| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ప్రథమాశ్వాసము |
| వ. | అయ్యుధిష్ఠిరు సందేశంబున దాశార్హుండును దద్దర్శనోత్సుకుం డయి ద్వారవతి గదలి యతిత్వరితగతిం జని నిరంతర ప్రయాణంబుల నింద్రప్రస్థపురంబునకు వచ్చి. | 101 |
| ఉ. |
కుంతికి ధర్మనందనునకున్ వినయంబున మ్రొక్కి, భీము ధీ మంతునిఁ గౌఁగిలించుకొని, మధ్యమపాండవు మాద్రిపుత్త్రులన్ సంతతభక్తినమ్రులఁ బ్రసాదనయోత్కటదృష్టిఁ జూచి, తా నెంతయుఁ బ్రీతి నెత్తికొనియెన్ మహినెత్తిన పుణ్యుఁ డున్నతిన్. |
102 |
| వ. | తదనంతరంబ ధర్మతనయుండు. | 103 |
| క. |
పరమాసనమున నునిచి య | పరిమిత హర్షంబుతో సపర్యావిధులన్ గురుఁ బూజించిన విధమునఁ | గురువృషభుఁ డశేషలోకగురుఁ బూజించెన్. |
104 |
| క. |
ఏమఱక జనుల యోగ | క్షేమంబుల నడపుచున్న కృష్ణుని యోగ క్షేమంబు లడిగి యపుడు మ | హాముదమున ధర్మసుతుఁడు హరి కి ట్లనియెన్. |
105 |
| క. |
ధ్యేయుఁడవు సకల లోక | స్థేయుండవు నమ్రులకు విధేయుఁడవు నయో పాయజ్ఞుఁడ విజ్జగముల | నీ యెఱుఁగని యవియుఁ గలవె నీరజనాభా! |
106 |
| వ. | అయినను నాయర్థిత్వంబునంజేసి నీ కెఱింగించెద. | 107 |
| సీ. |
‘పాండుమహీపతి పనిఁజేసి నారద | ముని వచ్చి వీ రెల్ల వినుచు నుండ రాజసూయంబు తిరంబుగాఁ జేసి నీ | పితృపితామహులకు హితము సేయు మని పంచె నన్ను; నెయ్యముననో, నాకట్టి | బలము సామర్థ్యంబుఁ గలుగు టెఱిఁగి పంచెనో, తత్క్రతు ప్రారంభమున కొడం | బడితి వీ రిందఱుఁ గడఁగి దీని |
|
| ఆ. |
నిత్యసత్యవచన! నిపుణనిర్మలబుద్ధి | నిర్ణయించి పనుప నీ నియోగ కాంక్ష నున్నవాఁడఁ గమలాక్ష!’ యనిన ధ | ర్మాత్మజునకు నిట్టు లనియెఁ జక్రి. |
108 |