| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ప్రథమాశ్వాసము |
| సీ. |
‘సమకట్టి సైన్యంబు సైన్యంబుతో నొండెఁ, | దొడరి మీ మువ్వురతోడ నొండె. నిద్దఱతో నొండె, నెక్కటి యొక్కని | తో నొండెఁ, బొడిచెద దోర్బలమున నే యాయుధంబున నెమ్మెయిఁ బోరంగ | నిష్ట మయ్యది యుత్సహింపుఁ’ డనిన, ‘నొక్కనితోఁ బల్వు రుద్ధతులయి పూని | యుద్ధంబు సేయుట యుచితమగునె? |
|
| ఆ. |
యధిక బాహుబలులమయిన మా మువ్వుర | యందు నొక్కరుని మహాబలాఢ్యుఁ గోరికొనుము; వాఁడు ఘోరాజిలో నిన్ను | మొనసి మల్లయుద్ధమున జయించు.’ |
198 |
| క. |
అనిన మురవైరి పలుకులు | విని బార్హద్రథుఁడు భూరివీర్యు మరున్నం దనుఁ గోరికొనియె ‘నీతం | డని నెన యగు నాకు’ ననుచు నతిదర్పితుఁడై. |
199 |
| వ. | ఇట్లు జరాసంధుండు భీమసేనుతో మల్లయుద్ధంబు సేయ నిశ్చయించి తన తనయు సహదేవుని రాజ్యంబున కభిషిక్తుంజేసి పురోహిత కృత స్వస్త్యయనుండై. | 200 |
| ఆ. |
బలియుఁ డపుడు వెండ్రుకలు పాచి ముడిచి గం | టెసఁగఁ దాల్చి వీరరసికవృత్తి నుద్ధతుండు మల్లయుద్ధ ప్రసాధనం | బమర నిలిచె వేడ్క నమితబలుఁడు. |
201 |
| వ. | భీమసేనుండును వానికి నక్కజంబుగా మల్లయుద్ధ సన్నద్ధుం డయి ప్రతిభటించి నిలిచె నంత. | 202 |