| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ప్రథమాశ్వాసము |
| మధ్యాక్కర |
పరమధర్మాత్మకుఁ డయిన పాండుభూపతిఁదొట్టి సకల ధరణీశులెల్ల యముసభ నుండంగఁ, దా నేమి పుణ్య చరితఁ బ్రవర్తిల్లెనయ్య దేవేంద్రసభ హరిశ్చంద్రుఁ డురుతరమహిమతో దేవపూజ్యుఁడై యుండంగఁ గనియె? |
82 |
| వ. | అని యడిగిన ధర్మరాజునకు హరిశ్చంద్రు మహిమాతిశయంబు నారదుం డి ట్లని చెప్పె. | 83 |
| ఉ. |
దీపితసత్యసంధుఁడు ధృతిస్మృతిధర్మపరాయణుం డయో ధ్యాపురనాయకుండు జలజాప్తకులైకవిభూషణుండు వి ద్యాపరమార్థవేది శరదబ్జసముజ్జ్వలకీర్తిచంద్రికా స్నాపితసర్వలోకుఁడు త్రిశంకునరేంద్రసుపుత్త్రుఁ డున్నతిన్. |
84 |
| సీ. |
జయశీలుఁడయి హరిశ్చంద్రుండు దొల్లి స | ప్తద్వీపములఁ దన బాహుశక్తిఁ జేసి జయించి నిశ్శేషితశత్రుఁడై | ధారుణిలోఁ గల ధరణిపతుల నిజశాసనంబున నిలిపి నిత్యంబైన | మహిమతో సకలసామ్రాజ్య మొప్ప రాజసూయంబు తిరంబుగా నొనరించి | తనరి యథోచితదక్షిణలకు |
|
| ఆ. |
నేనుమడుఁగు లర్థ మిచ్చి యాజకులఁ బూ | జించి భక్తితో విశిష్ట విప్ర జనుల కభిమతార్థసంప్రదానంబులఁ | దృప్తిసేసె వంశదీపకుండు. |
85 |
| క. |
ఉరుతరధనసంతర్పిత | ధరణీసురు లతని నతిముదంబున దీవిం చిరి ‘రాజులందు లోకో | త్తరతేజోధర్మయుక్తిఁ దనరుమ’ యనుచున్. |
86 |
| వ. | వాఁడును బ్రాహ్మణ వచనంబునం జేసి యెల్ల రాజులకు నధికుండయి రాజసూయమహాయజ్ఞకరణంబునం జేసి దేవేంద్రుసాలోక్యంబు వడసె; నట్టి హరిశ్చంద్రు మహిమాతిశయంబు రాజసూయ నిమిత్తంబున నయినదిగా నెఱింగి రాజలోకంబుతో వైవస్వతసభ నుండు భవజ్జనకుండు పాండురాజు నాతో ని ట్లనియె. | 87 |