| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | సభాపర్వము - ద్వితీయాశ్వాసము |
| ఉ. |
పాలితదుర్ణయుండు శిశుపాలుఁడు బాలుఁడు; వీని నేల భూ పాలక! నీకుఁ బట్టువఱుపన్? మఱి ధర్ము వెఱుంగ వీనికిం బోలునె రాగకోప పరిభూత మనస్కున కల్పరాజ్య ల క్ష్మీ లలనాంధబుద్ధి కనిమిత్త మహత్పరివాదశీలికిన్? |
22 |
| వ. | అని ధర్మరాజును వారించి శిశుపాలుం జూచి భీష్ముం డిట్లనియె. | 23 |
| చ. |
అవినయబుద్ధివై హరికి నర్ఘ్య మయోగ్యమ యంటి; నీవు మూ ర్ఖవు శిశుపాల! యింకఁ బలుకన్ వలసెన్ సభలోన నున్న యీ యవనిపులెల్ల నాతని దయం బరిముక్తులు, వానిచేత నా హవ జితులుం, దదీయశరణార్థులుఁగా కొరులయ్య చెప్పుమా! |
24 |
| తే. |
ఉత్తమ జ్ఞానవృద్ధు నా నుండె నేని | బాలుఁ డయ్యును బూజ్యుండు బ్రాహ్మణుండు; క్షత్త్రియుఁడు పూజ్యుఁ డమితవిక్రమసమృద్ధి | నుర్విపతులలో నధికుఁడై యుండె నేని. |
25 |
| క. |
ఈ రెండు కారణముల ము | రారాతియ యర్ఘ్యమునకు నర్హుఁడు; జగదా ధారుండు మాక కాదు, స | దారాధ్యుఁడు విష్టపత్రయావాసులకున్. |
26 |
| క. |
వృద్ధు లొకలక్ష యున్నను | బుద్ధియె యెవ్వరికి వారిఁ బూజింపంగా; నిద్ధరణీశులలో గుణ | వృద్ధని పూజించితిమి త్రివిక్రము భక్తిన్. |
27 |
| క. |
పూజితుల తృప్తులగుదురు | భూజను లొరు; లచ్యుతుండు పూజితుఁ డగుడుం దేజమున జగత్త్రితయముఁ | బూజితమయి తృప్తిఁబొందుఁ బుణ్యసమృద్ధిన్. |
28 |
| సీ. |
‘బుద్ధియు మనమును బురుషుండు నవ్యక్త | మగుచున్న ప్రకృతియు నంబరంబు ధరణియుఁ దరణియు దహనుండుఁ జంద్రుండు | గాడ్పును దిక్కులుఁ గాలములును దానయై జంగమస్థావరాత్మకమైన | సకల భూత ప్రపంచంబు నెల్లఁ దన దివ్యశక్తిమైఁ దాల్చిన సర్వాత్ము | సర్వభూతేశ్వరు సర్వవంద్యు |
|
| ఆ. |
నధికయోగ నిష్ఠితాత్మకులగు మహా | యోగివరులు తత్త్వయుక్తిఁజేసి యెఱిఁగినట్టు నీకు నెఱుఁగంగఁబోలునే?’ | యనుచు భీష్ముఁ డన్న యవసరమున. |
29 |
| చ. |
ఎడపక యర్ఘ్య మచ్యుతున కిచ్చితి; మిచ్చిన దీని కిం దొడం బడ మని దుర్జనత్వమునఁ బల్కెడువీరుల మస్తకంబుపై నిడియెద నంచుఁ దాఁ జరణమెత్తె సభన్ సహదేవుఁ డట్టిచో నుడిగి సభాసదుల్ వలుకకుండిరి తద్దయు భీతచిత్తులై. |
30 |
| చ. |
చెలువుగఁ బుష్పవృష్టి గురిసెన్ సహదేవుపయిన్; దివంబునన్ వెలయఁగ సాధువాదములు వించె; సభాసదులెల్ల విస్మయా కులిత మనస్కులైరి; తన కుంచెయుఁ గృష్ణమృగాజినంబునుం బలుమఱు వీచుచుం గలహబంధుఁడు నారదుఁ డాడె వేడుకన్. |
31 |
| వ. | అంత శిశుపాలుసేనాపతి సునీథుండను వాఁ డతిరోషపరుషవచనుం డగుచు, స్వపక్షక్షత్త్రియులనెల్ల నొక్కంతం జేర్చికొని, శిశుపాలు ననుమతంబున యుద్ధసన్నద్ధుం డయియున్న సమయంబున. | 32 |
| చ. |
రయవిచల త్తురంగమ తరంగములన్ మదనాగనక్ర సం చయముల సంచలచ్చటుల సైనిక మత్స్యములన్ భయంకరం బయి యదువృష్ణిభోజ కుకురాంధక వాహినియుం గలంగె ని ర్దయతరరోషమారుత నితాంత సమీరితమై క్షణంబునన్. |
33 |
| వ. | అట్టి సకల క్షత్త్రియ క్షోభంబు సూచి భయసంభ్రమాక్రాంత హృదయుండయి ధర్మరాజు భీష్మున కి ట్లనియె. | 34 |
| తరలము |
ధరణిలోఁ గల రాజు లెల్లను దారుణక్షయకాలసా గరములట్లు గలంగి; రిప్డు మఖప్రయోగము విఘ్నముం బొరయ కుండఁ బ్రజాపకారము వుట్టకుండఁగ నీవు చె చ్చెరఁ బితామహ! వీరి కిచ్చటఁ జిత్తశాంతి యొనర్పవే. |
35 |
| వ. | అనిన ధర్మరాజునకు భీష్ముం డి ట్లనియె. | 36 |
| క. |
నీ యజ్ఞమునకు విఘ్నము | సేయఁగ నోపుదురె యొరులు? జితదైత్యుఁడు నా రాయణుఁడు యజ్ఞపురుషుఁ డ | జేయ పరాక్రముఁడు దీనిఁ జేకొని కావన్. |
37 |
| సీ. |
‘చైద్యునకై పూని సన్నద్ధులై యున్న | యీ రాజు లిందఱు నీక్షణంబ హరి యల్గి చూచుడు నంతకక్షయమున | కరిగెడు వార; ఘోరాహవమున దమఘోషనందనుదర్పంబు నిప్పుడ | యడఁగెడుఁ; గడుఁబెక్కులయ్యుఁ గుక్క లిభకుంభదళనమహిష్ఠనిష్ఠురనఖ | ముఖుఁడగు హరిమీఁద మొఱిఁగి యేమి |
|
| ఆ. |
సేయనోపుఁ? గృష్ణు సింహపరాక్రము | నెఱుఁగకున్నవారె యెల్లవారు?’ ననిన భీష్ముపలుకు లవి కర్ణశూలంబు | లయినఁ జేదినాథుఁ డాగ్రహించి. |
38 |