| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
వరుణసభ సర్వలోకో | త్తర ముజ్జ్వలమణిమయము సితప్రభ మతిసుం దర మందుండు వరుణుఁడును | వరుణానీసహితుఁడై ధ్రువంబగు మహిమన్. |
70 |
| వ. | అది యమరాజు సభయంతియ విస్తారాయామ రామణీయకంబులును గామగామిత్వంబునుం గలిగి విలసిల్లు; జలస్తంభంబు సేసి జలంబులలో నుండి విశ్వకర్మ దాని రమణీయంబుగా రచియించె. | 71 |
| సీ. |
అందు సుఖాసీనుఁడైన యవ్వరుణేంద్రు | నంబుధుల్ నాల్గును నధికభక్తిఁ గాళింది నర్మద గంగ గోదావరి | విదిశ విపాశ కావేరి కృష్ణ వేణి సరస్వతి పెన్న యైరావతి | యనఁగఁ బ్రసిద్ధంబులయిన నదులు సరసీతటాక నిర్ఝర దీర్ఘికాదులు | దిక్కులు నఖిల ధాత్రీధరములు |
|
| ఆ. |
వసుమతియును దేహవంతంబులై వచ్చి | మకర కూర్మ శింశుమార సింహ శరభ సామజాది జలచర స్థలచర | తతులతోడ సంతతంబుఁ గొలుచు. |
72 |
| వ. | మఱియు వాసుక్యైరావతాది నాగరాజులును బ్రహ్లాద విరోచన బలి నరక నముచి విప్రచిత్తి కాలకంఠ కైటభ ఘటోదర దశగ్రీవ విశ్వరూప విరూపాక్షాదులయిన దైత్యదానవ వరులును వరుణు సేవించుచుండుదురు. | 73 |