యమసభావర్ణనము (సం. 2-8-1)
| క. |
ధర్ముసభ లోక ధర్మా | ధర్మ వివేకాస్పదంబు, తైజసము; లస
ద్భర్మమణితతుల దానిన్ | నిర్మించెను విశ్వకర్మ నిపుణత యొప్పన్.
|
68 |
| వ. |
అది శతయోజనవిస్తారాయామరమణీయంబును గామగామియును సూర్యతేజోనిభశుభతేజంబును సర్వసుఖసంపాదనంబు నయి చూడనొప్పుచుండు; నట్టి సభయం దగస్తిమతంగాదిసిద్ధమునులును బితృదేవతలును గాలకింకరులును మూర్తిమంతులైన కాలచక్రక్రతుదక్షిణదిగ్దేవతలును నుగ్రతపంబులును గృతవీర్యజనమేజయజనకబ్రహ్మదత్తపృషదశ్వశంతనువైన్యభూరిద్యుమ్నేంద్రద్యుమ్నమన్మథ మధుకంఠోపరిచరులును మీ జనకుండయిన పాండుమహారాజును నాదిగాఁ గల యనేకరాజఋషులు నుందురు; వీరిచేత ననవరతంబు సేవితుండయి యమరాజు సమస్తజీవుల శుభాశుభకర్మంబు లారయుచుండు.
|
69 |
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - sabhA parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )