జను లితనిఁ బ్రువ్వఁ దిట్టుట చాలదెట్లు? |
043 |
| చ. |
అన విని రోషచిహ్నవికృతాననుఁడై కృతవర్మ సాత్యకిం గనుఁగొని ‘సిగ్గులేక యొరుకయ్యము నీకిటు లుగ్గడింపఁగాఁ జనునె? కిరీటి చే నఱక శాంతత నొందిన సోమదత్తనం దను తల ద్రుంపవే మఱచితా యిసిరో యిది పోరిపాడియే?’ |
044 |
| సీ. |
అనియె దానికి హరి యాఙ భోజపతిమీఁదఁ | గడు నెఱ్ఱనైన క్రీఁగంటిచూడ్కి నిగిడించి సక్రోధమగు మానసంబుతో | నఖిలభోజులఁ గలయంగఁ జూచె నప్పుడు సాత్యకి హరితోడఁ ‘గృతవర్ము | ననుజుండు శతధన్వుఁ డనుచితోద్య మమున సత్రాజిత్తు మహితాత్ము మాననీ | యుని శమంతకమణికిని వధించెఁ |
|
| తే. |
గాదె?’ యని వారి దెసఁ గీడు గానిపింపఁ | బలికె; నవ్వాదు విని సత్యభామ కోప మడరి వనితాస్వభావోద్గతాశ్రుపూర | యగుచు హరి యగ్రతలమున కరుగుదెంచె. |
045 |
| క. |
కనుఁగొని హరి కతిరోషము | జనియించెను; దానిఁ జూచి సాత్యకి యద్దే వునకును దేవికినిం బ్రియ | మొనరించెద నని తలంచి యుద్వృత్తుండై. |
046 |
| మ. |
కృతవర్మం బటు దృష్టిఁ జూచి కినుకం గెంపారు వక్త్రంబుతో ‘నితఁ డాచార్య సుతుండు దోడ్పడఁగ రేయెల్లన్ వడిం గిట్టి క ష్టతరోత్సాహత ద్రౌపదేయులను ధృష్టద్యుమ్నుఁ దత్సోదర ప్రతతిం జంపిన నీచు వారల గతింబ్రాపించు టర్హంబగున్.’ |
047 |